
దాదాపు రెండు దశాబ్దాలుగా సినీరంగంలో అగ్ర కథానాయికగా దూసుకుపోతుంది త్రిష. ఇప్పటికీ చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు త్రిష నటించిన నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. అజిత్ కుమార్ తో 2 సినిమాలు, టోవినో థామస్ తో ఒక సినిమా, కమల్ హాసన్ తో 1 సినిమా చేసింది. అజిత్ కుమార్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా విడుదలై సూపర్ హిట్ అయింది. ఈ సినిమాకు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ఆమె అజిత్ కుమార్ భార్య పాత్ర పోషించింది. ఈ సినిమా ఏప్రిల్ 2025లో విడుదలైంది. ఆమె చిరంజీవి నటిస్తున్న తెలుగు సినిమా విశ్వంభర చిత్రంలో నటిస్తుంది. ఇదిలా ఉంటే.. తాజాగా SIIMA అవార్డుల ప్రదానోత్సవానికి హాజరయ్యారు త్రిష.
ఇవి కూడా చదవండి : Actress: తస్సాదియ్యా.. క్రేజీ ఫోటోలతో గత్తరలేపుతున్న యాంకరమ్మ.. ఈ ముద్దుగుమ్మను గుర్తుపట్టరా.. ?
ఈ కార్యక్రమంలో ఆమెకు విజయ్ ఫోటో చూపించి ఆయన గురించి చెప్పాలని అడిగారు. “విజయ్ కలలు నెరవేరాలి” చెబుతూ తెగ సిగ్గు పడిపోయింది త్రిష. ఆ కార్యక్రమంలో వేదికపై దళపతి విజయ్ ఫోటోను రాగానే స్టేజ్ మొత్తం దద్దరిల్లిపోయింది. అక్కడే ఉన్న అభిమానులు పెద్దగా అరుస్తూ గోల గోల చేశారు. ఆ సమయంలో త్రిష మాత్రం సిగ్గుపడుతున్నారు. విజయ్ కొత్త ప్రయాణానికి తన అభినందనలు తెలిపింది త్రిష.
ఇవి కూడా చదవండి : Serial Actres: 16 ఏళ్లకే ఆడిషన్.. ఆపై బీ గ్రేడ్ సినిమాలు.. ఈ సీరియల్ హీరోయిన్ కష్టాలు చూస్తే..
అతని కలలు ఏవైనా కావచ్చు, అవి ఖచ్చితంగా నెరవేరుతాయి. అతను దానికి అర్హుడు అంటూ చెప్పుకొచ్చింది త్రిష. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది. అర్చనతో పాటు నటి త్రిష, అభిరామి, నిర్మాత కల్పతి అగోరం హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోను సైమా తన ట్విట్టర్ పోస్ట్‌లో షేర్ చేయడం గమనార్హం.
ఇవి కూడా చదవండి : Tollywood : ఒకరు తోపు డైరెక్టర్.. ఇంకొకరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్.. ఈ ఇద్దరి టాలెంట్‌కు ప్రపంచమే జై కొట్టింది..
@trishtrashers mam wished @actorvijay sir for his Journey❤️🔥 #SIIMA2025
A beautiful moment of respect and admiration.#TrishaKrishnan #SouthQueen #Trisha #vijay #SIIMA pic.twitter.com/JLVepWx4Ht
— Trisha😻Sushma (@Trishkrish_583) September 7, 2025
ఇవి కూడా చదవండి : Cinema: ఇది సక్సెస్ అంటే.. రూ.4 కోట్లు పెడితే.. రూ.121 కోట్ల కలెక్షన్స్.. థియేటర్లను శాసించిన సినిమా..