Tollywood: చిరు కోపం చీరగట్టి.. సిగ్గును చెంగున దాచిన ముద్దుగుమ్మ.. ఈ సొగసరి ఎవరో గుర్తుపట్టగలరా ?..

తాజాగా ఓ అందాల తార క్రేజీ వీడియోను నెట్టింట షేర్ చేసింది. పైన ఫోటోను చూశారు కదా.. ఆ సొగసరి ఎవరో గుర్తుపట్టగలరా ?.. బుల్లితెరపై ఈ ముద్దుగుమ్మకు భారీగా ఫాలోయింగ్ ఉంది. పలు చిత్రాల్లో సహయ నటిగా కనిపించి మెప్పించింది. బిగ్‏బాస్ రియాల్టీ షోలో పాల్గొని సూపర్ క్రేజ్ సంపాదించుకున్న అతికొద్ది మంది భామల్లో ఈ బ్యూటీ మొదటి స్థానంలో ఉంటుంది. సిల్వర్ స్క్రీన్ అయినా.. సోషల్ మీడియా అయినా తన కళ్లతో మాయ చేస్తుంది. నటనపై ఆసక్తిగా మోడల్ గా కెరీర్ ప్రారంభించింది ఈ తెలుగింటి ముదుగుమ్మ.

Tollywood: చిరు కోపం చీరగట్టి.. సిగ్గును చెంగున దాచిన ముద్దుగుమ్మ.. ఈ సొగసరి ఎవరో గుర్తుపట్టగలరా ?..
Actress...
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 04, 2024 | 10:40 PM

సినీతారలు సోషల్ మీడియాలో చేసే సందడి గురించి తెలిసిందే. స్టార్ హీరోహీరోయిన్స్… నిత్యం తమ వ్యక్తిగత విషయాలు, మూవీ అప్డేట్స్ అభిమానులతో పంచుకుంటారు. అప్పుడప్పుడు లైవ్ చిట్ చాట్స్ అంటూ నెటిజన్లతో నేరుగా ముచ్చటిస్తారు. ఇక అందాల తారలు నిత్యం లేటేస్ట్ ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తుంటారు. తాజాగా ఓ అందాల తార క్రేజీ వీడియోను నెట్టింట షేర్ చేసింది. పైన ఫోటోను చూశారు కదా.. ఆ సొగసరి ఎవరో గుర్తుపట్టగలరా ?.. బుల్లితెరపై ఈ ముద్దుగుమ్మకు భారీగా ఫాలోయింగ్ ఉంది. పలు చిత్రాల్లో సహయ నటిగా కనిపించి మెప్పించింది. బిగ్‏బాస్ రియాల్టీ షోలో పాల్గొని సూపర్ క్రేజ్ సంపాదించుకున్న అతికొద్ది మంది భామల్లో ఈ బ్యూటీ మొదటి స్థానంలో ఉంటుంది. సిల్వర్ స్క్రీన్ అయినా.. సోషల్ మీడియా అయినా తన కళ్లతో మాయ చేస్తుంది. నటనపై ఆసక్తిగా మోడల్ గా కెరీర్ ప్రారంభించింది ఈ తెలుగింటి ముదుగుమ్మ. ఓవైపు సినిమాల్లో తన నటనతో అలరిస్తూనే.. మరోవైపు ఇన్ స్టాలో ఫుల్ చురుకుగా ఉంటుంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫోటోస్, రీల్స్ షేర్ చేస్తుంటుంది. తాజాగా ఈబ్యూటీ షేర్ చేసిన వీడియో నెట్టింట తెగ వైరలవుతుంది. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా ?.. తనే బిగ్ బాస్ బ్యూటీ దివి వైద్య.

దివి వైద్య.. హైదరాబాద్ అమ్మాయి. గ్రాడ్యుయేషన్ అనంతరం నటనపై ఆసక్తితో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. 2019లో సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 4లోకి కంటెస్టెంట్ గా అడుగుపెట్టింది. ఈ షోలో తన అమాయకత్వం, మాటలతో ఫాలోయింగ్ సంపాదించుకుంది. కానీ తక్కువ సమయంలోనే హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. ఆ తర్వాత తెలుగులో పలు సినిమాల్లో నటించింది.

View this post on Instagram

A post shared by Divi Vadthya (@actordivi)

ఏ1 ఎక్స్ ప్రెస్, క్యాబ్ స్టోరీస్, మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ మూవీలో కనిపించింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించిన దివి.. ఓ ప్రైవేట్ సాంగ్ చేసింది. ప్రస్తుతం దివి సోషల్ మీడియాలో యాక్టివ్‏గా ఉంటూ.. ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోషూట్స్ షేర్ చేస్తుంది. తాజాగా తెల్ల చీరలో.. జడలో మల్లెపూలతో రీల్ చేసింది. ఈ వీడియోను షేర్ చేస్తూ.. “సిరి మల్లెలు హరి నీలపు జడలో తురిమి.. క్షణమే యుగమై వేచి వేచి.. చలి పొంగులు తొలి కోకాల ముడిలో అదిమి.. అలసి సొలసి కన్నులు వాచీ” అంటూ.. సొగసు చూడ తరమా పాటలోని లిరిక్స్ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతుంది.

View this post on Instagram

A post shared by Divi Vadthya (@actordivi)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?