పొట్టి బట్టలు వేసుకొని అందాలు చూపించాలా.. హీరోయిన్స్ డ్రెస్‌సెన్స్‌పై శివాజీ షాకింగ్ కామెంట్స్

బిగ్ బాస్ సీజన్ 7తో తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు నటుడు శివాజీ. ఎంతకాలంగా వెండితెరకు దూరంగా ఉన్నా, బిగ్ బాస్ హౌస్‌లో తన మాటతో, వైఖరితో అందరినీ ఆకట్టుకున్నాడు. బయటకు వచ్చాక రిలీజైన 90’స్ వెబ్ సిరీస్, ఆ తర్వాత చేసిన కోర్టు సినిమా బ్లాక్ బాస్టర్స్‌గా నిలిచాయి.

పొట్టి బట్టలు వేసుకొని అందాలు చూపించాలా.. హీరోయిన్స్ డ్రెస్‌సెన్స్‌పై శివాజీ షాకింగ్ కామెంట్స్
Shivaji

Updated on: Dec 23, 2025 | 9:17 AM

జబర్దస్త్ ద్వారా మరోసారి ఫామ్ లోకి వచ్చారు నటుడు శివాజీ. పలు సినిమాల్లో చిన్న చిన్న  పాత్రలు చేసిన అయన ఆతర్వాత డబ్బింగ్ ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నితిన్, ఉదయ్ కిరణ్, పిజ్జా సినిమాలో విజయ్ సేతుపతికి డబ్బింగ్ చెప్పారు. ఆతర్వాత హీరోగా మారి సినిమాలు చేశారు. పలు సూపర్ హిట్ సినిమాల్లో హీరోగా నటించిన శివాజీ ఆతర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. సరైన అవకాశం కోసం చాలా కాలం ఎదురుచూశారు శివాజీ.. అదే సమయంలో బిగ్ బాస్ సీజన్ 7లో ఆఫర్ అందుకున్నారు. బిగ్ బాస్ సీజన్ 7లో శివాజీ తన ఆటతో ఆకట్టుకున్నాడు. బిగ్ బాస్ తర్వాత 90స్ అనే వెబ్ సిరీస్ తో మరోసారి ప్రేక్షకులను అలరించాడు. ఓటీటీలో విడుదలైన ఈ సీరీస్ మంచి విజయాన్ని అందుకుంది.

అందంలో స్టార్ హీరోయిన్స్ కు ఏమాత్రం తీసిపోదు.. దోచెయ్ సినిమాలో చైతూ చెల్లెలు గుర్తుందా.?

90స్ అనే వెబ్ సిరీస్ లో శివాజీ తన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. ఇక నాని నిర్మాతగా వ్యవహరించిన కోర్ట్ సినిమాలో మంగపతి పాత్రలో అదరగొట్టారు శివాజీ. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అద్భుతంగా నటించి భయపెట్టారు. ప్రస్తుతం శివాజీ దండోరా అనే సినిమాలో నటిస్తున్నారు. కాగా తాజాగా ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ లో శివాజీ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. హీరోయిన్స్ డ్రసింగ్ పై శివాజీ షాకింగ్ కామెంట్స్ చేశారు.

మేము పనికిరామా.. డ్రైవర్, పనిమనిషిల పాత్రలే ఇస్తారా.. సీరియల్ నటుడి ఆవేదన

ఈ ఈవెంట్ లో ముందుగా దండోరా చిత్రం గురించి చిత్రయూనిట్ గురించి మాట్లాడిన శివాజీ.. చివరిలో యాంకర్ స్రవంతి గురించి మాట్లాడారు.. ఆమె డ్రెస్ సెన్స్ బాగుందని చెప్పారు. హీరోయిన్స్ ఏ బట్టలు పడితే అవి వేసుకోకూడదు.. ఆ దరిద్రం మనమే అనుభవించాల్సి ఉంటుంది.  ఆడవాళ్ళ అందం చీరల్లో, నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుందని, అప్పుడే గౌరవం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు శివాజీ.  పొట్టిపొట్టి బట్టలు వేసుకుంటే అందరూ పైకి నవ్వుతూ బాగుంది అంటారు కానీ లోపల మాత్రం.. కాస్త మంచి బట్టలు వేసుకోవచ్చుగా అంటూ తిట్టుకుంటారని శివాజీ అన్నారు. స్త్రీ అంటే ప్రకృతి .. స్త్రీ ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరుగుతుంది.. ఈ క్రమంలోనే ఆయన మహానటి సావిత్రి, సౌందర్య వంటి నటీమణులను ఆయన గుర్తు చేసుకున్నారు. గ్లామర్ అనేది ఒక దశవరకు ఉండాలి అని శివాజీ అన్నారు.

చిన్న కథ కాదురా ఇది..! ఈ క్రేజీ బ్యూటీని గుర్తుపట్టారా.? అందంలో అప్సరస ఆమె

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.