Tollywood: ఫెస్టివల్ మూవీస్ జాతర.. ప్రతిపండగకు ఆడియన్స్‌కు పూనకాలే..

రాబోయే ఆర్నెళ్లలో ఉన్న మూడు ఫెస్టివల్ సీజన్స్ హౌజ్ ఫుల్ అయిపోయాయి. మరి దసరా టూ సంక్రాంతి వయా క్రిస్మస్ రానున్న ఆ సినిమాలేంటి..?

Tollywood: ఫెస్టివల్ మూవీస్ జాతర.. ప్రతిపండగకు ఆడియన్స్‌కు పూనకాలే..
Tollywood
Follow us
Dr. Challa Bhagyalakshmi - ET Head

| Edited By: Rajeev Rayala

Updated on: Jul 26, 2023 | 5:57 PM

కొత్త సినిమాలు వస్తే పండగ వచ్చినట్లే.. అలాగే పండగ వచ్చిందంటే కొత్త సినిమాలు వచ్చేస్తుంటాయి. సినిమాలు, ఫెస్టివల్స్.. ఈ రెండింటికీ విడదీయలేని అనుబంధం ఉంటుంది. అందుకే పండగలొస్తుంటే చాలు.. సినిమాలు క్యూ కడుతుంటాయి. ఇప్పుడూ ఇదే జరుగుతుంది. రాబోయే ఆర్నెళ్లలో ఉన్న మూడు ఫెస్టివల్ సీజన్స్ హౌజ్ ఫుల్ అయిపోయాయి. మరి దసరా టూ సంక్రాంతి వయా క్రిస్మస్ రానున్న ఆ సినిమాలేంటి..? 2023 సెకండాఫ్ అలా మొదలైందో లేదో.. అప్పుడే బేబీ లాంటి బ్లాక్‌బస్టర్ స్వాగతం పలికింది. దాంతో బాక్సాఫీస్ రెండు వారాలుగా కళకళలాడుతుంది. దీన్నిప్పుడు కంటిన్యూ చేయాలని చూస్తున్నారు మెగా హీరోలు. రాబోయే నెల రోజులు పూర్తిగా వాళ్ల కంట్రోల్‌లోనే ఉంది. జులై 28న బ్రో.. ఆగస్ట్ 11న చిరంజీవి భోళా శంకర్.. 18న ఆదికేశవ.. 25న వరుణ్ తేజ్ గాండీవదారి అర్జున సినిమాలు రానున్నాయి.

మెగా ఫెస్టివల్ తర్వాత అసలు సినీ పండగ మొదలు కానుంది. ముఖ్యంగా దసరా, క్రిస్మస్, సంక్రాంతి సీజన్స్ అయితే కొత్త సినిమాలతో కిటకిటలాడుతున్నాయి. ఒకటి రెండు కాదు.. ప్రతీ పండక్కి కనీసం మూడు నాలుగు సినిమాలు పోటీ పడుతున్నాయి. ముందుగా దసరాను తీసుకుంటే.. ఇప్పటికే మేమొస్తున్నామంటూ అటు విజయ్‌తో లియో.. భగవంత్ కేసరితో బాలయ్య.. టైగర్ నాగేశ్వరరావుతో రవితేజ కన్ఫర్మ్ చేసారు.

అక్టోబర్ 19న బాలయ్య, విజయ్ వస్తుంటే.. 20న రవితేజ రానున్నారు. ఇదిలా ఉంటే దసరా తర్వాత క్రిస్మస్ సీజన్ కూడా అలాగే హౌజ్ ఫుల్ అయిపోయింది. వరసగా మూడు రోజుల్లో మూడు సినిమాలు రానున్నాయి. డిసెంబర్ 21న నాని హాయ్ నాన్న విడుదల కానుంది. గతంలో క్రిస్మస్‌కు ఎంసిఏ, శ్యామ్ సింగరాయ్‌తో హిట్స్ అందుకున్నారు నాని. డిసెంబర్ 22న వెంకటేష్ సైంధవ్, సుధీర్ బాబు హరోం హర.. 23న నితిన్ ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలు రానున్నాయి.

సంక్రాంతి సీజన్ అయితే చెప్పడానికి లేదు.. ఇప్పటికే అరడజన్ సినిమాలు క్యూలో ఉన్నాయి. ప్రభాస్ ప్రాజెక్ట్ కే, మహేష్ గుంటూరు కారం అయితే ఇంకా టెక్నికల్‌గా రేసులోనే ఉన్నాయి. వీటీతో పాటు విజయ్ దేవరకొండ, పరశురామ్ సినిమా, రవితేజ ఈగల్, ప్రశాంత్ వర్మ హను మాన్ సినిమాలను సైతం పండక్కే తీసుకురావాలని చూస్తున్నారు మేకర్స్. వీళ్లు కాకుండా కళ్యాణ్ కృష్ణ సినిమాతో చిరంజీవి కూడా రేసులోనే ఉన్నారు. ఇలా ఫెస్టివల్స్ అన్నీ హౌజ్ ఫుల్ బోర్డులు పెట్టేసుకున్నాయి.