Nayanthara: షారుఖ్.. అట్లీ సినిమాలో నయనతార రోల్ అదే.. సెట్ నుంచి లీకైన ఫోటోస్..
చాలా కాలం తర్వా తర్వాత బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తిరిగి తన తదుపరి సినిమాలను పట్టాలెక్కించాడు. తమిళ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో
చాలా కాలం తర్వా తర్వాత బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తిరిగి తన తదుపరి సినిమాలను పట్టాలెక్కించాడు. తమిళ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో షారుఖ్ చేయబోతున్న సినిమా ఇటీవలే ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇందులో లేడీ సూపర్ స్టార్ నయనతార, ప్రియమణి హీరోయిన్లుగా నటిస్తున్నారు. క్రేజీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాను రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై షారుఖ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా మొదటి షెడ్యూల్ను పూణేలో చిత్రీకరిస్తున్నారు. ఇదిలా ఉంటే.. గత కొద్ది రోజులుగా లీకు బెడద సినీ ఇండస్ట్రీని తీవ్రంగా వేధిస్తున్న సంగతి తెలిసిందే. భాషతో సంబందం లేకుండా.. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇలా అన్ని భాషలకు సంబంధించిన భారీ బడ్జెట్ చిత్రాలకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట్లో చక్కర్లు కోడుతున్నాయి. ఇటీవల పుష్ప, సర్కారు వారి పాట నుంచి పలు సీన్స్ లీకైన సంగతి తెలిసిందే. తాజాగా షారుఖ్, అట్లీ సినిమాకు సైతం లీకుల బెడద తప్పడం లేదు.
ఇటీవల గత కొద్ది రోజుల క్రితం షూటింగ్ సెట్ నుంచి షారుఖ్ మేకోవర్ ఫోటోస్ లీకైన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి హీరోయిన్ నయనతార, మరాఠీ నటి రితూజా ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ సినిమాలో నయన్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే గతంలో షారుఖ్ ప్రధాన పాత్రలో అభిషేక్ బచ్చన్, సోనూసూద్ కీలక పాత్రలలో నటించిన హ్యాపీ న్యూఇయర్ సినిమాలో ఫరాఖాన్ మాదిరిగానే.. ఈసారి నయన్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతుందని.. సినిమాకు హ్యాపీ న్యూఇయర్ సినిమాలాగే ఉంటుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా షారుఖ్ కెరీర్లో చాలా అవసరం. ఈ మూవీతో తను బాలీవుడ్ ఇండస్ట్రీలో తన స్థానాన్ని కాపాడుకోవడం కోసం అనేక ప్రయాత్నాలు చేస్తున్నారు. అలాగే నయన్ ఈ సినిమా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది. ఈ మూవీపైనే నయన్ ఆశలు, షారుఖ్ ఆశలు పెట్టుకున్నారు.
ట్వీట్..
Exclusive #NAYANTHARA and Rutuja ( marathi actreess) Big Opration Sequence On #SRK #Atlee Movie, both are playing cops Jawaan Team ? pic.twitter.com/bZMpUG25U2
— Rashid Siddiquee (@FFNEWS6) September 5, 2021
Also Read: