Tollywood: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో టాలీవుడ్ యంగ్ హీరో.. జనసేన పార్టీ స్టార్ క్యాంపెయినర్‌గా..

కెరీర్ ప్రారంభంలో ఎక్కువగా ప్రేమ కథలతో మెప్పించాడీ ట్యాలెంటెడ్ హీరో. యూత్ లో లవర్ బాయ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. మధ్యలో కొన్ని యాక్షన్ సినిమాలు కూడా చేసినప్పటికీ సక్సెస్ అవ్వలేకపోయాడు. అయితే ఇప్పుడీ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో ఉన్నట్లుండి ఎన్నికల ప్రచారంలో కనిపించాడు.

Tollywood: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో టాలీవుడ్ యంగ్ హీరో.. జనసేన పార్టీ స్టార్ క్యాంపెయినర్‌గా..
Telangana Muncipal Elections

Updated on: Feb 07, 2026 | 8:26 PM

.ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల సీజన్ నడుస్తోంది. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు బిజీ బిజీగా ఉన్నాయి. కాగా ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ కూడ తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం చేస్తారని వార్తలు కూడా వస్తున్నాయి. మరోవైపు తెలంగాణ జనసేన పార్టీ ప్రధాన నాయకులు, శ్రేణులన్నీ ఎన్నికల ప్రచారంలో బిజి బిజీగా ఉంటున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున పోటీ చేస్తోన్న అభ్యర్థులకు మద్దతుగా ఓ టాలీవుడ్ ప్రముఖ హీరో ప్రచారం చేస్తుండడం ఆసక్తికరంగా మారింది. గత కొన్ని రోజులుగా ఈ నటుడు తెలంగాణలోని ప్రధాన నగరాలన్నీ చుట్టేస్తున్నాడు. జనసేన అభ్యర్థులకు మద్దతుగా విస్తృత ప్రచారం చేస్తున్నాడు. అంతేకాదు అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ పార్టీలపై ఘాటు విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు. ఇంతకీ అతనెవరనుకుంటున్నారా? నచ్చావులే, మేం వయసుకు వచ్చాం సినిమాల హీరో తనీశ్‌.

ఛైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించాడు తనీశ్. దేవుళ్లు, మన్మథుడు తదితర సినిమాల్లో బాలనటుడిగా మెప్పించాడు. ఇక నచ్చావులే సినిమాతో హీరోగా మారాడు తనీశ్. ఆ తర్వాత రైడ్, మౌనరాగం, ఏం పిల్లో పిల్లడో, మేం వయసుకు వచ్చాం సినిమాలతో యూత్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఆ తర్వాత మాస్ బాట పట్టి వరుసగా అపజయాలు చవి చూశాడు. కోడి పుంజు, చాణక్యుడు, తెలుగబ్బాయి, పాండవులు పాండవులు తుమ్మెద, బ్యాండ్ బాజా, ఓ మై గాడ్, ప్రేమిక, దేశ దిమ్మరి, రంగు, మరో ప్రస్థానం వంటి సినిమాల్లో హీరోగా చేశాడు తనీశ్. అయితే ఇవేవీ పెద్దగా ఆడలేదు. దీంతో బిగ్ బాస్ వంటి టీవీ రియాలిటీ షోల్లోనూ పాల్గొన్నాడు. సీజన్ లో కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేసిన తనీశ్ మంచి గుర్తింపే తెచ్చుకున్నాడు. అయితే ఇతను వెండితెరపై కానీ బుల్లితెరపై కానీ కనిపించి చాలా రోజులే అయ్యింది. అయితే ఇప్పుడు అనూహ్యంగా తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ జనసేన శ్రేణుల్లో జోష్ నింపుతున్నాడు.

ఎన్నికల ప్రచారంలో తనీశ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.