Tollywood: సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ ఛాయాగ్రాహకులు, దర్శక నిర్మాత రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad) తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆయన శుక్రవారం కన్నుమూశారు. కాగా ఆటగదరా శివ, అందరి బంధువయ, ఆనలుగురు వంటి సినిమాలతో విమర్శకుల ప్రశంసలు, మన్ననలుఅందుకున్న ప్రముఖ దర్శకుడు చంద్రసిద్ధార్థ్‌కు ఈయన సోదరుడు. కాగా 1995లో వచ్చిన నిరంతరం సినిమాకు దర్శకనిర్మాత, రచయితగా వ్యవహరించారు రాజేంద్ర ప్రసాద్. ఈ సినిమా పలు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ లో కూడా ప్రత్యేకంగా ప్రదర్శించబడింది. ముఖ్యంగా మలేషియాలోని కైరో ఫిలిం ఫెస్టివల్‌లో కూడా సందడి చేసింది. అలాగే హాలీవుడ్‌లో మన్ విమన్ అండ్ ది మౌస్, రెస్డ్యూ – వేర్ ది ట్రూత్ లైస్, ఆల్ లైట్స్, నో స్టార్స్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. రాజేంద్రప్రసాద్ స్పెషాలిటీ ఏంటంటే.. ఆయన దర్శకత్వం వహించిన సినిమాలన్నింటికీ ఆయనే సినిమాటోగ్రఫీ, రైటింగ్ బాధ్యతలు నిర్వర్తించడం.
తెలుగులో మేఘం, హీరో సహా పలు చిత్రాలకు రాజేంద్ర ప్రసాద్ సినిమాటోగ్రాఫర్ గా పని చేశారు. రచయితగానూ ఆయన మంచి గుర్తింపు పొందారు. అలాగే హిందీ చిత్ర పరిశ్రమలో కూడా కొన్ని సినిమాలకు వర్క్ చేశారు. గత కొన్నేళ్లుగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ముంబైలోనే ఉంటున్నారు. గత కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈరోజు తుదిశ్వాస విడిచారు. కాగా రాజేంద్రప్రసాద్ మరణ వార్త టాలీవుడ్‌లో విషాదం నింపింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులు అర్పిస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..