Tollywood: విడాకులు తీసుకున్న తెలుగు నటీనటులు, సీని ప్రముఖులు వీరే..

వివాహం కలకాలం నిలవాలంటే కొంత రాజీపడటం, కొద్దిగా సర్దుకుపోవడం, కొన్ని త్యాగాలు చేయడం తప్పనిసరి. అయితే దాని కోసం మానసిక, శారీరక ఆరోగ్యాన్ని పణంగా పెట్టాల్సిన అవసరం లేదు. పరస్పర గౌరవం, అర్థం చేసుకోవడం, ప్రైవసీకి ప్రాధాన్యత ఉన్నప్పుడే వైవాహిక బంధం పటిష్ఠంగా సాగుతుంది.

Tollywood: విడాకులు తీసుకున్న తెలుగు నటీనటులు, సీని ప్రముఖులు వీరే..
Celebrities who got divorced
Follow us

|

Updated on: Nov 10, 2022 | 8:54 AM

సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు..! ఎప్పుడు ఎవరు ఒక్కటి అవుతారు.. ఎప్పుడెవరు విడిపోతారో చెప్పలేం..! ప్రేమలు, పెళ్లిళ్లు, బ్రేకప్పులు సినీ ఇండస్ట్రీలో సర్వసాధారణం.!. పెళ్లంటే మూడు ముళ్లు, ఏడడుగులు, కలిసికట్టుగా నూరేళ్ల జీవితం. కాని చాలా జంటల మధ్య సఖ్యత లోపించి మూడు ముళ్ల బంధం మూన్నాళ్ల ముచ్చటగా మారుతోంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్లు కూడా కొన్నాళ్లకు విడిపోతున్న పరిస్థితి. దేశంలో విడాకులు తీసుకుంటున్న వారి సంఖ్య ఎంతో ఉన్నా సెలబ్రిటీలు విడాకులు తీసుకుంటున్నారంటే అది టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌ అవుతుంది.

టాలీవుడ్‌లో విడాకులు తీసుకున్న జంటలు

  •  నాగార్జున:  దగ్గుబాటి రామానాయుడు కూతురు లక్ష్మీని 1984లో పెళ్లి చేసుకొన్నాడు హీరో నాగార్జున. నాగచైతన్య పుట్టాక వారు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 1992లో నటి అమలను పెళ్లి చేసుకున్నాడు. అఖిల్ వారి పిల్లోడే.
  •  పవన్ కళ్యాణ్:  ముచ్చటగా మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు పవన్ కల్యాణ్. మొదట పెళ్లి వైజాగ్ కు చెందిన నందినితో జరిగినా 2008లో విడాకులిచ్చాడు. ఆ తర్వాత హీరోయిన్ ‘రేణు దేశాయ్’ ని రెండో పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలు పుట్టాక 2012లో వీడ్కోలు పలికాడు. 2013లో రష్యాకు చెందిన నటి.. ‘అన్నా లెజ్నావెని’ పెళ్లి చేసుకున్న పవన్ ఇప్పుడు ఆమెతోనే ఉంటున్నాడు.
  • శరత్ బాబు:   సీనియర్ నటుడు శరత్ బాబు 1981లో తోటి నటి రమాప్రభను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఆమెకు విడాకులు ఇచ్చి స్నేహా నంబియార్‌ను 1990లో పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం స్నేహకు సైతం శరత్‌ బాబు విడాకులిచ్చారు.’
  • కమల్ హాసన్ :  1978లో ప్రముఖ నాట్య కళాకారిణి వాణి గణపతిని పెళ్లి చేసుకున్నారు కమల్. ఆ తర్వాత ఆమెకు విడాకులిచ్చారు. 1988లో సారికను రెండో వివాహం చేసుకున్నారు. శృతిహాసన్, అక్షర హాసన్ లు వారికి పుట్టిన సంతానమే. 2004లో కమల్, సారికలు విడిపోయారు. ఆ తర్వాత నటి గౌతమితో 13 ఏళ్లు సహజీవనం చేశారు కమల్. ఇప్పుడు గౌతమి విడిగానే ఉంటోంది.
  • రాధిక శరత్ కుమార్ :  ప్రముఖ సినీనటి రాధిక 1985లో ప్రతాప్ పోతన్‌ను పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత పోతనకు విడాకులిచ్చారు రాధిక. రెండో సారి లండన్‌కు చెందిన రిచర్డ్ హ్యార్లీని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత 2001లో హీరో శరత్ కుమార్‌తో ప్రేమలో పడి మరో పెళ్లి చేసుకున్నారు.
  •  ప్రకాశ్ రాజ్ :  నటుడు ప్రకాశ్ రాజ్ తొలుత లలితా కుమారిని పెళ్లి చేసుకొన్నవాడు. 2009లో ఈ జంట విడిపోయింది. 2010లో ప్రముఖ కొరియోగ్రాఫర్ సోనీ వర్మని పెళ్లి చేసుకున్నారు ప్రకాశ్‌ రాజ్‌
  • ప్రకాష్ కోవెలమూడి : దర్శకుడు రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాష్ కోవెలమూడి 2014లో కనిక దిల్లాన్ అనే అమ్మాయిని లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఆమె సినీ రచయిత్రి. వీళ్లద్దరూ కలిసి పలు సినిమాలు చేశారు. మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత కనిక రెండో పెళ్లి చేసుకున్నారు.
  •  కీర్తిరెడ్డి- సుమంత్ : 2004లో కీర్తిరెడ్డిని పెళ్లి చేసుకున్నాడు హీరో సుమంత్. 2006లో వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 2014లో లండన్ లో సెటిలైన డాక్టర్ కార్తీక్ ను వివాహం చేసుకుంది కీర్తిరెడ్డి. వీరికి ఇద్దరు పిల్లలు.
  •  సునీత: ప్రముఖ గాయని సునీతకు తొలిగా కిరణ్ తో వివాహమైంది. వారికి కూతురు శ్రేయ, ఆకాష్ అనే పిల్లున్నారు. భర్తకు విడాకులిచ్చిన సునీత 2021లో మ్యాంగో మీడియా అధినేత రామ్ వీరపనేనితో తాళి కట్టించుకున్నారు.
  •  మంచు మనోజ్ కుమార్, ప్రణీత :  నటుడు మంచు మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్. తన భార్య ప్రణతి రెడ్డికి విడాకులు ఇచ్చాడు. పెళ్లై చేసుకున్న మూడేళ్లు కూడా కాకుండానే భార్యాభర్తలు విడిపోయారు.
  • ఝాన్సీ, జోగినాయుడు : అందరికి తెలిసిన నటి, యాంకర్ ఝాన్సీ మొదట జోగి నాయుడిని వివాహం చేసుకున్నారు. వీరికి ఒక బిడ్డ. అతనితో విడాకులు తీసుకున్నారు ఝాన్సీ.
  • నాగచైతన్య, సమంత :  ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న సామ్-చైతూ కూడా వివాహ బంధానికి ముగింపు పలికిన విషయం తెలిసిందే. మనస్పర్థలు రావడంతో తాము విడిపోతున్నట్లు వీరు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.
  • సుప్రియ యార్లగడ్డ : ఈమె అక్కినేని నాగార్జున మేనకోడలు. నటిగా.. నిర్మాతగా ప్రస్తుతం సినీ పరిశ్రమలో రాణిస్తున్నారు. ఈమె ఇష్టం సినిమా హీరో చరణ్ రెడ్డిని లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఆ తర్వాత మనస్పర్థల కారణంగా దూరంగా ఉన్నారు. కాగా ఆ తర్వాతి కాలంలో చరణ్ రెడ్డి గుండెపోటుతో క్రితం చనిపోయాడు.

