ఆ స్టార్ హీరో చాలా గొప్పవాడు..! నచ్చితే ప్రాణమిస్తాడు.. నచ్చకపోతే తాట తీస్తాడు..!!

ప్రఖ్యాత రచయిత చిన్నికృష్ణ, నందమూరి బాలకృష్ణ సినీ, రాజకీయ ప్రస్థానంపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. నరసింహ నాయుడు సహా బాలకృష్ణ అద్భుత నటనను కొనియాడుతూనే, హిందూపురం ఎమ్మెల్యేగా ఆయన సేవలను ప్రస్తావించారు. అలాగే ఆయనతో సినిమా చేసిన అనుభవాలను పంచుకున్నారు .

ఆ స్టార్ హీరో చాలా గొప్పవాడు..! నచ్చితే ప్రాణమిస్తాడు.. నచ్చకపోతే తాట తీస్తాడు..!!
Tollywood Hero

Updated on: Jun 24, 2026 | 10:56 AM

సినీ రచయిత చిన్నికృష్ణ, నందమూరి బాలకృష్ణ సినీ, రాజకీయ ప్రస్థానంపై  ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన అనేక విషయాలను పంచుకున్నారు. చిన్నికృష్ణ బాలకృష్ణను “రోరింగ్ టైగర్”గా అభివర్ణించారు, ముఖ్యంగా నరసింహ నాయుడు చిత్రంలో ఆయన నటనను ప్రశంసించారు. ఆయన మాట్లాడుతూ.. చిన్నికృష్ణ బాలకృష్ణను “ఉత్తమ నటుడు”గా, “అభినయసాగరాన నవరసాల తృష్ణ నందమూరి బాలకృష్ణ”గా అభివర్ణించారు. ముద్దుల మావయ్య, మంగమ్మగారి మనవడు, లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్పెక్టర్ వంటి చిత్రాల ద్వారా ఆయన విశ్వరూపాన్ని గుర్తు చేసుకున్నారు. తన గురువు విజయేంద్ర ప్రసాద్ రాసిన సమరసింహారెడ్డి చిత్రంతో బాలకృష్ణ ఇండస్ట్రీ బ్రేకింగ్ హిట్‌ను అందుకున్నారని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి :కొడక్కు పెళ్ళై 9 నెలలు, సినిమా మొదలై 9 రోజులు.! కట్ చేస్తే సముద్రంలో శవమై.. గొల్లపూడి మారుతీరావు జీవితంలో ఇంత విషాదమా.!!

తన కెరీర్‌లో బాలకృష్ణతో కలిసి నరసింహ నాయుడుకు పని చేసే అవకాశం లభించినప్పుడు, ఆయనతో పని చేయాలనే కాంపిటీటివ్ స్పిరిట్ ఉండేదని చిన్నికృష్ణ పంచుకున్నారు. బాలకృష్ణకు నచ్చితే కొత్త రచయితలు, దర్శకులైనా అవకాశమిస్తారని, నచ్చితే ప్రాణం ఇస్తాడని లేదంటే తాట తీస్తాడని సరదాగా చెప్పారు. పరుచూరి గోపాలకృష్ణ తనను బాలకృష్ణకు పరిచయం చేసి, నరసింహ నాయుడుకు కథ రాయడానికి ప్రోత్సహించారని చిన్నికృష్ణ గుర్తు చేసుకున్నారు.

ఇది కూడా చదవండి : ఇన్నాళ్లు ఇది మనకు తెలీదే.. ఖడ్గం సినిమాలో సోనాలి బింద్రేకు డబ్బింగ్ చెప్పింది ఈ హీరోయినా.!!

నరసింహ నాయుడు చిత్రంలో సిమ్రాన్‌తో ఎమోషనల్ సన్నివేశాలు, కుటుంబాన్ని రైలు ఎక్కించే ఎపిసోడ్, గండ్ర గొడ్డలి వీపులో దిగినా బెరవకుండా చేసే పోరాట సన్నివేశాలను ఆయన ఉదాహరణగా చెప్పారు, బాలకృష్ణను “నటసింహం”, “రోరింగ్ టైగర్”గా ప్రశంసించారు. నటుడిగా కొనసాగుతూనే, బాలకృష్ణ హిందూపురం శాసనసభ నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు శాసనసభ్యుడిగా గెలిచి రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. చిన్నికృష్ణ ఈ విషయంలో బాలకృష్ణ స్క్రిప్ట్ సెలక్షన్, గెటప్‌లు, పరిశ్రమలో ఆయన స్థానం, సింహాసనాన్ని ఇంకా పట్టుకునే విధానాన్ని అభినందించారు.

ఇది కూడా చదవండి : అప్పుడు నన్ను బండబూతులు తిట్టారు.. తప్పని పరిస్థితుల్లో ఆ సినిమా చేయాల్సి వచ్చింది: నందిని రెడ్డి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us