AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్.. ప్రియుడితో కలిసి ఏడడుగులు.. రవితేజ సినిమాతో పాపులర్..

టాలీవుడ్ హీరోయిన్ ఇప్పుడు కొత్త జీవితం ప్రారంభించింది. ఇప్పుడిప్పుడే వరుస సినిమాలతో బిజీగా ఉంటున్న ఈ అమ్మడు.. తాజాగా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. తన ప్రియుడు, ప్రముఖ సింగర్ స్టెబిన్ బెన్ ను పెళ్లి చేసుకుంది. గత వారమే వీరిద్దరి ఎంగేజ్మెంట్ జరగ్గా.. ఇప్పుడు రాజస్థాన్ లోని అందమైన నగరం ఉదయ్ పూర్ లో వీరిద్దరు ఏడడుగులు వేశారు. వీరి పెళ్లి ఫోటోస్, వీడియోస సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.

Tollywood : పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్.. ప్రియుడితో కలిసి ఏడడుగులు.. రవితేజ సినిమాతో పాపులర్..
Nupur Sanon
Rajitha Chanti
|

Updated on: Jan 11, 2026 | 2:35 PM

Share

మాస్ మహారాజా రవితేజ సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తుంటారు. ఇప్పుడు భర్త మహాశయులకు విజ్ఞప్తి అంటూ మరోసారి సంక్రాంతి పండక్కి సందడి చేసేందుకు రెడీ అయ్యారు. ఇదిలా ఉంటే.. రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ నుపూర్ సనన్.. ఇప్పుడు కొత్త జీవితం ప్రారంభించింది. తన ప్రియుడు సింగర్ స్టెబిన్ బెన్ ను పెళ్లి చేసుకుంది. గత వారమే వీరిద్దరి ఎంగేజ్మెంట్ వేడుక ఘనంగా జరగ్గా.. ఇప్పుడు రాజస్థాన్ లోని అందమైన నగరం ఉదయ్ పూర్ లో వీరిద్దరు ఏడడుగులు వేశారు. ఈ వేడుకకు కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. సంప్రదాయబద్దమైన వాతావరణంలో జరిగిన ఈ వేడుకకు ఇరువురి కుటుంబాల ఆశీస్సులు లభించాయి.

ఇవి కూడా చదవండి : Actor Balaji: రఘువరన్ చనిపోవడానికి కారణం అదే.. ఆయన కొడుకు ఇప్పుడేం చేస్తున్నాడంటే.. నటుడు బాలాజీ..

ప్రస్తుతం వీరిద్దరి పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది. దీంతో ఈ జంటకు అభిమానులు, సన్నిహితులు, సినీప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నుపుర్ సనన్ కెరీర్ విషయానికి వస్తే.. టాలీవుడ్ టాప్ హీరోయిన్ కృతి సనన్ కు ఆమె చెల్లెలు. అక్క అడుగుజాడల్లోనే సినీరంగంలోకి అడుగుపెట్టిన నుపుర్.. ఇప్పుడిప్పుడు మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది. రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమాతో గుర్తింపు వచ్చింది. కానీ ఆశించిన స్థాయిలో అంతగా అవకాశాలు రాలేదు.

ఇవి కూడా చదవండి : Soundarya : చనిపోవడానికి ముందు నాతో ఫోన్ మాట్లాడింది.. అసలు విషయం బయటపెట్టిన డైరెక్టర్..

అలాగే ఇప్పుడిప్పుడే హిందీ సినిమా ప్రపంచంలో అవకాశాలు అందుకుంటుంది. ఇదిలా ఉంటే.. సింగర్ స్టెబిన్ బెన్ బాలీవుడ్ సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. హిందీలో పలు చిత్రాలకు సంగీతం అందించడమే కాకుండా ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ ఫేమస్ అయ్యాడు.

ఇవి కూడా చదవండి : Anshu Ambani : ఏంటీ.. మన్మథుడు హీరోయిన్‏కు ఇంత పెద్ద కూతురు ఉందా.. ? అందంలో తల్లిని మించిపోయిందిగా..