
ఇప్పుడంటే మన దేశంలో టిక్ టాక్ బ్యాన్ అయ్యింది. కానీ గతంలో ఈ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎంతో మందికి లైఫ్ ఇచ్చింది. టిక్ టాక్ వేదికగానే ఎంతో మంది తమ ట్యాలెంట్ ను ప్రపంచానికి చాటి చెప్పారు. టిక్ టాక్ వీడియోల ద్వారానే ఫేమస్ అయిన వారిలో చాలా మంది ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోనూ సత్తా చాటుతున్నారు. ఈ టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. ఈ బ్యూటీ లిప్-సింకింగ్, డబ్ స్మాష్ కామెడీ వీడియోలకు అప్పట్లో మంచి క్రేజ్ ఉండేది. టిక్ టాక్‌లో ఈ ముద్దుగుమ్మ ఫాలోవర్ల సంఖ్య దాదాపు 1.1 మిలియన్లు అంటే ఏ రేంజ్ లో పాపులర్ అయ్యిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇదే పాపులారిటీతో బుల్లితెరకు పరిచయమైందీ సొగసరి. ప్రముఖ డ్యాన్స్ షో ఢీలో యాంకర్ అండ్ మెంటార్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత జబర్దస్త్ లోనూ కనిపించింది.ఇద క్రేజ్ తో బిగ్ స్క్రీన్ పైకి కూడా ఎంట్రీ ఇచ్చింది. చేసింది రెండు సినిమాలే అయినా అందం, అభినయం పరంగా ఈ ముద్దుగుమ్మకు మంచి మార్కులే పడ్డాయి. అయితే ఇప్పుడిప్పుడే హీరోయిన్ గా ఎదుగుతోన్న ఈ ముద్దుగుమ్మ సడెన్ గా పెళ్లి కూతురిగా ముస్తాబై కనిపించింది. తన సోషల్ మీడియా ఖాతాలో హల్దీ ఫొటోలు షేర్ చేసి ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు ఈ అమ్మడిక కంగ్రాట్స్ చెబుతున్నారు. మరికొందరు పెళ్లి దుస్తుల్లో ఉన్న హీరోయిన్ ను చూసి షాక్ అవుతున్నారు. ఇంతకీ ఈ బ్యూటీ ఎవరో గుర్తు పట్టారా? తను మరెవరో కాదు దీపికా పిల్లి.
సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్‌గా ఉండే ముద్దుగుమ్మల్లో దీపికా పిల్లి ఒకరు. తాజాగా దీపిక తన ఇన్‌స్టా గ్రామ్ లో ఓ పోస్ట్ షేర్ చేసింది. అందులో హల్దీ ఫంక్షన్ ఫొటోస్ షేర్ చేసింది. పైగా ఈ ఫొటోలకు #haldi #pellisandadi #pellichoopulu #pellikuthuru #marriagediaries అంటూ హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చింది. దీంతో ఈ పిక్స్ కాస్త నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు పెళ్లి చేసుకుంటున్నావా? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
జబర్దస్త్, డీ షోల్లో మెరిసిన దీపికా పిల్లి వాంటెడ్ పండుగాడు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అలాగే మరో స్టార్ యాంకర్ ప్రదీప్ మాచిరాజుతో కలిసి అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి అనే ఓ సినిమాలో నటించింది. అయితే ఈ రెండు సినిమాలు పెద్దగా ఆడలేదు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.