Maha Kumbh Mela: మహా కుంభమేళాలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం.. ఫొటోస్ వైరల్

ప్రపంచంలో అతి పెద్ద ఆధ్యాత్మిక వేడుకగా గుర్తింపు పొందిన ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళా అప్రతిహతంగా కొనసాగుతోంది. దేశ విదేశాల నుంచి కోట్లాది మంది భక్తులు, సెలబ్రిటీలు ఈ వేడుక కోసం తరలిస్తున్నారు. త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించి పునీతులవుతున్నారు.

Maha Kumbh Mela: మహా కుంభమేళాలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం.. ఫొటోస్ వైరల్
Maha Kumbh Mela

Updated on: Feb 05, 2025 | 8:22 AM

ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. సామాన్యులతో పాటు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు ఇక్కడకు వస్తున్నారు. త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. ముఖ్యంగా సినీ పరిశ్రమకు చెందిన నటీ నటులు పెద్ద ఎత్తున కుంభ మేళాను దర్శించుకుంటున్నారు. అనంతరం అక్కడి అనుభవాలను సోషల్ మీడియ వేదికగా అందరితో పంచుకుంటున్నారు.  తాజాగా టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ సంయుక్త మేనన్ మహా కుంభమేళాను దర్శించుకుంది. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేసింది. అనంతరం ఇందుకు సంబంధించి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘జీవితంలో విశాలతను మనం కళ్లారా చూసినప్పుడు దానికి మించింది మరోకటి లేదు అనిపిస్తుంది. అనంతమైన స్ఫూర్తి కోసం నా సంస్కృతిని నేను ఎంతో ఆదరిస్తాను. మహా కుంభ మేళాలో భాగంగా గంగా నదిలో పవిత్రమైన స్నానం చేస్తున్నప్పుడు నా మనసు మరింత తేలికపడింది’ అని తన ఫొటోలకు క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి.

మలయాళ సినీ పరిశ్రమకు చెందిన సంయుక్త మేనన్ పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు వారికి పరిచయమైంది. మొదటి సినిమాలోనే అందం, అభినయం పరంగా మంచి మార్కులు కొట్టేసింది. ఇక సాయి ధరమ్ తేజ్ తో కలిసి ఆమె నటించిన విరూపాక్ష ఏకంగా వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. కల్యాణ్ రామ్ తో బింబిసార, ధనుష్ తో సర్ సినిమాలు కూడా సూపర్ హిట్స్ గా నిలిచాయి. దీంతో టాలీవుడ్ లో లక్కీ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకుందీ అందాల తార. ప్రస్తుతం నిఖిల్ హీరోగా నటిస్తోన్న స్వయంభు సినిమాలో నటిస్తోంది సంయుక్త. దీంతో పాటు మరికొన్ని తమిళ్, మలయాళ ప్రాజెక్టులు ఈ ముద్దుగుమ్మ చేతిలో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

మహా కుంభమేళాలో సంయుక్త మేనన్..

గంగా నదిలో సంయుక్త మేనన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.