సంక్లిష్టమైన వ్యవస్థలోకి నేటి ప్రపంచం వచ్చేసింది. ఎవరికి వారు సొంతంగా బతకగలిగిన పరిస్థితుల్లోకి మనం ప్రవేశించడం వల్ల విడాకుల సంఖ్య పెరగడం సహజమే. సెలబ్రిటీలు అయినా, సామాన్యులైనా కలిసి ఉన్నా, విడిగా ఉన్నా ఆనందంగా ఉండటమన్నది చాలా ముఖ్యం.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఫిన్ లాండ్ ప్రజలు అంత హ్యాపీ ఎందుకబ్బా.. కారణాలు ఇవే..
ఫిన్ లాండ్ ప్రజలు అంత హ్యాపీ ఎందుకబ్బా.. కారణాలు ఇవే..
శ్రీశైలం భక్తులకు అలర్ట్.. ఆ పూజలను రద్దు చేసిన దేవస్థానం
శ్రీశైలం భక్తులకు అలర్ట్.. ఆ పూజలను రద్దు చేసిన దేవస్థానం
ట్రైన్ ఏసీ భోగీలో ఏదో వింత వాసన.. ఓ ప్రయాణీకుడి బ్యాగ్ చెక్ చేయగా
ట్రైన్ ఏసీ భోగీలో ఏదో వింత వాసన.. ఓ ప్రయాణీకుడి బ్యాగ్ చెక్ చేయగా
ఆ స్టాక్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు..
ఆ స్టాక్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు..
మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో కొలువు దీరిన అల్లు అర్జున్ విగ్రహం
మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో కొలువు దీరిన అల్లు అర్జున్ విగ్రహం
నిర్మాతగా మారనున్న సందీప్ రెడ్డి వంగ.. వారితో కొత్త సినిమా
నిర్మాతగా మారనున్న సందీప్ రెడ్డి వంగ.. వారితో కొత్త సినిమా
ఫోన్‌ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం.. అదుపులో మరో ఇద్దరు
ఫోన్‌ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం.. అదుపులో మరో ఇద్దరు
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు చుక్కెదురు.. ఈడీ కస్టడీ పొడిగింపు..
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు చుక్కెదురు.. ఈడీ కస్టడీ పొడిగింపు..
నంద్యాలలో వైఎస్ జగన్ బహిరంగ సభ.. లైవ్ వీడియో
నంద్యాలలో వైఎస్ జగన్ బహిరంగ సభ.. లైవ్ వీడియో
ఎస్‌బీఐ డెబిట్ కార్డుదారులకు షాక్..నయా రూల్స్‌తో చార్జీల బాదుడు
ఎస్‌బీఐ డెబిట్ కార్డుదారులకు షాక్..నయా రూల్స్‌తో చార్జీల బాదుడు