
సౌత్ ఇండస్ట్రీలోని అత్యంత డిమాండ్ ఉన్న నటులలో కమల్ హాసన్ ఒకరు. భారతీయ చిత్రపరిశ్రమలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గురింపు తెచ్చుకున్నారు. 70 ఏళ్ల వయసులోనూ కుర్రహీరోలకు పోటీగా వరుస సినిమాలతో అలరిస్తున్నారు. ప్రస్తుతం థగ్ లైఫ్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ కొన్ని రోజుల్లో విడుదల కానుంది. ఇటీవలే ఈ సినిమాలోని మొదటి పాట విడుదలైంది. ఈ సినిమా పాటల ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరైన నటుడు కమల్ హాసన్ సినీ ప్రియులకు క్షమాపణలు చెప్పారు. తాను, దర్శకుడు మణిరత్నం చాలా కాలం క్రితమే కలిసి పనిచేసి ఉండాల్సిందని అన్నారు. ఇది చాలా సంవత్సరాలుగా సినీ ప్రియుల డిమాండ్. కానీ వ్యక్తిగత కారణాల వల్ల మేము కలిసి పనిచేయలేదని అన్నారు.
“అది మా తప్పు, దానికి నేను క్షమాపణలు కోరుతున్నాను” అని కమల్ హాసన్ అన్నారు. మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ నటించిన చిత్రం ‘నాయగన్’. ఆ సినిమా ఇప్పటికీ భారతీయ సినిమాలో ఒక కల్ట్ క్లాసిక్. ఆ తర్వాత, ఇద్దరూ మళ్ళీ ఎప్పుడూ కలిసి పనిచేయలేదు. ఈ ఇద్దరి మధ్య విభేదాల కారణంగా కలిసి పనిచేయలేదని రూమర్స్ వినిపించాయి. ఇద్దరు దిగ్గజాలు కలిసి పనిచేయకపోవడం అంటే సినీ ప్రియులకు అన్యాయం అని కమల్ హాసన్ క్షమాపణలు చెప్పారు.
“మేము బైక్ మీద వచ్చి ఎల్డమా రోడ్ లోని బైక్ పార్క్ లో కూర్చుని సినిమా గురించి మాట్లాడుకున్నాము” అంటూ పాత రోజులను గుర్తుచేసుకున్నారు. “కానీ భవిష్యత్తులో అది సాధ్యమవుతుందో లేదో చూడాలి” అని కమల్ హాసన్ అన్నారు. కమల్ హాసన్ ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో ‘థగ్ లైఫ్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో సిలంబరసన్, త్రిష కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.
ఇవి కూడా చదవండి :