Naga Chaitanya-Rana: పెళ్లి వేళ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన రానా.. పర్సనల్ లైఫ్ గురించి నాగ చైతన్య ఏమన్నారంటే..
అక్కినేని నాగచైతన్య మరికొన్ని గంటల్లో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఈరోజు రాత్రి 8 గంటలకు హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల మెడలో చైతూ మూడు మూళ్లు వేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరి పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ క్రమంలోనే తాజాగా స్పెషల్ వీడియో షేర్ చేశారు రానా.
అక్కినేని యువసామ్రాట్ నాగ చైతన్య మరికొన్ని గంటల్లో బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పనున్నారు. ఈరోజు (డిసెంబర్ 04న) హీరోయిన శోభిత ధూళిపాళ్లతో కలిసి ఏడడుగులు వేయనున్నారు. వీరిద్దరి వివాహం ఈరోజు రాత్రి 8 గంటలకు అన్నపూర్ణ స్టూడియోలో జరగనుంది. ఈ వివాహ వేడుకకు ఇరు కుటుంబసభ్యులు, సన్నిహితులు, బంధువులు హాజరుకానున్నారు. ఈ క్రమంలో తాజాగా రానా దగ్గుబాటి షేర్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది. అందులో పర్సనల్ లైఫ్ పై చైతన్య ప్రశ్నల వర్షం కురిపించగా.. చైతూ ఫన్నీగా ఆన్సర్ ఇచ్చారు.
రానా దగ్గుబాటి ఇటీవల అమెజాన్ ఓటీటీలో ది రానా దగ్గుబాటి షో అనే టాక్ షో స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు ఎపిసోడ్స్ స్ట్రీమింగ్ కాగా.. ఇప్పుడు మూడో ఎపిసోడ్ ప్రోమోను రానా రిలీజ్ చేశాడు. అందులో నాగ చైతన్యతోపాటు రానా వైఫ్ మిహీక, పలువురు రానా ఫ్యామిలీ మెంబర్స్ పాల్గొన్నారు. ఆ ప్రోమోలో రానా మాట్లాడుతూ.. “మా ఫ్యామిలీ అంతా కలిసి సోది వేసుకుంటే ఎలా ఉంటుందో తెలుసా..” అని అన్నాడు. ఆ తర్వాత చైతన్యను పెళ్లి గురించి, పర్సనల్ లైఫ్ ఎలా ఉందంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు.
ఇదే షోలో చైతూ, శోభిత ఫోటోస్ చూపించి వారిద్దరి లవ్ గురించి అడిగినట్లు తెలుస్తోంది. అలాగే ఇదే షోలో రానా భార్య మిహీక సైతం మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఎపిసోడ్ శనివారం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈరోజు రాత్రి జరిగే చైతన్య, శోభిత వివాహ వేడుకకు రానా, వెంకటేశ్ ఫ్యామీలి సైతం హాజరుకానున్నారు.
View this post on Instagram
Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?
Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..
Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.