SaiPallavi: ప్రతి అమ్మాయి చూడాల్సిన సినిమా.. లవ్ స్టోరీ గురించి హీరోయిన్ సాయి పల్లవి ముచ్చట్లు..
అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన సినిమా లవ్ స్టోరీ. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ ఈ సినిమా..
అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన సినిమా లవ్ స్టోరీ. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ ఈ సినిమా.. సెప్టెంబర్ 24న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం గత కొంత కాలంగా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ మూవీ ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. “లవ్ స్టోరి” శుక్రవారం విడుదల సందర్భంగా హీరోయిన్ సాయి పల్లవి సినిమాలో నటించిన అనుభవాలు, తన కెరీర్ విశేషాలు తెలిపారు.
సాయి పల్లవి మాట్లాడుతూ… దర్శకుడు శేఖర్ కమ్ముల గారి నుంచి సినిమా కోసం పిలుపు వచ్చినప్పుడు ఈ మూవీ ఖచ్చితంగా చేయాలని అప్పటికే ఫిక్స్ అయ్యాను. “లవ్ స్టోరి”లో నా క్యారెక్టర్ విన్న తర్వాత ఇంకా గట్టిగా నటించాలనే కోరిక కలిగింది. ఫిదా సినిమాలో భానుమతి క్యారెక్టర్‌కు “లవ్ స్టోరి” లో మౌనిక క్యారెక్టర్ కు సంబంధం ఉండదు. రెండు వేర్వేరు పాటర్న్స్ ఉన్న క్యారెక్టర్స్. ఫిదాలో భానుమతి పెళ్లైతే తన ప్లేస్, నేటివ్, ఫ్యామిలీ ఎందుకు వదిలి వెళ్లాలి అని ఆలోచించే అమ్మాయి. ఈ చిత్రంలో మౌనిక తన డ్రీమ్స్‌ను ఫాలో అవుతుంది. నేను ఎందుకు తక్కువ అనే ఆత్మవిశ్వాసం మౌనిక క్యారెక్టర్లో కనిపిస్తుందని చెప్పుకొచ్చింది.
అలాగే.. “లవ్ స్టోరి”లో చైతూ, నా క్యారెక్టర్స్ ద్వారా దర్శకుడు శేఖర్ కమ్ముల ఒక మంచి విషయాన్ని చెప్పించారు. మనలో ఎవరూ పర్ఫెక్ట్ కాదు, మాస్టర్స్ కాదు.. కానీ ప్రయత్నించి సాధించాలనే విల్ పవర్ ఉన్నప్పుడు ఏదైనా సాధ్యమవుతుంది. అలా మా రెండు క్యారెక్టర్స్ తమ డ్రీమ్స్ కోసం ప్రయత్నాలు చేస్తుంటాయి. నేను సాధించగలను అని బలంగా నమ్ముతాయి. మన చుట్టూ ఉన్న సమాజంలో, మన కుటుంబంలో కూడా వివక్షను చూస్తుంటాం. కానీ పోనీలే అని చాలా మంది అమ్మాయిలు, మహిళలు వదిలేస్తుంటారు. ఇంట్లో పని చేసే అమ్మాయి ఉంటే ఆమెకు వేరే ప్లేట్లో భోజనం పెడుతుంటాం. ఇవన్నీ మన కళ్ల ముందు కనిపించే వివక్షే. వీటి గురించి దర్శకుడు శేఖర్ కమ్ముల ఆలోచింపజేసేలా సినిమా తెరకెక్కించారు. “లవ్ స్టోరి” లో మంచి సందేశం ఉన్నా, ఎక్కడా బోర్ కొట్టించదు. కథను వినోదాత్మకంగా చూపిస్తూ సినిమాను తెరకెక్కించారు శేఖర్ కమ్ముల. ఆయన సినిమాల్లో ఉండే నిజాయితీ “లవ్ స్టోరి” లోనూ ఉంటుంది. ఆయన తన జీవితంలో ఏది నమ్ముతారో దాన్నే కథలుగా మార్చి సినిమాలు తెరకెక్కిస్తుంటారు. ఈ సినిమా కూడా అందులో ఒకటి అని సాయి పల్లవి తెలిపింది.
