Tollywood: నాన్న పక్కన అమాయకంగా ఉన్న ఈ చిన్నోడు.. ఇప్పుడు తోపు హీరో..
ఈ అబ్బాయి ఎవరో గుర్తుపట్టగలరా..? టాలీవుడ్‌లో ఓ బడా ఫ్యామిలీకి చెందిన హీరో. తొలి సినిమాతోనే హిట్ అందుకున్నాడు. నటనతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఎవరో గుర్తుపట్టండి...?

ఇటీవలి కాలంలో సెలబ్రిటీల చిన్నప్పటి ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. అగ్ర తారల నుంచి.. నిన్న మొన్న ఇండస్ట్రీకి వచ్చిన హీరోయిన్స్ వరకు ఇప్పుడు ఫ్యాన్ పేజీలు పెరిగిపోయాయి. వాటిల్లో చాలా ఆయా స్టార్స్ అరుదైన ఫోటోలు షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరో టాలీవుడ్ హీరో చిన్నప్పటి ఫోటో ట్రెండ్ అవుతోంది. పైన ఫోటోను చూశారు కదా. తండ్రి ముద్దాడుతోన్న ఆ చిన్నోడు ఎవరో గుర్తుపట్టండి.తొలి సినిమాతోనే హిట్ అందుకున్నాడు. తనకంటూ సెపరేట్ ఆడియెన్స్‌ను సెట్ చేసుకున్నాడు. అస్సలు వివాదాల జోలికి పోడు. సౌమ్యుడిగా పేరుంది. కానీ వరుస డిజాస్టర్లతో కెరీర్‌లో ఇబ్బందుల పడ్డాడు. ఇక ఇప్పుడు సహాయనటుడిగానూ మెప్పిస్తున్నాడు. ఎవరో గుర్తుపట్టండి. మీకో క్లూ ఏంటంటే.. అతను అక్కినేని ఫ్యామిలీకి చెందినవాడు.
ఇక మేమే చెప్పేస్తాం లెండి… ఆ అబ్బాయి … సుశాంత్ అనుమోలు. అక్కినేని నాగేశ్వరరావు మనుమడు. ప్రొడ్యూసర్ నాగసుశీల తనయుడు. నాగార్జున మేనల్లుడు. 2008లో కాళిదాసు సినిమాతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించింది. ఆ తర్వాత 2009లో కరెంట్ సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు సుశాంత్. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలోని పాటలను ఇప్పటికీ వింటూనే ఉంటారు. అయితే ఈ సినిమా తర్వాత సుశాంత్ నటించిన సినిమాలు వరసగా ప్లాప్ అయ్యాయి. నటుడు రాహుల్ రవీంద్ర డైరెక్ట్ చేసిన చిలసౌ సినిమాతో చాన్నాళ్ల తర్వాత హిట్ అందుకున్నాడు.
ఆ తర్వాత సహాయ నటుడిగా టర్న్ అయ్యాడు సుశాంత్. త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన అలా వైకుంఠపురం సినిమాలో కీలకపాత్రలో నటించాడు. మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న భోళా శంకర్, రవితేజ హీరోగా వచ్చిన రావణాసుర చిత్రాల్లోనూ సహాయ నటుడిగా అలరించాడు. అతని తదుపరి సినిమాలపై ఎలాంటి వివరాలు తెలియరాలేదు. కాగా ఇటీవల ఫాదర్స్ డే సందర్భంగా తన తండ్రితో ఉన్న చిన్నప్పటి ఫోటో షేర్ చేశాడు సుశాంత్. అది నెట్టింట వైరల్‌గా మారింది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.