Priyanka Chopra: ప్రియాంక శ‌రీరాకృతిపై నెటిజ‌న్ల కామెంట్లు.. విజ్ఞ‌త‌తో కూడిన స‌మాధానం చెప్పిన గ్లోబ‌ల్ స్టార్‌..

Priyanka Chopra: బాలీవుడ్ న‌టిగా కెరీర్ మొద‌లు పెట్టి.. ప్ర‌పంచం గుర్తించే స్థాయికి ఎదిగారు న‌టి ప్రియాంక చోప్రా. ఇంట‌ర్నేష‌న‌ల్ వెబ్ సిరీస్‌లో న‌టించి త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త‌ను సంపాదించుకుందీ బ్యూటీ. ఇక నిత్యం...

Priyanka Chopra: ప్రియాంక శ‌రీరాకృతిపై నెటిజ‌న్ల కామెంట్లు.. విజ్ఞ‌త‌తో కూడిన స‌మాధానం చెప్పిన గ్లోబ‌ల్ స్టార్‌..
Priyanka
Follow us
Narender Vaitla

|

Updated on: May 15, 2021 | 10:04 PM

Priyanka Chopra: బాలీవుడ్ న‌టిగా కెరీర్ మొద‌లు పెట్టి.. ప్ర‌పంచం గుర్తించే స్థాయికి ఎదిగారు న‌టి ప్రియాంక చోప్రా. ఇంట‌ర్నేష‌న‌ల్ వెబ్ సిరీస్‌లో న‌టించి త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త‌ను సంపాదించుకుందీ బ్యూటీ. ఇక నిత్యం ఏదో ర‌కంగా వార్త‌ల్లో నిలిచే ఈ మాజీ మిస్ వ‌ర‌ల్డ్.. 2018లో అమెరిక‌న్ పాప్ సింగ‌ర్ నిక్‌జోన‌స్‌ను ప్రేమ వివాహం చేసుకున్న‌విష‌యం తెలిసిందే. వ‌య‌సులో త‌న‌కంటే చిన్న‌వాడిని వివాహం చేసుకున్న ప్రియాంక‌పై అప్ప‌ట్లో నెటిజ‌న్లు బాగా ట్రోలింగ్ చేశారు. అయితే ఈ జంట త‌మ అన్యోన్య జీవితంతో ఆ కామెంట్ల‌కు చెక్ పెడుతూ వ‌చ్చారు. ఇదిలా ఉంటే తాజాగా నెట్టింట ప్రియాంకపై మ‌రో ట్రోలింగ్ జ‌రుగుతోంది. ప్రియాంక చోప్రా శ‌రీరాకృతిపై కామెంట్లు పెడుతూ నెటిజ‌న్లు రెచ్చిపోతున్నారు. ఆమె శ‌రీరంలో మార్పులు వ‌చ్చాయంటూ కామెంట్లు పెడుతున్నారు. దీంతో ఈ కామెంట్లపై ఎంతో విజ్ఞ‌త‌తో స్పందించారు. త‌న‌పై జ‌రుగుతోన్న బాడీ షేమింగ్ గురించి మాట్లాడుతూ.. అవును ఈ విష‌యాన్ని నేను ఒప్పుకుంటాను. రోజు రోజుకూ నా వ‌య‌సు పెరుగుతున్న నేప‌థ్యంలో నా శ‌రీరంలో కూడా మార్పులు వ‌స్తున్నాయి. వీటిని స్వీక‌రించేందుకు నేను సిద్ధ‌మ‌వుతున్నాను. శ‌రీరంలో వ‌స్తోన్న‌మార్పుల వ‌ల్ల నేను ఇబ్బంది ప‌డ‌టం లేద‌నే అబ‌ద్ధాన్ని చెప్పలేను. ఒక న‌టిగా ఇది నాకు స‌మ‌స్య‌గానే ఉంటుంది. కానీ నేను దీనిని స్వీక‌రించ‌క‌త‌ప్ప‌దు. అంటూ త‌న‌దైన శైలిలో స్పందించారు ప్రియాంక‌.

Also Read: Nandamuri Balakrishna : బాలకృష్ణ కాదంటేనే ఆ సూపర్ హిట్ సినిమా పవన్ దగ్గరకు వెళ్లిందా..?

Puri Jagannadh : పూరీ చెప్పిన మంచిమాట.. జంతువులు పుడతాయి, బతుకుతాయి, చనిపోతాయి…కానీ

బాలకృష్ణ పక్కన హీరోయిన్‌గా నటించాలంటే కొంచెం భయమేసింది.. ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసిన హీరోయిన్..

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు