దీన స్థితిలో టాలీవుడ్ కమెడియన్..! నీ ముఖం కూడా గుర్తులేదంటూ అవమానాలు

సినీ ఇండస్ట్రీ అనేది ఓ రంగుల ప్రపంచం.. ఇక్కడ రాణించాలని ఎంతో మంది కలలు కంటూ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతుంటారు. కానీ అందరికి అదృష్టం కలిసి రాదు. కొంతమంది వరుస అవకాశాలతో స్టార్స్ గా మారిపోతున్నారు, మరికొందరు మాత్రం అవకాశాలు లేక దీన స్థితిలో ఉన్నారు.

దీన స్థితిలో టాలీవుడ్ కమెడియన్..! నీ ముఖం కూడా గుర్తులేదంటూ అవమానాలు
Comedian Ramachandra

Updated on: Jun 27, 2025 | 7:02 PM

సినిమా ఇండస్ట్రీలో ఎవరి దశ ఎప్పుడు తిరుగుతుందో చెప్పడం చాలా కష్టం.. కాలం కలిసొచ్చి స్టార్స్ గా మారిన వారు కొందరున్నారు. అలాగే అదృష్టం కలిసి రాక ఇండస్ట్రీలో రాణించలేకపోయినవారు చాలా మందే ఉన్నారు. వారిలో పైన కనిపిస్తున్న నటుడు ఒకరు.. ఎన్నో సినిమాల్లో కమెడియన్ గా నటించిన ఆయన ఇప్పుడు దారుణమైన పరిస్థితిలో ఉన్నాడు. ఆర్ధికంగా బాగా చితికిపోయాడు ఆ నటుడు.. ఆయన పేరు రామచంద్ర. కమెడియన్ గా పదుల సంఖ్యలో సినిమాల్లో కనిపించి నవ్వులు పూయించాడు రామచంద్ర. ముఖ్యంగా సొంతం, వెంకీ సినిమాల్లో తన కామెడితో ఆకట్టుకున్నాడు. వెంకీ సినిమా రామచంద్రకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆయన పాత్ర సినిమా అంతా ఉంటుంది.

ఇది కూడా చదవండి :హిట్ కొట్టి ఆరేళ్ళు.. మూడు సినిమాలు చేస్తే ఒకే ఒక్క హిట్.. కానీ క్రేజ్ మాత్రం పీక్

కాగా రామచంద్ర ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 25ఏళ్లు అవుతుంది. కానీ ఆయన అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయాడు. ఆనందం, వెంకీ, సొంతం వంటి హిట్ సినిమాల్లో నటించినా అనుకున్నంత గుర్తింపు తెచుకోలేకపోయాడు.  తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. నిన్ను చూడాలని సినిమాతో నేను మొదటి అవకాశం అందుకున్నా.. ఆతర్వాత వరుసగా సినిమా ఛాన్స్ లు వచ్చాయి.. కెరీర్‌లో వచ్చిన బ్రేక్ తన జీవితాన్ని గందరగోళంలో పడేసిందని తెలిపాడు. కెరీర్ బిగినింగ్ లో అవకాశాలు ఈజీగా వచ్చాయి.. కానీ ఆతర్వాత రావడం కష్టంగా మారింది.

ఇది కూడా చదవండి :ఈ అమ్మడు సోషల్ మీడియా బ్యూటీ కదా మావ.! ఎవరో గుర్తుపట్టారా..?

రోడ్డు ప్రమాదం జరగడంతో మూడేళ్లు సినిమాకు దూరం అయ్యా.. దాంతో డబ్బులు అన్నీ అయిపోయాయి. ఆర్ధిక పరిస్థితి దెబ్బతినడంతో అప్పుల పాలు అయ్యాను అని తెలిపాడు. చాలా అప్పులు చేశా.. చాలా వరకు తీర్చేశా.. కానీ ఇంకా ఉన్నాయి. అవకాశాలు రావడం లేదు. నిర్మాతల దగ్గరకు వెళ్తే ఎవరు నువ్వు.? ముఖం గుర్తులేదు అంటున్నారు. ఆ మాటలు చాలా భాదపెట్టాయి… నేను ఎవరి సాయం కోసం ఎదురుచూడటం లేదు.. కేవలం అవకాశాల కోసం మాత్రమే ఎదురుచూస్తున్నా అని తెలిపాడు రామచంద్ర. తనలాంటి వారు నిలబడాలంటే నిర్మాతలు అవకాశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాడు రామచంద్ర.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : కుబేర సినిమాలో అమ్మ పాట పాడింది ఈవిడే.. ఆమె గొంతులోనే ఎదో మాయ ఉంది..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి