Thandel Movie: లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి భారీ కటౌట్.. టాలీవుడ్ హిస్టరీలోనే ఫస్ట్ టైమ్.. ఎక్కడో తెలుసా?

సాధారణంగా సినిమాలు రిలీజ్ అయినప్పుడు హీరోల కటౌట్స్ పెట్టడం సహజం. ఆ మధ్యన పుష్ప 2 సినిమా రిలీజ్ సమయంలో డైరెక్టర్ సుకుమార్ కటౌట్ కూడా ఏర్పాటు చేశారు. అయితే తెలుగు సినిమా చరిత్రలోనే మొట్ట మొదటిసారిగా ఓ హీరోయిన్ కు కటౌట్ పెట్టారు.

Thandel Movie: లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి భారీ కటౌట్.. టాలీవుడ్ హిస్టరీలోనే ఫస్ట్ టైమ్.. ఎక్కడో తెలుసా?
Sai Pallavi Huge Cut Out

Updated on: Feb 08, 2025 | 11:38 AM

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం తండేల్. లవ్ స్టోరీ వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత మరోసారి జోడీగా కనిపించారు చైతూ, సాయ పల్లవి. చందూ మొండేటి తెరకెక్కించిన తండేల్ సినిమా శుక్రవారం (ఫిబ్రవరి 07) న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షోతోనే ఈ మూవీకి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. నాగ చైతన్య సినిమా కెరీర్ లోనే అత్యధిక ఓపెనింగ్స్ వచ్చాయి. కాగా తండేల్ మూవీ రిలీజ్ సందర్భంగా థియేటర్లలో పండగ వాతావరణం నెలకొంది. నాగ చైతన్య కటౌట్స్, పోస్టర్లతో థియేటర్లను అందంగా అలంకరించారు. అయితే ఇదే సమయంలో టాలీవుడ్ చరిత్రలోనే ఏ హీరోయిన్ కి దక్కని గౌరవం తండేల్ బ్యూటీ సాయి పల్లవికి దక్కింది. అదేంటంటే.. తండేల్ రిలీజ్ సందర్భంగా సాయి పల్లవి కటౌట్ ను కూడా ఏర్పాటు చేశారు ఆమె అభిమానులు. 2024 జూన్ లో ఈ బ్యూటీ సినిమా షూటింగ్ కోసం వైజాగ్ వెళ్ళింది. అప్పటి నుంచి అక్కడి ఫ్యాన్స్ ఇలా ప్లాన్ చేసి ఫైనల్ గా వైజాగ్‌లోని సంగం థియేటర్ వద్ద సాయిపల్లవి భారీ కటౌట్ ను ఏర్పాటు చేశారు. ఓ హీరోయిన్ కు ఇలా కటౌట్ పెట్టడం తెలుగు సినీ ఇండస్ట్రీలోనే ఇదే తొలిసారి. గతంలో ఏ హీరోయిన్ కు ఇలాంటి గౌరవం దక్కలేదు.

సాయి పల్లవి కటౌట్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. ‘లేడీ పవర్ స్టార్’, ‘బాక్సాఫీస్ క్వీన్’అన్న మాటలను సాయి పల్లవి మరోసారి నిజం చేసింది’ అంటూ అభిమానులు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.
గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్, బన్నీ వాస్, సంయుక్తంగా తండేల్ సినిమాను నిర్మించారు. నాగ చైతన్య, సాయి పల్లవిలతో పాటు కరుణాకరణ్, ప్రకాశ్ బెలావాడి, దివ్య పిళ్లై, పృథ్వీ, కళ్యాణీ నటరాజన్, కల్పలత తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు.

ఇవి కూడా చదవండి

సాయి పల్లవి కటౌట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.