Naga Chaitanya: చైకి అమ్మగా, ఫ్రెండ్‌గా, లవర్‌గా నటించిన ఏకైక హీరోయిన్.. ఎవరో తెల్సా

|

Oct 11, 2024 | 6:54 PM

జోష్ మూవీతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అక్కినేని నాగచైతన్య.. ఆ తర్వాత 'ఏమాయ చేశావే', 'తడాఖా', 'మనం', 'ప్రేమమ్', 'రారండోయ్ వేడుక చూద్దాం', 'మజిలి', 'బంగార్రాజు' లాంటి సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు.

Naga Chaitanya: చైకి అమ్మగా, ఫ్రెండ్‌గా, లవర్‌గా నటించిన ఏకైక హీరోయిన్.. ఎవరో తెల్సా
Tollywood
Follow us on

జోష్ మూవీతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అక్కినేని నాగచైతన్య.. ఆ తర్వాత ‘ఏమాయ చేశావే’, ‘తడాఖా’, ‘మనం’, ‘ప్రేమమ్’, ‘రారండోయ్ వేడుక చూద్దాం’, ‘మజిలి’, ‘బంగార్రాజు’ లాంటి సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక అక్కినేని నట వారుసుడి ఫ్లాప్స్, హిట్స్ పక్కనపెడితే.. ప్రస్తుతం ‘తండేల్’ మూవీతో బిజీగా ఉన్నాడు చై. ఈ సినిమాను చందూ మొండేటి దర్శకత్వం వహిస్తుండగా.. సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవలే నాగచైతన్య, శోభితా దూళిపాళ్ల ఎంగేజ్‌మెంట్ జరిగిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే.. నాగచైతన్య తన కెరీర్‌లో చాలామంది హీరోయిన్లతో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. అయితే అంతమందిలో ఒకే ఒక్క హీరోయిన్.. చైకి అమ్మగా, ఫ్రెండ్‌గా, లవర్‌‌గా నటించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. మరి ఇంతకీ ఆ హీరోయిన్ మరెవరో కాదు మెగా కోడలు లావణ్య త్రిపాఠి. నాగార్జున హీరోగా వచ్చిన ‘సోగ్గాడే చిన్ని నాయన’ మూవీలో.. ఆయనకు భార్యగా నటించింది లావణ్య. ఇక ఈ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిన ‘బంగార్రాజు’ మూవీలో నాగార్జున కొడుకుగా నాగచైతన్య నటించాడు. అలాగే ‘మనం’ చిత్రంలో చై, లావణ్య ఫ్రెండ్స్‌గా నటించారు. అందులో ఈ బ్యూటీ స్మాల్ రోల్‌లో నటించింది. ఆ తర్వాత వీరిద్దరూ ‘యుద్ధం శరణం’ అనే మూవీలో హీరో, హీరోయిన్లుగా నటించారు. ఇలా నాగచైతన్యకు హీరోయిన్ లావణ్య త్రిపాఠి అమ్మగా, ఫ్రెండ్‌గా, లవర్‌గా నటించి మెప్పించింది.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: ఒక్క సినిమాతో స్టార్‌డమ్.. వ్యభిచార కేసుతో కెరీర్ మటాష్.. ఈ బ్యూటీ ఎవరో తెల్సా

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి