RGV Vyooham: సస్పెన్స్‌లో ఆర్జీవీ వ్యూహం.. సినిమా రిలీజ్‌కు అనుమతి లభించేనా..?
ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో వ్యూహం ట్రైలర్ రిలీజ్ సందర్భంగా ఆర్జీవీ తనకు జగన్ అంటే ఇష్టమని.. చంద్రబాబు, పవన్ ఏ మాత్రం ఇష్టం లేదన్నారని తన పిటిషన్‌లో పేర్కొన్నారు లోకేష్. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఆఫీస్, రివైజింగ్ కమిటీ, రామధూత క్రియేషన్స్, నిర్మాత దాసరి కిరణ్, రామ్‌గోపాల్ వర్మను పిటిషన్‌లో ప్రతివాదులుగా చేరుస్తూ లోకేశ్ పిటిషన్ దాఖలు చేశారు.

వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన వ్యూహం సినిమాకు ఇచ్చిన సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేయాలని లోకేశ్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో వ్యూహం ట్రైలర్ రిలీజ్ సందర్భంగా ఆర్జీవీ తనకు జగన్ అంటే ఇష్టమని.. చంద్రబాబు, పవన్ ఏ మాత్రం ఇష్టం లేదన్నారని తన పిటిషన్‌లో పేర్కొన్నారు లోకేష్. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఆఫీస్, రివైజింగ్ కమిటీ, రామధూత క్రియేషన్స్, నిర్మాత దాసరి కిరణ్, రామ్‌గోపాల్ వర్మను పిటిషన్‌లో ప్రతివాదులుగా చేరుస్తూ లోకేశ్ పిటిషన్ దాఖలు చేశారు.
వ్యూహం చిత్రంలో రాజకీయాలకు సంబంధించిన పాత్రలను పెట్టారని.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లను కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయని వాదనలు వినిపించారు లోకేష్ తరవు న్యాయవాది. టీడీపీ, జనసేన, కాంగ్రెస్ నాయకులను డీ ఫేం చేసేలా సినిమా తీశారని.. ఏపీ సీఎంకు అనుకూలంగా చిత్రాన్ని రూపొందించారన్నారు. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికెట్ ను రద్దు చెయ్యాలని హైకోర్టును కోరారు.
కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ కు పాల్పడి చంద్రబాబుకు కిక్ బ్యాక్స్ వచ్చాయని చూపించారన్నారు. సోనియా, మన్మోహన్, రోశయ్య పాత్రలను నెగెటివ్‌గా చూపించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సెన్సార్ బోర్డుకి కూడా దీనిపై ఫిర్యాదు చేశామన్నారు లోకేష్. అయితే నిబంధనలకు అనుగుణంగా అన్నీ పరిశీలించాకే వ్యూహం సినిమాకు సర్టిఫికెట్ జారీ చేశామని వాదించారు సెన్సార్ బోర్డ్ తరపు న్యాయవాది. సినిమాను ముందుగా ఐదుగురు సభ్యులతో కూడిన ఎగ్జామింగ్ కమిటి.. ఆ తర్వాత చైర్మన్ పరిశీలించారన్నారు. అనంతరం రివిజన్ కమిటీలో ఉండే 9మంది అభిప్రాయాలను వ్యక్తిగతంగా రికార్డ్ చేశాకే సినిమాకు సర్టిఫికెట్ జారీ చేశామని కోర్టుకు వాదనలు వినిపించారు. అయితే సీల్డ్ కవర్‌లో వ్యూహం రికార్డ్స్ సమర్పించడాన్ని హైకోర్ట్ అభ్యంతరం వ్యక్తం చేసింది. తాము సీల్డ్ కవర్‌లో రికార్డ్ అడగలేదని స్పష్టం చేసింది.
ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం విచారణను బుధవారానికి వాయిదా వేసింది. అయితే హైకోర్ట్ ఎలాంటి ఆదేశాలు ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది.వ్యూహం సినిమాకు ఇచ్చిన సెన్సార్ సర్టిఫికెట్‌ను రద్దు చేయాలన్న నారా లోకేష్ పిటిషన్‌ను నిన్న కూడా విచారణ జరిపింది.. తెలంగాణ హైకోర్ట్. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం విచారణను నేటికి వాయిదా వేసింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి