Salaar: ఆ దేశ ఆర్మీతో ప్రభాస్ పోరాటం.. సలార్ స్టోరీ లీక్.. ప్రశాంత్ నీల్ ప్లాన్ అదిరిపోయిందిగా..

|

Jul 07, 2023 | 4:04 PM

దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్ తో హోంబలే ఫిల్మ్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న ఈ సినిమా సెప్టెంబర్ 28న అడియన్స్ ముందుకు రానుంది. ఇప్పటికే చివరి దశకు చేరుకున్న ఈ సినిమా మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. మరోవైపు తాజాగా విడుదలైన టీజర్ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. పవర్ ఫుల్ ఎలివేషన్స్.. బ్యాగ్రౌండ్ మ్యూజిక్, డైలాగ్స్‏తో రిలీజ్ అయిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.

Salaar: ఆ దేశ ఆర్మీతో ప్రభాస్ పోరాటం.. సలార్ స్టోరీ లీక్.. ప్రశాంత్ నీల్ ప్లాన్ అదిరిపోయిందిగా..
Salaar
Follow us on

కేజీఎఫ్ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఈ మూవీస్ పాన్ ఇండియనా మూవీ లవర్స్‏కు తెగ నచ్చేశాయి. దీంతో నీల్ నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై మరింత హైప్ పెరిగిపోయింది. ఈ క్రమంలోనే నీల్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తుండడంతో అంచనాలు ఓరెంజ్‏లో ఏర్పడ్డాయి. వీరిద్దరి కాంబోలో వస్తోన్న సలార్ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్ తో హోంబలే ఫిల్మ్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న ఈ సినిమా సెప్టెంబర్ 28న అడియన్స్ ముందుకు రానుంది. ఇప్పటికే చివరి దశకు చేరుకున్న ఈ సినిమా మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. మరోవైపు తాజాగా విడుదలైన టీజర్ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. పవర్ ఫుల్ ఎలివేషన్స్.. బ్యాగ్రౌండ్ మ్యూజిక్, డైలాగ్స్‏తో రిలీజ్ అయిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఇందులో మరోసారి ప్రభాస్ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా కేజీఎఫ్ చిత్రంతో లింక్ అయి ఉంటుందని.. అంతేకాకుండా.. సలార్ సైతం 2పార్ట్స్ ఉంటుందని తెలుస్తోంది. ఇక ఇప్పుడు సలార్ స్టోరీ ఇదే అంటూ నెట్టింట చర్చ మొదలైంది. తాజాగా వినిపిస్తోన్న సమాచారం ప్రకారం సున్నపు రాయి మైనింగ్ ఫార్మా మాఫియా నేపథ్యంలో యూఎస్ ఆర్మీతో కనెక్ట్ అయ్యి ఉంటుందట. ప్రభాస్ యూఎస్ ఆర్మీతో చేసే పోరాట సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయని టాక్ నడుస్తోంది. 1980 బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా కథ నడుస్తుందనే ప్రచారం జరుగుతుంది.

ఇవి కూడా చదవండి

ఈ సినిమా కోసం ప్రత్యేకంగా కొన్ని కీలకమైన సన్నివేశాలను ఇటలీలో చిత్రీకరించారని.. అలాగే స్టోరీ లైన్ లో కొన్ని ఎలిమెంట్స్ కేజీఎఫ్ చాప్టర్ 2 లింక్ ఉంటాయని తెలుస్తోంది. కేజీఎఫ్, సలార్ సిరీస్ లను కలిపి ఒక సీక్వెల్ ప్రాజెక్ట్ చేయబోతున్నట్లు గతంలో మేకర్స్ వెల్లడించారు. అందుకు తగినట్లుగానే ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. సలార్ ఫస్ట్ పార్టుకు కేజీఎఫ్ 2 లింక్స్ ఉంటాయని టాక్ నడుస్తుంది. మరీ ఇది ఎంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది.