Thalapathy Vijay: దళపతి సినిమాకు కొత్త కష్టం.. విజయ్ దెబ్బకు బిత్తరపోతున్న నిర్మాతలు
ప్రస్తుతం 'గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' (GOAT) చిత్రంలో నటిస్తున్నాడు విజయ్. ఈ సినిమా షూటింగ్ విదేశాల్లో జరుగుతోంది. అయితే సినిమాలనుంచి తప్పుకునే ముందు తన అభిమానులకు రెండు సినిమాలను కానుకగా ఇవ్వాలనుకుంటున్నాడు. కానీ, ఇప్పుడు ఆయన చివరి సినిమా చిక్కుల్లో పడిందని తెలుస్తోంది. దాంతో విజయ సినిమా పై సస్పెన్స్ నెలకొంది.

తమిళ్ స్టార్ హీరో విజయ్ ఇటు సినిమాలతో పాటు అటు రాజకీయాల్లోనూ బిజీగా గడుపుతున్నారు. ఇటీవలే ఆయన ఓ కొత్త పార్టీని అనౌన్స్ చేశారు. అయితే విజయ్ సినిమాలకు ఇక గుడ్ బై చెప్పనున్నారని.. పూర్తిగా సినిమాల పైనే ఆయన దృష్టి పెట్టనున్నాడని కోలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ (GOAT) చిత్రంలో నటిస్తున్నాడు విజయ్. ఈ సినిమా షూటింగ్ విదేశాల్లో జరుగుతోంది. అయితే సినిమాలనుంచి తప్పుకునే ముందు తన అభిమానులకు రెండు సినిమాలను కానుకగా ఇవ్వాలనుకుంటున్నాడు. కానీ, ఇప్పుడు ఆయన చివరి సినిమా చిక్కుల్లో పడిందని తెలుస్తోంది. దాంతో విజయ సినిమా పై సస్పెన్స్ నెలకొంది.
విజయ్ నటించనున్న రెండు చిత్రాలలో మొదటిది ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’. ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. సెప్టెంబర్ 5న సినిమా విడుదల చేయాలనీ సన్నాహాలు చేస్తున్నారు. అలాగే విజయ్ రెండో చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్‌కి ‘దళపతి 69’ అని పేరు పెట్టారు. ఈ చిత్రానికి అట్లీ దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది. ఇదే ఆయన చివరి సినిమా అని అంటున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా అనుకోని చిక్కుల్లో పడిందని తెలుస్తోంది. ఈ సినిమాకు ఇప్పుడు నిర్మాత దొరకడం లేదు అని తెలుస్తోంది.
విజయ్ 69వ చిత్రాన్ని ‘ఆర్‌ఆర్‌ఆర్’ నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తారని గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆయన వెనక్కి తగ్గారు. భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించడంలో దానయ్య దిట్ట. అయితే విజయ్ సినిమాను నిర్మించేందుకు ఆయన ఆసక్తి చూపడం లేదు. దీనికి విజయ్ రెమ్యునరేషనే కారణమని అంటున్నారు. ప్రస్తుతం విజయ్ ఒక్కో సినిమాకు 200 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. కానీ, అప్పుడు అతను 250 కోట్ల రూపాయల వరకు డిమాండ్ చేస్తున్నారట. ఇంత భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టేందుకు నిర్మాతలు సిద్ధంగా లేరని తెలుస్తోంది. ప్రస్తుతం సౌత్ ఇండియాలో దీనిపై చర్చ జరుగుతోంది. మరి విజయ్ తన పారితోషికాన్ని తగ్గించుకుంటాడా లేదా అన్నది చూడాలి. పూర్తిగా రాజకీయాలకే అంకితం కావాలని విజయ్ భావిస్తున్నాడు. 2026లో తమిళనాడు రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి పెట్టనున్నాడు విజయ్. తాను స్థాపించిన పార్టీకి ‘తమిళగ వెట్రి కళగం’ అని పేరు పెట్టారు విజయ్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




