Thalapathy Vijay: ది గోట్ మూవీలో హీరో విజయ్ కారు నంబర్‌ను గమనించారా? సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా..

|

Sep 14, 2024 | 9:47 PM

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ సినిమా దిగోట్ ('గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్'). సెప్టెంబర్ 5న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళుతోంది. తమిళంలో ఇప్పటికే రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన విజయ్ సినిమా తెలుగులోనూ మోస్తరుగా వసూళ్లు రాబడుతోంది. దీనిని కొనసాగిస్తూ మరో కొత్త సినిమా కూడా ప్రకటించారు దళపతి విజయ్

Thalapathy Vijay: ది గోట్ మూవీలో హీరో విజయ్ కారు నంబర్‌ను గమనించారా? సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా..
Thalapathy Vijay
Follow us on

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ సినిమా దిగోట్ (‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’). సెప్టెంబర్ 5న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళుతోంది. తమిళంలో ఇప్పటికే రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన విజయ్ సినిమా తెలుగులోనూ మోస్తరుగా వసూళ్లు రాబడుతోంది. దీనిని కొనసాగిస్తూ మరో కొత్త సినిమా కూడా ప్రకటించారు దళపతి విజయ్. బహుశా ఇదే అతనికి చివరి సినిమా అవుతుంది. ఆ తర్వాత విజయ్ రాజకీయాల్లోకి బిజీ అవ్వనున్నారు.2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ది గోట్ సినిమాలో దళపతి విజయ్ కారు నంబర్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అదేంటంటే.. ఈ చిత్రంలో విజయ్ నడిపే కార్ నెంబర్ ‘TN CM 2026’ అని చూపించారు. అంటే 2026 లో జరిగే ఎన్నికల్లో తమిళ నాడు సీఎం గా విజయ్అన్నట్లు దిగోట్ సినిమాలో ముందే చూపించారు. అయితే ఇది ది గోట్ మూవీ డైరెక్టర్ వెంకట్ ప్రభుది అని తెలుస్తోంది. ఆయనకు ఇష్టమైన క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని. ఈ కారణంగానే 07 తీసుకున్నాడని అంటున్నారు. ఇక CM 2026 నంబర్ వెనకనున్న మిస్టరీ మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.

2026లో తమిళనాడులో ఎన్నికలు జరుగుతున్నాయి. ఆయన తమిళగ వెట్రి కళగం పేరుతో పార్టీని ప్రారంభించారు. దీంతో ఆయన రాజకీయాల్లో బిజీ కానున్నారు. ఈ కారణంగానే వెంకట్ ప్రభు ‘CM 2026’ నంబర్ ప్లేట్‌ని ఎంచుకున్నట్లు చెబుతున్నారు. విజయ్ తమిళనాడు సీఎం కావాలనేది వెంకట్ ప్రభు కల. దళపతి విజయ్, వెంకట్ ప్రభు కలిసి ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ సినిమాలో పనిచేశారు. కాగా దళపతి విజయ్ కు అశేషమైన అభిమానులు ఉన్నారు. అందుకు అనుగుణంగానే క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టిన దళపతి విజయ్ ‘తమిళగ వెట్రి కళగం’ పార్టీ స్థాపించారు. ఇటీవల పార్టీకి సంబంధించిన జెండాను కూడా ఆవిష్కరించారు. ఇక రాజకీయాల కోసం భవిష్యత్‌లో సినిమాలకు స్వస్తి చెప్పడానికి కూడా సిద్ధం అయ్యాడీ స్టార్ హీరో. వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే మరికొన్ని రోజుల్లో తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా విజయ్ పాదయాత్ర చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇవి కూడా చదవండి

టార్చ్ బేరర్ లా విజయ్ ఆఖరి సినిమా..

ఎన్నికలకు ముందు రిలీజయ్యేలా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.