Adah Sharma: ఆదా శర్మ ఇంట్లో తీవ్ర విషాదం.. కన్నీరుమున్నీరవుతోన్న టాలీవుడ్ హీరోయిన్

ఒకప్పుడు తెలుగులో పలు హిట్ సినిమాల్లో నటించిన ఆదా శర్మ ఇప్పుడు బాలీవుడ్ లో సెటిలైంది. హిందీలో వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీ బిజీగా ఉంటోంది. అయితే తాజాగా ఈ స్టార్ హీరోయిన్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.

Adah Sharma: ఆదా శర్మ ఇంట్లో తీవ్ర విషాదం.. కన్నీరుమున్నీరవుతోన్న టాలీవుడ్ హీరోయిన్
Adah Sharma

Updated on: Nov 23, 2025 | 3:21 PM

హార్ట్ అటాక్ హీరోయిన్ ఆదా శర్మ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె అమ్మమ్మ తులసి సుందర్ కొచ్చ కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో నెల రోజుల క్రితం ఆస్పత్రిలో చేరిన ఆమె ఆదివారం (నవంబర్ 23) ఉదయం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఈ ఘటనతో ఆదా శర్మ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో ఆదా శర్మ తన అమ్మమ్మ పుట్టినరోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసింది. సోషల్ మీడియాలో ఇద్దరు కలిసున్న ఓ బ్యూటిఫుల్ వీడియోను కూడా షేర్ చేసింది. అయితే ఇంతలోనే విషాదం చోటు చేసుకుంది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఆదాశర్మ అమ్మమ్మ మృతికి సంతాపం తెలియజేస్తున్నారు. తులసి సందర్ ఆత్మకు శాంతి చేకూరాలని పోస్టులు పెడుతున్నారు.

కాగా పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన హార్ట్ అటాక్ సినిమాతో తెలుగు ఆడియెన్స్ కు పరిచయమైంది ఆదా శర్మ. ఆ తర్వాత క్షణం, గరం, కల్కి, సన్నాఫ్ సత్యమూర్తి, సుబ్రమణ్యం ఫర్ సేల్ తదితర తెలుగు సినిమాల్లో నటించింది. ఒక వైపు హీరోయిన్ గా నటిస్తూనే మరికొన్ని సినిమాల్లో సెకెండ్ హీరోయిన్ గా, సహాయక నటిగానూ మెప్పించింది. ఇక ది కేరళ స్టోరీ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుందీ. అలాగే బస్తర్.. ది నక్సల్ స్టోరీతోనూ పాన్ ఇండియా ఫేమస్ అయిపోయింది. ఇదే క్రమంలో తన సినిమాలతో వరుసగా వివాదాల్లోనూ నిలిచిందీ ముద్దుగుమ్మ.  ఇక చివరిసారిగా తుమ్కో మేరీ కసమ్ చిత్రంలో చివరిగా కనిపించింది ఆదా శర్మ. విక్రమ్ భట్ తెరకెక్కించిన ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, ఇష్వాక్ సింగ్, ఈషా డియోల్ ప్రధాన పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో పలు సినిమాలు, వెబ్ సిరీస్ లు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

అమ్మమ్మతో ఆదా శర్మ..

ఆదా శర్మ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us