Tollywood Drugs Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణ.. ఈరోజు ఈడీ ముందుకు హీరోయిన్ ఛార్మి..

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణం వేగవంతం చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో భాగంగా పలువురు టాలీవుడ్

Tollywood Drugs Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణ.. ఈరోజు ఈడీ ముందుకు హీరోయిన్ ఛార్మి..
Charmi
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 02, 2021 | 10:38 AM

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణం వేగవంతం చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో భాగంగా పలువురు టాలీవుడ్ ప్రముఖులకు ఈడీ ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో ఆగస్ట్ 31న మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‏ను ఈడీ విచారించింది. దాదాపు 10 గంటలకు పైగా ఈడీ అధికారులు పూరీ ప్రశ్నల వర్షం కురిపించారు. ఆయనకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్, మనీ ట్రాన్స్‏ఫర్ వంటి అంశాలపై ఈడీ లోతుగా విచారించినట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఈరోజు ఈడీ ముందుకు హీరోయిన్  ఛార్మి  హాజరుకానున్నారు. ఈకేసులో ప్రధాన నిందితుడిగా ఉనన్న కెల్విన్ ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారుల కస్టడీలో ఉన్నాడు. ఇక అతడు ఇచ్చిన సమాచారం ప్రకారం ఛార్మీతోపాటు.. పలువురు ప్రముఖులకు నోటీసులు జారీ చేసింది ఈడీ.

ఈరోజు (సెప్టెంబర్ 2)న ఛార్మి ఈడీ అధికారుల ముందు హాజరుకానున్నారు. ఛార్మి బ్యాంక్ అకౌంట్స్‏ను ఈడీ అధికారులు పరిశీలించనున్నారు. కెల్విన్ అకౌంట్లో ఛార్మి డబ్బులు వేసిందా ? ఆమె ప్రొడక్షన్ హౌజ్ ఆర్థిక లావాదేవీలపై ఆరా తీయనున్నారు అధికారులు. అలాగే ఛార్మీ డ్రగ్స్ సేవించారా ? కెల్విన్‏తో ఆమెకు పరిచయం ఉందా ? ఛార్మీ కెల్విన్ అకౌంట్‏కు మనీ ట్రాన్స్‏ఫర్ చేసింది ? అన్న కోణంలోనూ ఈడీ విచారించనున్నట్లుగా తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు కొత్త మలుపు తిరిగింది. డ్రగ్స్‌ పెడ్లర్‌ కెల్విన్‌ అప్రూవర్‌గా మారడంతో పలువురు టాలీవుడ్‌ నటీనటుల పేర్లు బయటకి వచ్చాయి. దీంతో తీగలాగితే డొంక కదిలినట్టు ఇప్పుడు టాలీవుడ్‌ యాక్టర్స్‌ని విచారించిన తర్వాత ఈ కేసులో ఇంకెంత మంది పేర్లు బయటకి వస్తాయో అనే ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఈ కేసులో డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ని విచారించారు ఈడీ అధికారులు. రెండు రోజుల క్రితం పది గంటల పాటు పూరీని విచారించారు. ఆఫ్రికన్‌ దేశానికి చెందిన రెండు బ్యాంక్‌ ట్రాన్జాక్షన్స్‌పై ఆరా తీశారు. దీంతో ఎవరిని ? ఏ ప్రశ్నలు అడుగుతారోనని నోటీసులు ఇచ్చిన యాక్టర్స్‌లో గుబులు మొదలైంది. ఇవాళ ఛార్మి ఈడీ ఎదుట హాజరవుతున్నారు. డ్రగ్స్‌ కేసులో ప్రశ్నలు సంధించడంతో పాటు బ్యాంక్‌ లావాదేవీల వివరాలపై ఆరా తీయనున్నారు ఈడీ అధికారులు. రెండు రోజుల క్రితం డ్రగ్స్ కేసులో టాలీవుడ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ను 10 గంటల పాటు విచారించారు ఈడీ అధికారులు. పూరీ బ్యాంకు లావాదేవీలపై విచారణ జరిపారు. 2015 నుంచి 2017 వరకు జరిగిన బ్యాంకు లావాదేవీలపై ఈడీ ఫోకస్ పెట్టింది. మనీలాండరింగ్, ఫెమా నిబంధనలపైనా విచారణ సాగింది. ఇక పూరీ జగన్నాథ్‌ విచారణలో కీలక విషయాలు తెరపైకి వచ్చాయి. పూరీకి ముగ్గురు ఆఫ్రికన్ల ఫొటోలు చూపించిన ఈడీ అధికారులు వారిని గుర్తుపట్టాలని అడిగారు. తనకు వాళ్లెవరో తెలియదని ఈడీకి సమాధానం చెప్పనట్లు తెలుస్తోంది. ఆఫ్రికా దేశానికి సంబంధించిన రెండు బ్యాంక్‌ ట్రాన్సాక్షన్లపైనా ఆరా తీశారు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు. ఆ రెండు లావాదేవీలు కూడా సినిమా షూటింగ్‌ కోసమే జరిపినట్లు పూరీ వివరణ ఇచ్చారు. ఇలా నోటితో చెబితే కుదరదని.. బ్యాంక్‌ ట్రాన్సాక్షన్స్‌, షూటింగ్‌‏కి సంబంధించిన అనుమతులు, దానికి సంబంధించిన రా ఫుటేజీ కూడా కావాలని అడిగారు ఈడీ ఆఫీసర్స్‌. రెండు లావాదేవీలకు సంబంధించి పూర్తివివరాలు ఇస్తానని పూరీ జగన్నాథ్ వారిని సమాధానం చెప్పారు. మరోవైపు వైష్ణో బ్యానర్, పూరీ కనెక్ట్స్ బ్యానర్ ఆడిట్ రిపోర్టులను కూడా పరిశీలించారు. పూరీ స్టేట్‌మెంట్‌ను లిఖితపూర్వకంగా నమోదుచేశారు ఈడీ. ఇవాళ ఛార్మిపై ఈడీ అధికారులు ఎలాంటి ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది ? అనేది ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటికే పూరీ జగన్నాథ్‌, ఛార్మి నిర్మాతలుగా కొన్ని సినిమాలు నిర్మించారు. దీంతో ఇద్దరి బ్యానర్లకు సంబంధించి పలు ప్రశ్నలు సంధించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

Also Read: Kerala: కేరళలో మళ్లీ విజృంభణ.. కర్నాటకలో కంగారు, మహమ్మారి వ్యాప్తి అక్కడి నుంచే ఎక్కువట.!

Viral Video: మరణం ఎప్పుడు.. ఎలా సంభవిస్తుందో ఎవ్వరూ చెప్పలేరు. నెట్టింట వైరల్‌ అవుతోన్న ఈ వీడియోనే దీనికి సాక్ష్యం.

కొత్త అవతారం ఎత్తిన మాజీ కెప్టెన్! శాంటాక్లాజ్‌ కాదు తలా క్లాజ్
కొత్త అవతారం ఎత్తిన మాజీ కెప్టెన్! శాంటాక్లాజ్‌ కాదు తలా క్లాజ్
ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..