Producer SKN: మరోసారి నిర్మాత ఎస్కేఎన్ గొప్ప మనసు.. తనను తిట్టిన హీరోయిన్ తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో..

బేబీ సినిమాతో టాలీవుడ్ లో మంచి నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్నారు నిర్మాత ఎస్కేఎన్ అలియాస్ శ్రీనివాస్ కుమార్. ప్రస్తుతం పలు సినిమాల రూపకల్పనలో బిజీగా ఉన్న ఆయన మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. ఓ టాలీవుడ్ హీరోయిన్ కు ఆర్థిక సాయం చేసి అండగా నిలిచారు.

Producer SKN: మరోసారి నిర్మాత ఎస్కేఎన్ గొప్ప మనసు.. తనను తిట్టిన హీరోయిన్ తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో..
Producer SKN

Updated on: Sep 08, 2025 | 6:49 PM

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత ఎస్కేఎన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బేబీ సినిమాతో ఒక్కసారిగా ఫేమస్ అయిన ఆయన ఇప్పుడు పలు సినిమాలను నిర్మించే పనుల్లో బిజీగా ఉంటున్నారు. సినిమాలతో పాటు తన స్పీచ్‌లు, సోషల్ మీడియా పోస్టులతోనూ తరచూ వార్తల్లో నిలుస్తుంటారు ఎస్కేఎన్. ఇవి కొందరిక నచ్చవచ్చు.. మరికొందరికి నచ్చక పోవచ్చు. అయితే ఒక్క విషయంలో మాత్రం ఎస్కేఎన్‌ను అందరూ మెచ్చుకోవాల్సిందే. అదే ఆయన చేస్తోన్న గుప్త దానాల గురించి. గతంలో కష్టాల్లో ఉన్న ఎంతో మందికి ఆపన్న హస్తం అందించారు ఎస్కేఎన్. ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నామని సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే చాలు అన్ని విషయాలు కనుక్కుని మరీ సాయం చేస్తున్నారు. అయితే వీటి గురించి ఎస్కేఎన్ పెద్దగా బయటకు చెప్పుకోరు. ఇప్పుడు మరో హీరోయిన్ కు ఆర్థిక సాయం చేసి వార్తల్లో నిలిచారీ క్రేజీ ప్రొడ్యూసర్.

విశాఖపట్నానికి చెందిన రేఖా బోజ్ గతంలో పలు సినిమాల్లో నటించింది. మాంగల్యం, దామిని విల్లా, రంగేలా, కళ్యాణ తస్మై నమహ: తదితర చిత్రాల్లో హీరోయిన్ గా, సపోర్టింగ్ పాత్రల్లో యాక్ట్ చేసింది. అయితే సినిమా అవకాశాలు కరువవ్వడంతో ప్రస్తుతం కవర్ సాంగ్‌లు, వీడియో ఆల్బమ్స్ చేస్తూ నెట్టింట ట్రెండ్ అవుతుంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రేఖ కొన్ని రోజుల క్రితం తండ్రికి హెల్త్ బాగోలేదని, ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నాను అని ఒక పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ నిర్మాత ఎస్కేఎన్ చూడడంతో ఆమె తండ్రి చికిత్స కోసం ఆర్ధిక సహాయం చేసారు. అయితే ఈ విషయాన్ని ఆయన బయటకు చెప్పలేదు.. కానీ రేఖా బోజ్ స్నేహితుల ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

ఈ క్రమంలోనే రేఖా కూడా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. నిర్మాత SKN పేరు చెప్పకుండా.. మా నాన్నగారికి సర్జరీ అన్న పోస్ట్ చూసి, పరిచయం లేకున్నా, అడగకుండానే ఒక తెలుగు ప్రొడ్యూసర్ గారు పెద్ద సహాయాన్ని అందించారు. మీ హెల్ప్ నాకు చాలా చాలా విలువైనది సార్. చాలా థాంక్స్ అండి’ అని రాసుకొచ్చింది. కాగా గతంలో తెలుగు హీరోయిన్స్‌పై ఎస్.కె.ఎన్ చేసిన కొన్ని కామెంట్లను ఆధారంగా చేసుకుని రేఖా భోజ్ ఈ నిర్మాతపై చిందులు వేసింది. ఎస్కేఎన్ మీద సంచలన కామెంట్స్ చేసింది. అయితే అవేవీ మనసులో పెట్టుకోకుండా ఎస్కేఎన్ రేఖా భోజ్ కు సాయం చేశాడన్న వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.