Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood Drugs Case: ముగిసిన తరుణ్ విచారణ.. 7 గంటలపాటు ప్రశ్నల వర్షం కురిపించిన అధికారులు..

డ్రగ్స్ కేసు..ఇప్పుడు తెలుగు స్టార్స్ అందరిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ముగిసిందని పక్కన పడేసిన కేసులో మరోసారి ఈడీ దూకుడు ప్రదర్శిస్తోంది.

Tollywood Drugs Case: ముగిసిన తరుణ్ విచారణ.. 7 గంటలపాటు ప్రశ్నల వర్షం కురిపించిన అధికారులు..
Tarun
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 22, 2021 | 6:47 PM

డ్రగ్స్ కేసు..ఇప్పుడు తెలుగు స్టార్స్ అందరిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ముగిసిందని పక్కన పడేసిన కేసులో మరోసారి ఈడీ దూకుడు ప్రదర్శిస్తోంది. డ్రగ్స్ వ్యవహరంపై ఇప్పటికే పలువురు తారలను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఈ క్రమంలో ఆయా తారల బ్యాంక్ ఖాతాలు.. లావాదేవీలపై ఈడీ అధికారులు లోతుగా ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కెల్విన్ ఇచ్చిన సమాచారం ప్రకారం టాలీవుడ్ సెలబ్రెటీలను విచారిస్తుంది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ). ఇప్పటికే పూరీ జగన్నాథ్, చార్మీ, రకుల్, రానా, రవితేజ, తనీష్, ముమైత్ ఖాన్‏లను ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఇక ఈరోజు డ్రగ్స్ కేసులో భాగంగా హీరో తరుణ్‏ విచారణకు హజరయిన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా తరుణ్ విచారణ ముగిసింది. దాదాపు 7 గంటల పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తరుణ్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. ఆయన బ్యాంక్ లావాదేవీలపై ఈడీ ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. అయితే బ్యాంక్ డ్యాక్సుమెంట్స్ అడగడంతో ఆయన తండ్రి కూడా విచారణకు హాజరయ్యారు. దీంతో ఈడీ అధికారులు తరుణ్ తండ్రిని కూడా ప్రశ్నించారు. 2017 డ్రగ్స్ కేసులో తరుణ్ ఇచ్చిన స్టేట్‌మెంట్ అంశాల ఆధారంగా అధికారులు ప్రశ్నించారు. 2017 జూలై 19 స్వచ్ఛంద ఎక్సైజ్ శాఖ కు బయో షాంపుల్స్ ఇచ్చాడు తరుణ్. ఆయన ఇచ్చిన బయో షాంపుల్స్ లో డ్రగ్స్ ఆనవాళ్లు లేనట్లు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ రీపోర్ట్ ఇచ్చింది. తాజాగా మరోసారి కెల్విన్ ఇచ్చిన వివరాలపై తరుణ్ ను విచారించారు. అలాగే కెల్విన్‏తో ఉన్న సంబంధం గురించి కూడా ఈడీ విచారించింది. ఇక ఈరోజుతో సినీతారల విచారణ ముగిసింది. పూరి జగన్నాథ్ తో ప్రారంభం అయ్యిన ఈడి విచారణ ఇవాళ తరుణ్‏తో ముగిసింది.

ఆగస్ట్ 31న పూరి జగన్నాథ్‏ను 10 గంటల పాటు విచారించారు ఈడి అధికారులు. సెప్టెంబర్ 2 న ఛార్మినీ 8 గంటల పాటు విచారించారు. ఇక రకుల్ సెప్టెంబర్ 6న హాజరు కావాల్సి ఉండగా సెప్టెంబర్ 3నే హాజరు అయ్యారు. సెప్టెంబర్ 3న రకుల్ ను 6 గంటల పాటు విచారించగా.. నందు సెప్టెంబర్ 20న హాజరు కావాల్సి ఉండగా సెప్టెంబర్ 7న హాజరయ్యారు. సెప్టెంబర్ 7న ఈడీ కార్యాలయానికి కెల్విన్, జీషాన్.. వీరిద్దరి ఇళ్లలో సోదాలు చేసి ఈడి కార్యాలయానికి తీసుకొచ్చిన అధికారులు . ఆ తర్వాత సెప్టెంబర్ 8న రానాను 8 గంటల పాటు ఈడీ అధికారులు విచారించారు. రానా, నందు విచారణకు హాజరు అయ్యిన రోజుల్లో కెల్విన్ , జీశాన్ లను కలిపి విచారించిన ఈడీ. సెప్టెంబర్ 9న రవితేజతోపాటు ఆయన డ్రైవర్ శ్రీనివాస్‏ను 6 గంటల పాటు విచారించారు. సెప్టెంబర్ 13న నవదీప్‏తో పాటు ఎఫ్ క్లబ్ మేనేజర్‏ను 9 గంటల పాటు విచారించారు. ఇక సెప్టెంబర్ 15 న ముమైత్ ఖాన్‏ను 7 గంటల పాటు విచారించిన ఈడీ. సెప్టెంబర్ 17న తనీష్‏ను 7 గంటల పాటు విచారించారు. ఇక ఈరోజు (సెప్టెంబర్ 22) న తరుణ్‏ను 8 గంటల పాటు విచారించారు.

Also Read:  Pooja Hegde: సెట్ కాదు.. కట్ అనుకున్నారా.. ? ప్రభాస్, పూజా హెగ్డే మధ్య విభేదాలు నిజమేనా ?

Maa Elections 2021: మా ఎన్నికలకు సర్వం సిద్ధం.. రంగంలోకి ఆ సీనియర్ నటులు.. మంచు విష్ణు ప్యానల్ రివీల్. ..

SaiPallavi: ప్రతి అమ్మాయి చూడాల్సిన సినిమా.. లవ్ స్టోరీ గురించి హీరోయిన్ సాయి పల్లవి ముచ్చట్లు..

Tamannaah: రోజు రోజుకి పెరుగుతున్న మిల్కీ బ్యూటీ అందాలు.. మీరు ఓ లుక్ వేయండి..