Thandel Movie: విడుదలకు ముందే రికార్డ్స్ సృష్టిస్తోన్న తండేల్ మూవీ.. చైతూ, సాయి పల్లవి సినిమాకు..

గతేడాది అమరన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సాయి పల్లవి.. ఇప్పుడు తండేల్ సినిమాతో అడియన్స్ ముందుకు రాబోతుంది. అక్కినేని నాగ చైతన్య హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫిబ్రవరి 7న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అడియన్స్ ముందుకు రానున్న సంగతి తెలిసిందే.

Thandel Movie: విడుదలకు ముందే రికార్డ్స్ సృష్టిస్తోన్న తండేల్ మూవీ.. చైతూ, సాయి పల్లవి సినిమాకు..

Updated on: Feb 05, 2025 | 1:37 PM

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ తండేల్. డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంవ హిస్తున్న ఈ సినిమాలోయువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. అలాగే ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ మరింత హైలెట్. ప్రస్తుతం ఈ సినిమాలోని ప్రతిసాంగ్ యూట్యూబ్ లో దూసుకుపోతున్నాయి. బుజ్జితల్లి, హైలెస్సా పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 7న విడుదల కానుంది. ఈ క్రమంలోనే కొద్దిరోజులుగా తండేల్ మూవీ ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తుంది చిత్రయూనిట్. దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో ఈ మూవీ ప్రమోషన్స్ కార్యక్రమాలు, ఈవెంట్స్ నిర్వహించింది చిత్రయూనిట్.

ఇదిలా ఉంటే.. విడుదలకు ముందే ఈ సినిమా సరికొత్త రికార్డ్ సృష్టించింది. IMDb వెబ్‌సైట్ విడుదల చేసిన సమాచారం ప్రకారం తండేల్ సినిమా ప్రస్తుతం భారతదేశంలోని ప్రజలు ఎక్కువగా ఎదురుచూస్తున్న చిత్రాలలో మొదటి స్థానంలో ఉంది. దీంతో ఈ మూవీపై దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ఎన్ని అంచనాలతో ఎదురుచూస్తున్నారో తెలుస్తోంది. సాయి పల్లవి నటించిన అమరన్ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై ప్రజల నుండి అద్భుతమైన స్పందనను పొందింది. ఈ పరిస్థితిలో ప్రస్తుతం తండేల్ మూవీ భారీ హైప్ మధ్య విడుదలవుతుంది.

చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని డ్రీమ్స్ వారియర్ ప్రొడక్షన్స్ తమిళంలో కూడా విడుదల చేయనుంది. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రంలోని 3 పాటలు ఇప్పటికే విడుదలై ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి.

ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..

Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..

Tollywood: అప్పట్లో లిరిల్ సోప్ యాడ్ గర్ల్.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్.. ఫాలోయింగ్ చూస్తే మైండ్ బ్లాంకే..

Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్‏లోకి వెళ్లిపోయిన