Viral Video: మరణం ఎప్పుడు.. ఎలా సంభవిస్తుందో ఎవ్వరూ చెప్పలేరు. నెట్టింట వైరల్‌ అవుతోన్న ఈ వీడియోనే దీనికి సాక్ష్యం.

Viral Video: మరణం ఎప్పుడు.. ఎలా ముంచుకొస్తుందో ఎవరం చెప్పలేము. జీవితం ఓ నీటి బుడగలాంటిదని, ఏ క్షణంలోనైనా పేలుతుందని వేదాంతం చెబుతుంటారు. అప్పటి వరకు ఎంతో ఆరోగ్యంగా ఉన్న..

Viral Video: మరణం ఎప్పుడు.. ఎలా సంభవిస్తుందో ఎవ్వరూ చెప్పలేరు. నెట్టింట వైరల్‌ అవుతోన్న ఈ వీడియోనే దీనికి సాక్ష్యం.
Follow us

|

Updated on: Sep 02, 2021 | 8:53 AM

Viral Video: మరణం ఎప్పుడు.. ఎలా ముంచుకొస్తుందో ఎవరం చెప్పలేము. జీవితం ఓ నీటి బుడగలాంటిదని, ఏ క్షణంలోనైనా పేలుతుందని వేదాంతం చెబుతుంటారు. అప్పటి వరకు ఎంతో ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి కూడా ఒక్కసారిగా కుప్పకూలిపోతుంటాడు. ఇలా రెప్పపాటు క్షణంలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంబంధించిన వీడియోలు కొన్ని నెట్టింట వైరల్‌గా మారుతుంటాయి. ఇలాంటి వీడియోలు ఇప్పటి వరకు చాలా వచ్చాయి. తాజాగా ఇలాంటి ఓ వీడియోనే నెటిజన్లను భయాందోళనకు గురి చేస్తోంది.

వివరాల్లోకి వెళితే సూరత్‌లోని గోల్డ్‌ జిమ్‌లో ఓ 33 ఏళ్ల యువకుడు కసరత్తులు చేస్తున్నాడు. ప్రతీ రోజూ లాగే ఆ రోజు కూడా ఆ యువకుడు వ్యాయామం చేశాడు. అయితే గుండెల్లో ఏదో తెలియని నొప్పి అతడిని బాధించింది దీంతో జిమ్‌లో ఉన్న మెట్లపై కూర్చున్నాడు. గుండెలో మంటగా ఉండడంతో నీరు తాగి ఉపశమనం పొందడానికి ప్రయత్నించాడు. కానీ ఎంతకీ నొప్పిమాత్రం తగ్గలేదు. ఇలా బాధపడుతుండగానే చివరికి ఆ యువకుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తీరా యువకుడిని పరీక్షించిన వైద్యులు అతను పడగానే మరణించినట్లు ధృవీకరించారు. గుండె ఆగిపోవడం వల్లే (కార్డియాక్ అరెస్ట్) ఆ యువకుడు మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ సంఘటన అంతా జిమ్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డైంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. 33 ఏళ్ల అతి చిన్న వయసులో గుండె పోటుతో మరణించడంతో ఈ అంశం అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. అయితే యువకుడు పరిమితికి మించి వ్యాయామం చేయడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని నిపుణులు చెబుతున్నారు.

అసలేంటీ కార్డియాక్ అరెస్ట్..

ఉన్న ఫలంగా గుండె పనితీరు ఆగిపోవడాన్నే కార్డియాక్ అరెస్ట్ అంటారు. శరీరంలో ముందస్తు లక్షణాలు ఏమి కనిపించకుండానే ఈ సమస్య వస్తుంది. సాధారణంగా గుండెలో ఏర్పడే ఎలక్ట్రికల్ అలజడే దీనికి కారణం. ఈ అలజడి ఫలితంగా గుండె కొట్టుకోవడంలో సమతుల్యం దెబ్బతింటుంది. దీనివల్ల రక్త ప్రసరణలో అంతరాయం ఏర్పడుతుంది. దీంతో మెదడు, గుండె, శరీరంలోని ఇతర భాగాలకు రక్త ప్రసరణ జరగకుండా పోతుంది. దీనివల్ల క్షణాల్లోనే రోగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయి, నాడి కొట్టుకోవడం కూడా ఆగిపోతుంది.

Also Read: Farah Khan: వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వదలని మహమ్మారి.. కోవిడ్ బారిన పడిన ఫరా ఖాన్..

Punjab National Bank: పంజాబ్ నేషన్ బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త.. ఆఫర్లే ఆఫర్లు.. పూర్తి వివరాలు మీకోసం..

SBI Customers: ఎస్‌బిఐ కస్టమర్లకు ముఖ్య గమనిక.. మీరు ఎంత రుణం పొందవచ్చో ఇలా తెలుసుకోండి..

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?