టాలీవుడ్ స్టార్ హీరో, ఎమ్మెల్యే నందమూరి బాలయ్యకి అనారోగ్యం.. ఆందోళనలో ఫ్యాన్స్

టాలీవుడ్ స్టార్ హీరో, ఎమ్మెల్యే బాలకృష్ణ అనారోగ్యానికి గురయ్యారు. ఈ విషయాన్నీ ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్ అధికారికంగా ప్రకటించడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఏపీ కూటమి ప్రభుత్వం నిర్వహించిన సూపర్ సిక్స్ – సూప‌ర్ హిట్‌ కార్యక్రమంలో కేశవ్ మాట్లాడుతూ.. బాలయ్య అనారోగ్య విషయాన్ని వెల్లడించాడు. దీంతో ఫ్యాన్స్ తమ అభిమాన హీరో ఆరోగ్యం విషయంపై అరా తీస్తున్నారు.

టాలీవుడ్ స్టార్ హీరో, ఎమ్మెల్యే నందమూరి బాలయ్యకి అనారోగ్యం.. ఆందోళనలో ఫ్యాన్స్
Nandamuri Balakrishna

Updated on: Sep 11, 2025 | 8:29 AM

టాలీవుడ్ స్టార్ హీరో, ఎమ్మెల్యే బాలకృష్ణ అనారోగ్యానికి గురయయ్యరనే వార్తని ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్ సూపర్ సిక్స్, సూపర్ హిట్ కార్యక్రమంలో చెప్పారు. ఈ విషయం తెలిసినప్పటి నుంచి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. సోషల్ మీడియాలో బాలకృష్ణ ఆరోగ్య స్థితి, చికిత్స వివరాల గురించి అడుగుతున్నారు. అయితే ఏ విషయం అధికారిక ప్రకటన విడుదల కాలేదు. సూపర్ సిక్స్ – సూప‌ర్ హిట్‌ సభకు బాలయ్య రావాల్సి ఉందని.. అయితే కొంచెం అనారోగ్యంతో బాధపడుతున్న బాలకృష్ణ రాలేకపోయారని చెప్పారు. దీంతో బాలయ్య అభిమానుల్లో ఆందోళన మొదలైంది. బాల‌య్య ఆరోగ్యానికి ఏం జ‌రిగింది అనే విష‌యంపై స్పష్టమైన వార్తలు తెలియకపోవడంతో అభిమానుల్లో ఆయన ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు.

ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు ఎమ్మెల్యేగా తన విధులను నిర్వహిస్తున్నారు. హిందూపురం నియోజవర్గం నుంచి తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యేగా వరసగా మూడు సార్లు గెలుపొందారు. మరోవైపు తాను నటించిన సినిమాలతో సూపర్ హిట్ అందుకుంటున్నారు. నాలుగు హిట్స్ అందుకున్న బాలయ్య.. డబల్ హ్యాట్రిక్ దిశగా సాగుతున్నాడు. అఖండ సీక్వెల్ తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..