MaheshBabu : బాబు రేంజే వేరు..! టాప్ 6 రీరిలీజ్ సినిమాల్లో.. మూడు మహేష్ బాబువే.. అవి ఏంటంటే
కొత్త సినిమాలు రిలీజ్ అయిన సాయంత్రానికే పైరసీ అయ్యి ఫోన్ లో వచ్చేస్తున్నాయి.. కానీ పాత సినిమాలు మాత్రం రీ రిలీజ్ అయ్యి థియేటర్స్ లో అదరగొడుతున్నాయి. నెలకు మూడు నాలుగు సినిమాలు రీ రిలీజ్ అవుతున్నాయి. కొత్త సినిమాలు థియేటర్స్ లో సోసోగా ఆడుతుంటే.. రీరిలీజ్ సినిమాలు మాత్రం అదరగొడుతున్నాయి. ఇప్పటికే దాదాపు అందరు హీరోల సినిమాలు రీ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

సినిమా ఇండస్ట్రీలో రీ రిలీజ్ ను తెగ సందడి చేస్తున్నాయి. ముఖ్యంగా టాలీవుడ్‌లో రీ-రిలీజ్‌లు ఇటీవలి కాలంలో ఒక ప్రముఖ ట్రెండ్‌గా మారాయి, ప్రత్యేకించి గతంలో రిలీజ్ అయిన క్లాసిక్ సినిమాలను 4K లేదా రీమాస్టర్డ్ వెర్షన్‌లలో మళ్లీ థియేటర్లలో విడుదల చేయడం ద్వారా. ఈ రీ-రిలీజ్‌లు అభిమానులకు తమ అభిమాన హీరోల సినిమాలను పెద్ద స్క్రీన్‌పై మళ్లీ చూసే అవకాశాన్ని అందిస్తాయి, అదే సమయంలో నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు అదనపు ఆదాయాన్ని తెచ్చిపెడతాయి. పాత సినిమాలు, ముఖ్యంగా స్టార్స్ లాంటి పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు, చిరంజీవి వంటి వారి సినిమాలు అభిమానుల్లో మరోసారి ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఈ సినిమాలను మళ్లీ థియేటర్లలో చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే చాలా సినిమాలు రీ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
ఇక ఇప్పటివరకు విడుదలైన రీ రిలీజ్ సినిమాల్లో టాప్ 6 సినిమాల్లో మూడు సినిమాలు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఇక మహేష్ బాబు రీ రిలీజ్ సినిమాల్లో రికార్డ్ క్రియేట్ చేసిన సినిమాల్లో ముందుగా చెప్పుకోవాల్సిన సినిమా మురారి. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన మురారి సినిమా భారీ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. మహేష్ బాబు, సోనాలి బింద్రే కలిసి నటించిన ఈ సినిమా కొన్ని నెలల క్రితమే రీ రిలీజ్ అయ్యింది. రీ రిలీజై ఏకంగా రూ.8.90 కోట్ల కలెక్షన్లు సొంతం చేసుకుంది మురారి. మురారి సినిమా టాప్ 1లో నిలిచింది. ఆతర్వాత 2 స్థానంలో పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్.. రూ.8.01 కోట్లు సొంతం చేసుకుంది.
మూడో స్థానంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఖుషి మూవీ రూ.7.46 కోట్లు అందుకుంది. మహేష్ బాబు విక్టరీ వెంకటేష్ కాంబోలో వచ్చిన సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా కూడా నయా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా రూ. రూ.6.60 కోట్లు వసూల్ చేసింది. ఆతర్వాత మహేశ్ బాబు – కాజల్ జోడీగా పూరి డైరెక్ట్ చేసిన చిత్రం బిజినెస్‌మెన్.. రూ. 5.85 కోట్లు అందుకుంది. ఇలా టాప్ 6 సినిమాల్లో మూడు సినిమాలు మహేష్ బాబు సినిమాలే ఉన్నాయి. ఇది నిజంగా ఓ రికార్డ్ అనే చెప్పాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.