శేఖర్ కమ్ముల లాంటి దర్శకులతో పనిచేస్తున్నప్పుడు మనకు కూడా అంతే సిన్సియర్‌గా వర్క్ చేయాలనే ఆలోచన వస్తుందని.. ఆయన చాలా హంబుల్‌గా .. సింపుల్ లైఫ్ లీడ్ చేస్తారని చెప్పుకొచ్చింది. ఇక “లవ్ స్టోరి” సినిమాలో లింగ వివక్ష, కుల వివక్ష లాంటి మన చుట్టూ ఉన్న ఇష్యూస్‌ను టచ్ చేస్తూ సినిమా చేశారు. ఈ మూవీ చూశాక ప్రేక్షకుల్లో ఒక ఆలోచన కలుగుతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. నాగ చైతన్యతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది. ఆయనతో వర్కింగ్ చాలా కంఫర్ట్‌గా ఫీలయ్యాను. రేవంత్ క్యారెక్టర్‌ను పర్పెక్ట్గా ప్లే చేశారు. పైట్స్‌లో నాగ చైతన్య బాగా నటించి, సాయి పల్లవి చేయలేదంటే కరెక్ట్ కాదు కదా అలాగే డాన్స్ లో నేను బాగా చేశాను. ఆయన ఇబ్బంది పడ్డారన్నా సరికాదు. ఒక్కో యాస్పెక్ట్ లో ఒక్కొక్కరు కొద్దిగా బెటర్‌గా చేస్తారు అంతే అంటూ చెప్పుకొచ్చింది సాయి పల్లవి. ఇక చిరంజీవి గారు నాతో డాన్స్ చేయాలని ఉందని సరదాగా అన్నారు. ఆయన నా డాన్స్ గురించి చెబుతుంటే చాలా సంతోషం కలిగింది. అవన్నీ బెస్ట్ కాంప్లిమెంట్స్‌గా నాకు గుర్తుండిపోతాయని తెలిపింది సాయి పల్లవి.
సొసైటీలో అమ్మాయిల మీద ఏవైనా అఘాయిత్యాలు జరిగినప్పుడు అవి విని, చదివి నేను బాధపడేదాన్ని. మనమేం చేయలేమా అనుకునేదాన్ని. కానీ “లవ్ స్టోరి” సినిమాలో మౌనిక క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఈ విషయంలో సంతృప్తి కలిగింది. కనీసం నా సినిమా ద్వారా అయినా నా వాయిస్ చెప్పగలిగాను అని. ప్రతి అమ్మాయి, మహిళ చూడాల్సిన సినిమా “లవ్ స్టోరి” అని తెలిపింది సాయి పల్లవి..
ప్రస్తుతం సాయిపల్లవి తెలుగులో విరాటపర్వం, శ్యామ్ సింగరాయ్ చిత్రాల్లో నటిస్తుంది. విరాట పర్వం ఒకరోజు షూటింగ్ మిగిలి ఉందని.. అలాగే శ్యామ్ సింగరాయ్ కూడా చివరి దశలో ఉంది. తమిళంలో ఒకటి, మలయాళంలో ఒక సినిమా చేస్తున్నానని… తెలుగులో మరో సినిమా, వెబ్ సిరీస్ కు సంప్రదింపులు జరుగుతున్నాయని ఆసక్తికర విషయాలను బయటపెట్టింది సాయి పల్లవి.
View this post on Instagram
Aslo Read: Nayanthara: షారుఖ్.. అట్లీ సినిమాలో నయనతార రోల్ అదే.. సెట్ నుంచి లీకైన ఫోటోస్..