Tollywood Movies: ఈ వారం థియేటర్లలో… ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు ఇవే..

|

Feb 28, 2022 | 11:58 AM

తెలుగు ప్రేక్షకులకు అదిరిపోయే ఎంటర్‏టైన్మెంట్ అందించేందుకు సిద్ధమయ్యారు మేకర్స్. చిన్న సినిమాలే కాకుండా భారీ బడ్జెట్ చిత్రాలు

Tollywood Movies: ఈ వారం థియేటర్లలో... ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు ఇవే..
Ott Movies
Follow us on

తెలుగు ప్రేక్షకులకు అదిరిపోయే ఎంటర్‏టైన్మెంట్ అందించేందుకు సిద్ధమయ్యారు మేకర్స్. చిన్న సినిమాలే కాకుండా భారీ బడ్జెట్ చిత్రాలు ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఓవైపు థియేటర్లలో సూపర్ హిట్ సినిమాలు సందడి చేయనుండగా.. మరోవైపు.. బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలు ఓటీటీలో ప్రేక్షకులను అలరించనున్నాయి. మరీ ఈ వారం థియేటర్లలో.. ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు ఎంటో తెలుసుకుందామా.

Aadavallu Meeku Johaarlu

శర్వానంద్, రష్మిక జంటగా నటించిన చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు. డైరెక్టర్ తిరుమల కిషోర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా మార్చి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Hey Sinamika

స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, కాజల్ అగర్వాల్, అదితి రావు హైదరీ నటించిన లేటేస్ట్ చిత్రం హే సినామిక. ఇద్దరు వ్యక్తులు విడిపోవడానికి సవాలక్ష కారణాలున్నాయి. కానీ కలిసి జీవించడానికి ఒకే ఒక్క కారణం ప్రేమ అంటూ మార్చి 3న థియేటర్లలో విడుదల కానుంది.

Kiran Abbavaram

ఇటీవల ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. ప్రస్తుతం ఈ హీరో ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం సెబాస్టియన్ పీసీ 524. కిరణ్ సరసన కోమలి ప్రసాద్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ మార్చి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఓటీటీలోకి వచ్చే సినిమాలు..

Dj Tillu

యంగ్ సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన చిత్రం డీజే టిల్లు. ఇటీవల థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. విమల్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆహాలో మార్చి 4న ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.

Vishal

తమిళ్ స్టార్ హీరో విశాల్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ చిత్రం సామాన్యుడు. ఈ మూవీ జనవరి 26న విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా ఇప్పుడు మార్చి 4న జీ5లో స్ట్రీమింగ్ కానుంది.

ఇక అమెజాన్ ప్రైమ్ లో..
నో టైమ్‌ టు డై – మార్చి 4
ద బాయ్స్‌ ప్రజెంట్స్‌: డయాబాలికల్‌ – మార్చి 4

అలాగే నెట్ ఫ్లిక్స్..
ఎగైన్స్‌ ద ఐస్‌ – మార్చి 2
ద వీకెండ్‌ ఎ వే – మార్చి 3
పీసెస్‌ ఆఫ్‌ హర్‌ (వెబ్‌ సిరీస్‌) – మార్చి 4
అవుట్‌లాండర్‌ ఆరో సీజన్‌ – మార్చి 7

డిస్నీ ప్లస్ హాట్ స్టార్..
రుద్ర: ద ఎడ్జ్ ఆఫ్ డార్క్ నెస్ (హిందీ సిరీస్) మార్చి 4నట
సుత్ లియాన్ (హిందీ సిరీస్) మార్చి 4న

Also Read: Sarkaru Vaari Paata: యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న కళావతి సాంగ్.. టాలీవుడ్‏లోనే నెంబర్ వన్ రికార్డ్..

Nithiin: సౌత్ ఇండియాలోనే ఆ విషయంలో ఏకైక హీరోగా నితిన్.. బీటౌన్‏లో క్రేజ్ మాములుగా లేదుగా..

Thyroid: థైరాయిడ్ సమస్యతో ఇబ్బందిపడుతున్నారా ? అయితే ఈ జ్యూస్‏లతో చెక్ పెట్టొచ్చు.. అవెంటంటే..

Viral Photo: చూడగానే మైమరిపించే కళ్లు.. చూస్తూనే ఉండాలనిపించే మోము.. ఎవరో గుర్తించారా..?