లేటెస్ట్ అప్డేట్ : మూడు రోజుల కస్టడీకి నూతన్ నాయుడు
సినీ నిర్మాత, బిగ్ బాస్ కంటెస్టెంట్ నూతన్ నాయుడు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అతని మోసాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.
సినీ నిర్మాత, బిగ్ బాస్ కంటెస్టెంట్ నూతన్ నాయుడు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అతని మోసాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. పోలీస్ స్టేషన్‌లో నూతన్ నాయుడుపై ఫిర్యాదులు పెరుగుతున్నాయి. కాగా తాజాగా నూతన నాయుడుని విశాఖ పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్ పేరిట పలువురికి ఫోన్ చేసి మోసం చేసిన కేసులో అతడిని విచారించనున్నారు.
జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న నూతన నాయుడుని లోతుగా విచారణ చేసేందుకు పర్మిషన్ ఇవ్వాలని విశాఖ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. పోలీసుల పిటిషన్ పరిశీలించిన న్యాయమూర్తి, శని, ఆది, సోమవారాల్లో విచారించదానికి అనుమతి ఇచ్చారు. దీంతో పోలీసులు నూతన్ నాయుడిని ఈ రోజు ఉదయం విశాఖ సెంట్రల్ జైలు నుంచి పెందుర్తి తీసుకు వచ్చి విచారిస్తున్నారు. దళిత యువకుడికి శిరోముండనం చేసిన కేసులో ఇప్పటికే నూతన్ నాయుడు భార్య మధుప్రియ సహా ఏడుగురు అరెస్టయిన విషయం తెలిసిందే.
మరోవైపు బ్యాంకులో ఉద్యోగాలిప్పిస్తానని పలువురికి టోకరా వేసిన నూతన్ నాయుడు.. వారి నుంచి భారీగా వసూళ్లకు పాల్పడినట్లు తెలుస్తోంది. శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తికి ఎస్‌బీఐలో డైరెక్టర్ పదవి ఇప్పిస్తానని ట్రాప్ చేసిన నూతన్ నాయుడు.. అతడి నుంచి రూ.12కోట్లు వసూలు చేశాడని సమాచారం. అలాగే నూకరాజు అనే మరో వ్యక్తికి అదే బ్యాంకులో జాబ్ ఇప్పిస్తానని 5 లక్షలు వసూలు చేశాడు. ఈ క్రమంలో ఆ ఇద్దరు మహారాణి పేట పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో నూతన్ నాయుడుపై చీటింగ్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది.
Also Read :