ఆ హీరోతో సినిమా చేస్తే వంద సినిమాలతో సమానం.. మనసులో మాట బయట పెట్టిన నిధి

నిధి అగర్వాల్.. సాలిడ్ హిట్ పడలేదు కానీ ఈ అమ్మడి పేరు టాలీవుడ్ లో ఇప్పుడు మారుమ్రోగేది. ఈ హాట్ బ్యూటీ భారీ హిట్ కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తుంది. బాలీవుడ్ నుంచి ఇండస్ట్రీకి వచ్చినీ ముద్దుగుమ్మ తెలుగులో అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయింది. వరుసగా యంగ్ హీరోల సినిమాల్లో అవకాశాలు అందుకున్నప్పటికీ అనుకున్నంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది.

ఆ హీరోతో సినిమా చేస్తే వంద సినిమాలతో సమానం.. మనసులో మాట బయట పెట్టిన నిధి
Nidhi Agarwal

Updated on: Jul 18, 2025 | 11:24 AM

టాలీవుడ్ లో హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ముద్దుగుమ్మల్లో నిధి అగర్వాల్ ఒకరు. ఇప్పుడు ఈ చిన్నది వరుస సినిమాలతో దూసుకుపోతుంది. మున్నా మైఖేల్ సినిమాతో బాలీవుడ్ లోకి హీరోయిన్ గా అడుగుపెట్టింది ఈ అందాల తార. ఆ తర్వాత తెలుగులో నాగ చైతన్య హీరోగా నటించిన సవ్యసాచి సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆతర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది. అక్కినేని యంగ్ హీరో అఖిల్ తో కలిసి మిస్టర్ మజ్ను, ఆతర్వాత రామ్ పోతినేనితో  ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్ అందుకుంది. ఇస్మార్ట్ శంకర్ సినిమాలో తన అందంతో ఆకట్టుకుంది. సవ్యసాచి, మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్, హీరో సినిమాలు చేసింది. కానీ ఈ సినిమాల్లో ఒక ఒక్క సినిమా ఆ హిట్ అయ్యింది.

ఇది కూడా చదవండి : రిలీజై 7ఏళ్ళైనా ఓటీటీని ఊపేస్తున్న సినిమా.. చూస్తే సుస్సూ పోసుకోవాల్సిందే

మొత్తంగా ఈ చిన్నది ఎనిమిది సినిమాలు చేసింది. వాటిలో ఒకే ఒక్క హిట్ అందుకుంది. ఇప్పుడు రెండు పాన్ ఇండియా సినిమాలు చేస్తుంది. వాటిలో పవన్ కళ్యాణ్ హరిహరవీరమల్లు సినిమా ఒకటి. ఈసినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అలాగే ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాజా సాబ్ సినిమాలోనూ ఈ చిన్నది హీరోయిన్ గా నటిస్తుంది. ఈ రెండు సినిమాల తర్వాత నిధి అగర్వాల్ క్రేజ్ మరింత పెరగనుంది. హరిహరవీరమల్లు సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :అమ్మబాబోయ్..! అచ్చం మీరాజాస్మిన్‌లానే ఉందే.. ఈ టాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలుసా..?

ఇదిలా ఉంటే తాజాగా హరిహరవీరమల్లు ప్రమోషన్స్ లో నిధి అగర్వాల్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో తెగ వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ తో నటించడం గురించి ఆమె మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ చాలా మంచి మనిషి. ఆయనతో సినిమా చేయడం నా అదృష్టం.. పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా చేసినా అది వంద సినిమాలతో సమానం. ఈ సినిమాలో నా పాత్ర చాలా కీలకంగా ఉంటాయి. సినిమాలో నా పాత్ర పేరు పంచమి. సినిమాలో నా పాత్ర సాహసోపేతంగా ఉంటుంది.

ఇది కూడా చదవండి : స్టార్ హీరోయిన్ అవ్వాల్సిన బ్యూటీ.. ఒక్క యాక్సిడెంట్‌తో అంతా రివర్స్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.