Tollywood : సాలిడ్ హిట్ కోసం సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న హీరోలు వీళ్ళే..

|

May 15, 2021 | 10:17 PM

సక్సెస్ అనే సౌండ్ విని చాలా రోజులైంది. బైటికొచ్చి మొహం చూపించుకోలేక ఒకటే సతమతం.. దానికితోడు ఇప్పుడీ కరోనా కాలం.

Tollywood : సాలిడ్ హిట్ కోసం సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న హీరోలు వీళ్ళే..
Tollywood
Follow us on

Tollywood : సక్సెస్ అనే సౌండ్ విని చాలా రోజులైంది. బైటికొచ్చి మొహం చూపించుకోలేక ఒకటే సతమతం.. దానికితోడు ఇప్పుడీ కరోనా కాలం. ఫినిష్ చేసి రిలీజ్ కి రెడీగా వున్న సినిమాల్ని కూడా థియేటర్లలో చూసుకోలేకపోతున్నాం..! ఇదీ కొందరు స్టార్ హీరోల అంతర్మధనం. లాక్ డౌన్ టైంలో మిగతా హీరోలతో పోలిస్తే మా కథ వేరుంటది… అంటూ దిగాలుపడ్డ ఆ కథానాయకులు ఎవరో తెలుసా.. రెండున్నర సంవత్సరాలైంది అఖిల్ మిస్టర్ మజ్ను మూవీ రిలీజై. ఆ హ్యాట్రిక్ ఎఫర్ట్ కూడా నిరాశపరచడంతో.. ఫోర్త్ టైమ్ గ్రాండ్ గా కొట్టాలనుకున్నారు. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో పూజ హెగ్డే హీరోయిన్ గా మొదలైన క్రేజీ ప్రాజెక్టు ముగింపుదశకొచ్చి కూడా ఏడాదయ్యింది. రెండు లాక్ డౌన్లతో ఆ సినిమా వెనకేనకే నిలబడిపోయింది. ఇటు న్యాచురల్ స్టార్ సిట్యువేషన్ కూడా దాదాపుగా అంతే. తన సిల్వర్ జూబ్లీ మూవీని కరోనా ఫస్ట్ వేవ్ కారణంగా ottకి ఇచ్చేశారు నానీ. నెక్స్ట్ మూవీని మాత్రం అంత ఈజీగా వదిలిపెట్టబోనని అప్పట్లోనే ప్రతిజ్ఞ చేసుకున్నారు. శివ నిర్వాణ డైరెక్షన్లో టక్ జగదీశ్ ని అంతే సీరియస్ గా కంప్లీట్ చేశారు. కానీ.. నానీని సెకండ్ వేవ్ కూడా వెంటాడుతోంది. గ్యాంగ్ లీడర్ జ్ఞాపకాలతోనే వెయిటింగ్ తప్పడం లేదీ న్యాచురల్ స్టార్ కి.

ఆరేళ్ళ కిందటి జిల్ తర్వాత గోపీచంద్ కెరీర్ లో సరైన బొమ్మే పడలేదు. ఆక్సిజన్ లాంటి ఎక్స్ పరిమెంట్లు, పంతం లాంటి కమర్షియల్స్ కూడా నడిచిన దాఖలా లేదు. అందుకే.. ఈసారి గౌతమ్ నందా ఫేమ్ సంపత్ నందితో సీటిమార్ మూవీకి సాలిడ్ ఎఫర్ట్ పెట్టారు. కబడ్డీ నేర్చుకునిమరీ పక్కా ప్రొఫెషనల్ గా సెట్స్ లోకెళ్ళేవారు. బట్.. సీటిమార్ కి రిలీజ్ యోగం ఎప్పుడన్నది సస్పెన్సే. మిగతా సీనియర్ హీరోలతో పోలిస్తే మార్కెట్ రేంజ్ తగ్గుతోందనే అపవాదును మోస్తున్నారు బాలయ్య. ఈసారి అఖండతో ఆ మార్క్ ని తుడిపేయ్యాలనుకున్నారు. బోయపాటిక్కూడా ప్రెస్టీజియస్ అయిన అఖండ మూవీ టీజర్ తో రికార్డులు బద్దలుకొడుతోంది. బాలయ్య బౌన్స్ బ్యాక్ అవుతారన్న గ్యారంటీ కూడా ఇస్తోంది. మరి.. అఖండ విడుదలకు మార్గం దొరకాలంటే ఇంకెంత కాలం వెయిట్ చేయాలో తెలీదు. ఇలా ఫస్ట్ వేవ్ తో పాటు సెకండ్ వేవ్ తో కూడా ఇబ్బందిపడుతూ.. వెయిటింగ్ రూమ్ లోనే ఉండిపోయారు కొందరు స్టార్ హీరోలు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Priyanka Chopra: ప్రియాంక శ‌రీరాకృతిపై నెటిజ‌న్ల కామెంట్లు.. విజ్ఞ‌త‌తో కూడిన స‌మాధానం చెప్పిన గ్లోబ‌ల్ స్టార్‌..

Nandamuri Balakrishna : బాలకృష్ణ కాదంటేనే ఆ సూపర్ హిట్ సినిమా పవన్ దగ్గరకు వెళ్లిందా..?