
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ ఇప్పుడేమీ సినిమాలు చేయడం లేదు. కానీ సినిమా హీరోల ఫంక్షన్లకు, సినిమా సక్సెస్ ఈవెంట్లకు తరచూ హాజరవుతున్నాడు. ఎప్పటిలాగే తన కామెంట్స్ తో నెట్టింట ట్రెండ్ అవుతున్నాడు. ఇటీవల కిరణ్ అబ్బవరం కే- ర్యాంప్ సక్సెస్ ఈవెంట్ లో ఓ టాలీవుడ్ హీరోనూ ఉద్దేశిస్తూ బండ్లన్న చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఈ కామెంట్స్ కు సదరు హీరోలు కూడా స్ట్రాంగ్ కౌంటర్లిస్తున్నారు. కాగా ఈ మధ్యన తరచూ సినిమా ఈవెంట్లకు తరచూ హాజరవుతున్నాడు బండ్లన్న. అలాగే ఆ మధ్యన దీపావళి పండగను పురస్కరించుకుని టాలీవుడ్ సెలబ్రిటీలందరికీ గ్రాండ్ గా పార్టీ కూడా ఇచ్చాడు. దీంతో ఈ నిర్మాత మళ్లీ సినిమాలు చేస్తాడేమోనని చాలా మంది అనుకుంటున్నారు. దీనికి తోడు గతనెలలో తెలుసు కదా మూవీ ఈవెంట్‌లో బండ్ల గణేశ్ ఆసక్తిక కామెంట్స్ చేశారు. ‘నేను టెంపర్ సినిమాతో బ్రేక్ తీసుకున్నా.. ఫ్లాప్ మూవీతో కాదు, బ్లాక్‌బస్టర్ సినిమా తర్వాత బ్రేక్ తీసుకున్నా.. ఇప్పుడు మొదలవుతుంది సెకండాఫ్’ అంటూ మాట్లాడడంంతో తన రీఎంట్రీ ఉంటుందని చాలా మంది భావించారు. చిరంజీవి, పవన్ కల్యాణ్ తో సినిమాలు చేస్తాడని ప్రచారం జరుగుతోంది. ఈ విషయాలపైనే బండ్ల గణేష్ ఇప్పుడు రియాక్టయ్యాడు. సోషల్ మీడియా వేదికగా దీని గురించి ఒక క్లారిటీ ఇచ్చాడు.
‘ మిత్రులకు, శ్రేయోభిలాషులకు నా హృదయపూర్వక విన్నపం. ప్రస్తుతం నేను ఏ సినిమాను నిర్మించడం లేదు. అలాగే ఎవరితోనూ సినిమా చేయాలనే నిర్ణయం కూడా తీసుకోలేదు. దయచేసి ఇలాంటి వార్తలు రాయడం ద్వారా నన్ను ఇబ్బంది పెట్టకండి. మీ అందరి ప్రేమ, మద్దతు ఎప్పుడూ నాతోనే ఉండాలి. చేతులెత్తి నమస్కరిస్తూ ఇంతటితో విన్నవించుకుంటున్నా. ఇట్లు మీ బండ్ల గణేశ్’ అంటూ రాసుకొచ్చాడు బండ్లన్న. అంటే ఇప్పట్లో అతను సినిమాలు నిర్మించే అవకాశం లేదని తెలుస్తోంది.
మిత్రులకు, శ్రేయోభిలాషులకు నా హృదయపూర్వక విన్నపం:
ప్రస్తుతం నేను ఏ సినిమాను నిర్మించడం లేదు, అలాగే ఎవరితోనూ సినిమా చేయాలనే నిర్ణయం కూడా తీసుకోలేదు.
దయచేసి కానీ వార్తలు రాయడం ద్వారా నన్ను ఇబ్బంది పెట్టకండి.
మీ అందరి ప్రేమ, మద్దతు ఎప్పుడూ నాతో వుండాలి
చేతులెత్తి నమస్కరిస్తూ…— BANDLA GANESH. (@ganeshbandla) November 4, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.