Tollywood: తెలుగు ఇండస్ట్రీని తరలించేందుకు కుట్రలు జరుగుతున్నాయా..?
టాలీవుడ్ ట్రబుల్ షూటర్స్ అంతా షూటింగ్స్‌ను షిప్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారా..? ఫెడరేషన్ కూల్చే కుట్ర చాలా ప్లాన్డ్‌గా సిద్ధం చేస్తున్నారా ? పైకి వేతన సమస్యే..కానీ దానివెనుక తెరను తరలించాలని ట్రై చేస్తున్నారా ? సంచలన అభియోగాలకు సంబంధించి డీటేల్స్ తెలుసుకుందాం పదండి..

తెలుగు ఇండస్ట్రీ తరలిపోతుందా..? ఎప్పుడో ఎన్టీఆర్-ఏఎన్నార్ జమానాలో చెన్నైలో వినిపించిన మాట..ఇప్పుడు హైదరాబాద్‌లో వినిపిస్తోంది. తెలుగు ఇండస్ట్రీ తెలుగు రాష్ట్రాలను వదలి ఎక్కడిపోతుంది..ఎక్కడికి పోదు అన్నవాళ్లకూ డౌటు పుట్టేలా ఇప్పుడు ఫిల్మ్‌నగర్‌లో రగులుతున్న మాటలు..అనేక అనుమానాలకు తావిస్తోంది. ఒకరు అంటే ఏదో అనుకోవచ్చు. ఇంకొకరు అంటే ఏదో కోపంలో మాట్లాడారనుకోవచ్చు..కానీ ఒకరికి ఒకరు..ఇద్దరు, ముగ్గురు..నలుగురు ఇలా వన్ బై వన్ ఇండస్ట్రీ తరలించే కుట్ర జరుగుతోందంటూ మాట్లాడుతుంటే ఏమని అర్దం చేసుకోవాలి..అందుకు తగ్గట్టుగానే యాక్షన్ కూడా మొదలవుతుంటే..ఎలా చూడాలి..అన్న చర్చ ఇప్పుడు టాలీవుడ్‌లో వినిపిస్తోంది. కనిపిస్తోంది..
వేతన పెంపు వివాదం ఇప్పుడు చినికి చినికి గాలివానగా మారింది. అది కాస్తా అటు ఇటు తిరిగి ఇండస్ట్రీ తరలిస్తారా అనే ప్రశ్నదాకా వెళ్లింది. ఈవివాదంలో అనేక ఆరోపణలు ఫెడరేషన్ సైడ్ నుంచి ఒక్కొక్కటిగా నిర్మాతలవైపు దూసుకొస్తున్నాయి.. అందులో ఒకటి ఫెడరేషన్‌ను చీల్చేలా కుట్రలు చేస్తున్నారని.. రెండోది ఇండస్ట్రీని తరలించేందుకు ప్లాన్ వేస్తున్నారని.. ఈ రెండూ టాలీవుడ్‌ను ఆందోళనపరిచే అంశాలే. అయితే మొదటిది కార్మిక సంఘాల ఆరోపణగా తీసుకున్నా..రెండోది మాత్రం తీవ్రంగా ఆలోచించాల్సిన విషయంగా చూస్తున్నారు సినీ పండితులు. ఇండస్ట్రీని తరలించడం అంటే ఏపీకి తరలించడం. అక్కడ ఇండస్ట్రీ ఫ్రెండ్లీ వాతావరణం ఉందని..కొందరు నిర్మాతలు వాదిస్తున్నారని.. అందుకు ఇదే అనువైన సమయం అన్నట్లుగా పథక రచన వేస్తున్నారన్న వాదన కార్మిక సంఘాల నుంచి వినిపిస్తోంది.
ఈసందర్భంగా మూడురోజుల కిందట పీపుల్స్ మీడియా సంస్థ అధినేత విశ్వప్రసాద్ మాట్లాడిన మాటలను కూడా గుర్తు చేస్తున్నారు కొందరు కార్మికులు. బ్లాక్‌మెయిలింగ్‌కు దిగితే తాము ప్రత్యామ్నాయం చూసుకుంటామని అర్థం వచ్చేలా విశ్వప్రసాద్ మాట్లాడిన మాటలను కూుడా ఇక్కడ కార్మికులు హైలెట్ చేస్తున్నారు. అంతేకాదు బయటి కార్మికులను తీసుకుని..సొంత కార్మికుల పొట్ట కొట్టడం ఎంతవరకు న్యాయం అంటూ కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. కార్మికులను చెల్లాచెదురు చేసే కుట్ర జరుగుతోందని.. పక్కరాష్ట్రానికి ఇండస్ట్రీని తరలించేందుకు ప్లాన్ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు యూనియన్ నాయకులు.
అంతేకాదు కొందరు సినీపరిశ్రమకు చెందిన కొందరు వ్యక్తులు ఏపీ మంత్రి కందుల దుర్గేష్‌ను కలిసేందుకు సమాయత్తమవుతున్నారని తెలుస్తోంది. ఇలా వేతన వివాదం రోజు రోజుకూ ముదురుతోంది.




