AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ రోజు మూడుపూటలా తింటున్నా అంటే కారణం ఆ హీరోనే.. ఆయన లేకుంటే

30 ఇయర్స్‌ ఇండస్ట్రీ’ అంటూ డైలాగ్‌తో టాలీవుడ్‌లో తెగ ఫేమస్‌ అయిపోయారు ప్రముఖ నటుడు, కమెడియన్‌ పృథ్వీరాజ్‌. ఈ డైలాగ్‌కు తగ్గట్లే సినిమా ఇండస్ట్రీలో ఆయనకు 30 ఏళ్ల అనుభవం ఉంది. నాటి సీనియర్‌ ఎన్టీఆర్‌ నుంచి నేటి జూనియర్‌ ఎన్టీఆర్‌ వరకు అందరి హీరోల సినిమాల్లో నటించారాయన.

ఈ రోజు మూడుపూటలా తింటున్నా అంటే కారణం ఆ హీరోనే.. ఆయన లేకుంటే
Actor Prudhvi Raj
Rajeev Rayala
|

Updated on: Apr 24, 2026 | 12:02 PM

Share

ప్రముఖ సినీ నటుడు, కమెడీయన్ పృథ్వీరాజ్‌‌ సినిమాతో పాటు వివాదాలతోనూఎక్కువగా పాపులర్ అయ్యారు పృథ్వీరాజ్‌‌. నటుడిగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ అనే ఒక్క డైలాగ్ పృథ్వీరాజ్‌‌ కు క్రేజ్ తెచ్చిపెట్టింది. కెరీర్ బిగినింగ్ లో సహాయక పాత్రలు చేసిన ఆయన ఆతర్వాత కమెడియన్ గా నవ్వులు పూయించారు. పృథ్వీరాజ్‌‌ చెప్పే డైలాగ్స్, కామెడీ టైమింగ్ ప్రేక్షకులను విపరీతంగా నవ్వించాయి. కమెడియన్‌గా బాగా రాణిస్తోన్న సమయంలోనే రాజకీయాల్లోకి అడుగపెట్టారు. అదే సమయంలో పలు వివాదాల్లో చిక్కుకున్నారు. ఇక ఇప్పుడు తిరిగి సినిమాలతో బిజీగా మారారు పృథ్వీరాజ్‌‌. ఇదిలా ఉంటే పృథ్వీరాజ్‌‌ ఓ హీరో గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి : గుండు వెనక అసలు కారణం ఇదే.. కన్నీళ్లు పెట్టిస్తున్న రమణ గోగుల ఎమోషనల్ స్టోరీ

పృథ్వీ రాజ్ గతంలో ఓ ప్రెస్ మీట్ లో సూపర్ స్టార్ కృష్ణ గారి గొప్ప మనసు, మానవత్వంపై తన అనుభవాలను పంచుకున్నారు. కృష్ణ గారు కేవలం ఒక హీరోగానే కాకుండా, ఒక మహోన్నత మానవీయ వ్యక్తిత్వం కలిగిన మహానుభావుడని పృథ్వీ రాజ్ కొనియాడారు. తాను ఈరోజు భోంచేస్తున్నానంటే దానికి కారణం సూపర్ స్టార్ కృష్ణ గారేనని పృథ్వీ రాజ్ ఎమోషనల్‌గా తెలిపారు. పద్మాలయా లాంటి పెద్ద స్టూడియోలలో ఏ హీరోకి కూడా కృష్ణ గారికి ఉన్నట్లుగా ఒక పర్సనల్ మేకప్ రూం ఉండేది కాదు అని తెలిపారు పృథ్వీ రాజ్.

ఇది కూడా చదవండి : చూసుకోవాలికదమ్మా..!! అడ్డంగా దొరికిపోయిన సింగర్.. ఏకిపారేస్తున్న నెటిజన్స్

అలాంటి విశాలమైన రూంలో తాను సుమారు ఒక సంవత్సరం పాటు ఉన్నానని పృథ్వీ రాజ్ గుర్తుచేసుకున్నారు. ఒక సందర్భంలో కృష్ణ గారు తనను చూసి ఎక్కడ ఉంటావయ్యా.. అని అడిగినప్పుడు, తాను సమాధానం చెప్పకముందే, అక్కడే ఉన్న హనుమంతరావు అనే వ్యక్తిని పిలిచి ఇతన్ని నా రూంలో ఉంచండి అని సూచించారట. అలాంటి మహోన్నతమైన ఉదారత, అభిమానం కృష్ణ గారి సొంతమని పృథ్వీ రాజ్ వివరించారు. కృష్ణ గారు ఒక హీరోకు మించి, మానవీయత, అభిమానం, ఒక బ్రహ్మాండమైన మనిషి అని ఆయన ప్రశంసించారు. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : 60మంది హీరోయిన్స్‌తో నటించిన ఏకైక హీరో.. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కూడా టచ్ చేయని రికార్డ్ ఆయనది

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఇండస్ట్రీలోనే సెన్సేషన్ ఆమె.. చివరకు గవర్నమెంట్ హాస్పిటల్లో అలా..
ఇండస్ట్రీలోనే సెన్సేషన్ ఆమె.. చివరకు గవర్నమెంట్ హాస్పిటల్లో అలా..
మీ ఇంట్లోని మనీ ప్లాంట్ పెరగడం లేదా.. వంటింట్లోని ఈ చిన్న చిట్కా
మీ ఇంట్లోని మనీ ప్లాంట్ పెరగడం లేదా.. వంటింట్లోని ఈ చిన్న చిట్కా
తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. వెదర్ రిపోర్ట్
గంభీర్ కోచింగ్‌లో టీమిండియా బద్దలు కొట్టిన దారుణమైన రికార్డులివే
గంభీర్ కోచింగ్‌లో టీమిండియా బద్దలు కొట్టిన దారుణమైన రికార్డులివే
ఓటీటీని షేక్ చేస్తున్న 5 వెబ్ సిరీస్ లు..
ఓటీటీని షేక్ చేస్తున్న 5 వెబ్ సిరీస్ లు..
రోహిత్ శర్మ ఫ్యూచర్‌పై లిటిల్ మాస్టర్ సంచలన వ్యాఖ్యలు
రోహిత్ శర్మ ఫ్యూచర్‌పై లిటిల్ మాస్టర్ సంచలన వ్యాఖ్యలు
గుడ్‌న్యూస్‌.. ఇక వాట్సాప్‌లో ఆయుష్మాన్‌ భారత్‌ సదుపాయాలు
గుడ్‌న్యూస్‌.. ఇక వాట్సాప్‌లో ఆయుష్మాన్‌ భారత్‌ సదుపాయాలు
వందే భారత్‌ను లాగిన పాత డీజిల్ ఇంజన్.. ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌ అంటూ
వందే భారత్‌ను లాగిన పాత డీజిల్ ఇంజన్.. ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌ అంటూ
ఉద్యోగం చేసే ఆడవాళ్లు తినాల్సిన మాంసం కారం పొడి..
ఉద్యోగం చేసే ఆడవాళ్లు తినాల్సిన మాంసం కారం పొడి..
హైరైజ్ బిల్డింగ్‌లకి కొత్త రూల్.. ఇకపై ఆ సిస్టమ్ ఉంటేనే పర్మిషన్
హైరైజ్ బిల్డింగ్‌లకి కొత్త రూల్.. ఇకపై ఆ సిస్టమ్ ఉంటేనే పర్మిషన్