కిడ్నీ ఫెయిల్యూర్.. గుండె సమస్యలతో ఉన్న నన్ను సినిమాలే హీరోగా మార్చాయి.. ఆసక్తికర విషయాలను చెప్పిన రానా..

| Edited By: Rajeev Rayala

Mar 25, 2021 | 1:07 PM

Rana Daggubati: బాహుబలి తర్వాత రానా కొద్ది రోజులు తీవ్ర అనారోగ్యంతో విదేశాలకు వెళ్లిన సంగతి తెలిసింది. కిడ్నీ ఫెల్యూర్, గుండె సమస్యలతో ఇబ్బందిపడుతున్న రానా ఇటీవలే అమెరికాలో చికిత్స తీసుకొని వచ్చాయి.

కిడ్నీ ఫెయిల్యూర్.. గుండె సమస్యలతో ఉన్న నన్ను సినిమాలే హీరోగా మార్చాయి.. ఆసక్తికర విషయాలను చెప్పిన రానా..
Rana Daggubati
Follow us on

Rana Daggubati: బాహుబలి తర్వాత రానా కొద్ది రోజులు తీవ్ర అనారోగ్యంతో విదేశాలకు వెళ్లిన సంగతి తెలిసిందే. కిడ్నీ ఫెల్యూర్, గుండె సమస్యలతో ఇబ్బందిపడుతున్న రానా ఇటీవలే అమెరికాలో చికిత్స తీసుకొని వచ్చాడు. ప్రస్తుతం రానా ఆరోగ్యంగానే ఉన్నారు. తాజాగా రానా.. ప్రభు సాలమన్ దర్శకత్వంలో ‘అరణ్య’ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం తెలుగు, తమిళం భాషల్లో మార్చి 26న విడుదల కానుంది. ఇదిలా ఉంటే.. హిందీలో కూడా మార్చి 26నే విడుదల చేయాలనుకున్నారు కానీ.. కరోనా కేసులు పెరుగుతుండడంతో.. అక్కడ విడుదలను వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించింది చిత్రయూనిట్. తాజాగా ఈ చిత్ర ప్రమోషన్స్‏లో భాగంగా.. కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

అరణ్య వంటి సినిమాలో పనిచేయడం .. తన జీవితంలో లభించిన సరైన అవకాశమని రానా అభిప్రాయపడ్డారు. ఈ సినిమాలో తన పాత్ర ద్వారా ఆద్యాత్మిక విషయాలను తెలిసుకున్నానని రానా చెప్పారు. ఇందులోని తన పాత్ర ప్రజలను ప్రేమించేవాడు.. అడవిని ఆరాదించేవాడని.. అలాంటి వ్యక్తిత్వాలు ఓ వ్యక్తిని ప్రేక్షకులు చూస్తారని చెప్పుకోచ్చాడు. ఇండియన్ ఎక్స్‏ప్రెస్ డాట్ కామ్‏క ఇచ్చిన ఇంటర్వ్యూలో బాహుబలి భల్లాలదేవ నుంచి అరణ్య వరకు ఎలా మారిపోయాడో వివరించాడు.

అరణ్య కోసం ప్రభు నా దగ్గర వచ్చినప్పుడు నేను బాహుబలి సినిమా చేస్తున్నాను. ఆ సమయంలో నేను భల్లాల దేవుడిగా నటిస్తున్నాను. దీంతో నా లుక్ చూడాటానికి భారీగా కనిపించింది. కానీ అరణ్య కోసం నేను ఎలా మారాలో ప్రభు చెప్పాడు. ముందుగా నా అనారోగ్య సమస్యలను అధిగమించడానికి నాకు ప్రభు సమయం ఇచ్చారు. ఇందుకోసం నేను థాయ్‏లాండ్ వెళ్లాను. అక్కడ మొదటి 10 రోజులు అరణ్యలోని నా పాత్ర గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించాను. అతను నడిచే విధానం.. మాట్లాడే విధానంతోపాటు.. అడివితో అతని సంబంధం గురించి తెలుసుకున్నాను. అరణ్య కోసం మొదట నేను 25 రోజుల సమయం ఇచ్చాను. ఈ క్రమంలోనే నేను నా సర్జరీ నుంచి కోలుకునేంత వరకు అరణ్య దర్శకుడు ప్రభు సోలమన్ వెయిట్ చేశారు. ఇక అనారోగ్య సమస్యలను అధిగమించి.. హీరోగా ఎదగడానికి నా సినిమాలు నాకు దోహదపడ్డాయి అంటూ చెప్పుకోచ్చాడు రానా. అలాగే నా చికిత్సకు అడవి పెద్ద భాగం అయ్యింది. అలాగే రీల్ ప్రపంచం సరదాగా ఉంటుంది. నిజ జీవితంలో ఏం జరిగిన రీల్ లైఫ్ అప్‏సెట్ అవ్వకూడదు. షూటింగ్‏లో ఉన్నప్పుడు బాధలేవి గుర్తుకురావు.. అందుకే నన్ను ముందుకు నడుపుతాయని భావిస్తున్నాను అని తెలిపారు. ఈ సినిమాలో రానాకు జోడీగా సాయిపల్లవి నటిస్తుంది. విష్ణువిశాల్‌, పుల్‌కిత్ సామ్రాట్‌, జోయా హుస్సేన్‌, శ్రియా పిల్‌గావ్ంక‌ర్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

Also Read:

దర్శకేంద్రుని ఇంట విషాదం.. ఆర్కే ఫిలిమ్స్ అధినేత కన్నుమూత.. సంతాపం తెలిపిన సినీ ప్రముఖులు..

Suryadevara Naga Vamsi: హీరో నాని చాలా ఎఫ‌ర్ట్ పెట్టారు అందుకే సినిమా జాతీయ అవార్దును సొంతం చేసుకుంది..