Tollywood: ఈ బుడ్డోడిని గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరో.. మొదటి సినిమాకే ఫిల్మ్‌ఫేర్ కొట్టాడు

|

Aug 05, 2024 | 7:24 PM

పై ఫొటోలో బొద్దుగా కనిపిస్తోన్న ఈ బుడ్డోడిని గుర్తు పట్టారా? ఈ కుర్రాడు ఇప్పుడు టాలీవుడ్ లో హ్యాండ్సమ్ హీరోగా మారిపోయాడు. తనదైన నటనతో ఇరగదీస్తున్నాడు. ముఖ్యంగా తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నాడు. తన కామెడీ టైమింగ్, యాక్టింగ్ ట్యాలెంట్ కు గుర్తింపుగా మొదటి సినిమాతోనే ప్రతిష్ఠాత్మక ఫిల్మ్ ఫేర్ పురస్కారం అందుకున్నాడీ హీరో.

Tollywood: ఈ బుడ్డోడిని గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరో.. మొదటి సినిమాకే ఫిల్మ్‌ఫేర్ కొట్టాడు
Tollywood Actor Childhood Photo
Follow us on

పై ఫొటోలో బొద్దుగా కనిపిస్తోన్న ఈ బుడ్డోడిని గుర్తు పట్టారా? ఈ కుర్రాడు ఇప్పుడు టాలీవుడ్ లో హ్యాండ్సమ్ హీరోగా మారిపోయాడు. తనదైన నటనతో ఇరగదీస్తున్నాడు. ముఖ్యంగా తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నాడు. తన కామెడీ టైమింగ్, యాక్టింగ్ ట్యాలెంట్ కు గుర్తింపుగా మొదటి సినిమాతోనే ప్రతిష్ఠాత్మక ఫిల్మ్ ఫేర్ పురస్కారం అందుకున్నాడీ హీరో. అన్నట్లు ఈ హీరో అన్నయ్య కూడా ప్రముఖ నటుడే. టాలీవుడ్ లో రొమాంటిక్ అండ్ లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ఇక పై ఫొటో విషయానికి వస్తే.. 2011లో విడుదలైన గోల్కొండ హైస్కూల్ సినిమాలోనిది. ఇంద్రగంటి మోహనకృష్ణ తెరకెక్కించిన ఈ ఫీల్‌ గుడ్‌ మూవీలో సుమంత్‌, స్వాతి జంటగా నటించారు. స్కూల్‌ క్రికెట్‌ నేపథ్యంలో తెరకెక్కిన గోల్కొండ హైస్కూల్‌ సినిమాలో చాలామంది కుర్రాళ్లు నటించారు. అందులో పైన కనిపించే అబ్బాయి కూడా ఒకడు. ఇందులో వరుణ్‌ అనే పాత్రలో అద్భుతంగా నటించిన ఈ కుర్రాడు మరెవరో కాదు మ్యాడ్ సినిమాతో ఆడియెన్స్ ను మెస్మరైజ్ చేసిన సంగీత్ శోభన్. అదేనండి మన యంగ్ హీరో సంతోష్ శోభన్ తమ్ముడు. ఇటీవల జరిగిన ప్రతిష్ఠాత్మక ఫిల్మ్ ఫేర్ పురస్కారాల్లో మ్యాడ్ సినిమాకు గానూ బెస్ట్ డెబ్యూ మేల్ అవార్డు అందుకున్నాడీ క్రేజీ యాక్టర్. దీంతో అతని పేరు మళ్లీ మార్మోగిపోతోంది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు సంగీత్ శోభన్ కు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

 

ఇవి కూడా చదవండి

ప్రభాస్ తో వర్షం లాంటి బ్లాక్ బస్టర్ సినిమాను తీసిన డైరెక్టర్ శోభన్ కొడుకే సంగీత్ శోభన్. దీంతో సహజంగానే ఇతనికి కూడా సినిమాలపై ఆసక్తి కలిగింది. అలా 2011లో రిలీజైన గోల్కొండ హైస్కూల్‌లో అన్న సంతోష్‌ శోభన్‌ ప్రధాన పాత్ర పోషిస్తే.. ఛైల్డ్‌ ఆర్టిస్టుగా సంగీత్‌ శోభన్‌ నటించాడు. ఆ తర్వాత ‘ద బేకర్ అండ్ ద బ్యూటీ’ అనే వెబ్ సిరీస్‌లో ఓ స్పెషల్‌ రోల్‌ చేశాడు. అలాగే త్రీ రోజెస్, పిట్ట కథలు, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ సిరీస్‌లతోనూ ఓటీటీ ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాడు. ఇక మ్యాడ్ సినిమాలో దామోదర్ (డీడీ) అనే బీటెక్‌ కుర్రాడిగా తనదైన నటనతో ఫిల్మ్ ఫేర్ పురస్కారం అందుకున్నాడు. ప్రస్తుతం మ్యాడ్ సీక్వెల్ తో పాటు మరికొన్ని సినిమాలు ఈ యంగ్ హీరో చేతిలో ఉన్నాయి.

సంగీత్ శోభన్ లేటెస్ట్ ఫొటోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.