పుష్ప 2 జోరు కంటిన్యూ అవుతోంది. రూ.1000 కోట్ల కలెక్షన్స్ దిశగా దూసుకుపోతోంది. ఆల్రెడీ పార్టీ కూడా ఇచ్చేసిన పుష్పరాజ్ మరికొద్ది రోజులు ఇదే హైలో ఉండబోతున్నారు. చాలా రోజులుగా హెక్టిక్ షెడ్యూల్స్ ప్రమోషన్ ఈవెంట్స్ తో బిజీగా ఉన్న బన్నీ లాంగ్ బ్రేక్ తీసుకునే ఆలోచనలో ఉన్నారు. ఆ తరువాతే నెక్ట్స్ ప్రాజెక్ట్ కు సంబంధించిన వర్క్ స్టార్ట్ అవుతోంది. ప్రస్తుతానికి బన్నీ ఫోకస్ అంతా పుష్ప 2 సక్సెస్ సెలబ్రేషన్స్ మీదే ఉంది. అన్ని రికార్డ్స్ ను చెరిపేస్తూ దూసుకుపోతున్న పుష్పరాజ్ మేనియాను అల్లు అర్జున్ (Allu Arjun) అవుట్ రైట్ గా ఎంజాయ్ చేస్తున్నారు.
డైరెక్టర్ సుకుమార్ (Sukumar) కూడా ఇదే స్టేటస్ లో ఉన్నారు. పుష్ప రిలీజ్ కు ముందు ప్రమోషన్స్ లో పాల్గొనేందుకు కూడా టైమ్ లేనంత బిజీగా ఉన్న సుకుమార్.. ఇప్పుడిప్పుడే కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే ఇంకా ప్రమోషన్స్ బిజీ కంటిన్యూ అవుతోంది. ఇవన్నీ పూర్తయిన తరువాత ఫ్యామిలీతో లాంగ్ వెకేషన్ ప్లాన్ చేస్తున్నారు సుకుమార్. హాలీడే అయ్యాకే నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి ఆలోచించాలని ఫిక్స్ అయ్యారు.
నెక్ట్స్ బన్నీ చేయబోయే ప్రాజెక్ట్ విషయంలో ఆల్రెడీ క్లారిటీ ఉంది. సూపర్ హిట్ కాంబో త్రివిక్రమ్ దర్శకత్వంలో నెక్ట్స్ మూవీని అల్లు అర్జున్ ఎనౌన్స్ చేశారు. గతంలో ఈ కాంబినేషన్ లో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో లాంటి హిట్ సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ఆ సక్సెస్ లను మరిపించే రేంజ్‌లో పాన్ ఇండియా ప్రాజెక్ట్ ను ప్లాన్ చేస్తున్నారు బన్నీ, త్రివిక్రమ్.
పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి ఆల్రెడీ నిర్మాణ సంస్థ కొన్ని అప్‌డేట్స్ ఇచ్చింది. ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ మీద రాని ఓ కొత్త పాయింట్‌తో సినిమా చేయబోతున్నామన్నారు నిర్మాత నాగవంశీ. బ్రేక్ తరువాత ఈ ప్రాజెక్ట్ లోనే జాయిన్ అయ్యేలా డేట్స్ ప్లాన్ చేసుకుంటున్నారు అల్లు అర్జున్.
సుకుమార్ నెక్ట్స్ ప్రాజెక్ట్స్ విషయంలో మాత్రం ఇంకా అఫీషియల్ క్లారిటీ లేదు. విజయ్ దేవరకొండ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా ఎనౌన్స్ అయ్యింది. అదే సమయంలో రామ్ చరణ్ హీరోగానూ ఓ సినిమా చేసే ప్లాన్ ఉందని చాలా రోజుల క్రితమే ఎనౌన్స్ చేశారు సుక్కు. ఈ రెండు ప్రాజెక్ట్స్ ఏదో ఒకటి నెక్ట్స్ స్టార్ట్ చేస్తారా..? లేదంటే ఈ రెండు కాకుండా మరో ప్రాజెక్ట్ ను లైన్ పెడతారా..? ఇవన్నీ పక్కన పెట్టి పుష్ప 3 వర్కే స్టార్ట్ చేస్తారా అన్నది కొద్ది రోజుల బ్రేక్ తరువాతే క్లారిటీ వస్తుంది.