Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RGV - VYooham: వాళ్లందరూ సినిమా చూశాకే నిర్ణయం.. RGV వ్యూహానికి బ్రేక్.

RGV – VYooham: వాళ్లందరూ సినిమా చూశాకే నిర్ణయం.. RGV వ్యూహానికి బ్రేక్.

Anil kumar poka

|

Updated on: Jan 10, 2024 | 10:21 AM

రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న వ్యూహం సినిమా పై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది.. ఈ సినిమాపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ టిడిపి జనరల్ సెక్రెటరీ నారా లోకేష్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ని విచారించిన తెలంగాణ హైకోర్టు మొదట ఈ సినిమాపై ఈనెల 11 వ తారీకు వరకు స్టే విధించింది. తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వ్యూహం చిత్ర యూనిట్ డివిజన్ బెంచ్ లో అప్పీల్ కు వెళ్ళింది.

రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న వ్యూహం సినిమా పై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది.. ఈ సినిమాపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ టిడిపి జనరల్ సెక్రెటరీ నారా లోకేష్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ని విచారించిన తెలంగాణ హైకోర్టు మొదట ఈ సినిమాపై ఈనెల 11 వ తారీకు వరకు స్టే విధించింది. తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వ్యూహం చిత్ర యూనిట్ డివిజన్ బెంచ్ లో అప్పీల్ కు వెళ్ళింది. దీంతో ఈ సినిమా విడుదలపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని సింగల్ బెంచ్ ను ఆదేశించింది తెలంగాణ హైకోర్టు. సినిమాకు సంబంధించిన రికార్డ్స్ అన్నిటిని సింగల్ బెంచ్ ముందు ఉంచారు సెన్సార్ బోర్డు సభ్యులు. అయితే వాదనలో భాగంగా సెన్సార్ బోర్డు రివ్యూ కమిటీ ముందు సినిమా ప్రదర్శించిన తర్వాత రివ్యూ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ను పరిగణలోకి తీసుకోకుండా సెన్సార్ బోర్డ్ చిత్రానికి సర్టిఫికెట్ జారీచేయడాన్ని టిడిపి తప్పుపడుతూ పిటిషన్ దాఖలు చేసింది.

అయితే సెన్సార్ బోర్డు సభ్యులు మినహా ఈ చిత్రాన్ని మిగతా ఎవరూ కూడా చూడలేదు కాబట్టి ఒక కమిటీని ఏర్పాటు చేసేందుకు హైకోర్టు నిర్ణయించుకుంది. గతంలో ముంబైలో ఒక సినిమా వివాదంలో ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు బాంబే హైకోర్టు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసిందని హైకోర్టు గుర్తు చేసింది. ఆ కమిటీలో ఒక రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి తో పాటు ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జ్ సినిమా ఇండస్ట్రీ నుండి ఒక వెటరన్ యాక్టర్ ను కమిటీ సభ్యులుగా నియమిస్తూ వారి ముందు చిత్రాన్ని ప్రదర్శించింది.. ఇప్పుడు వ్యూహం సినిమాలోనూ అలాంటి ఒక కమిటీని ఏర్పాటు చేసింది హైకోర్టు. హైకోర్టు నిర్మించిన కమిటీలో సభ్యులుగా ఉన్నవారు జనవరి12 లోపు సినిమాను చూసి అదే రోజు హైకోర్టుకు నివేదిక సమర్పించాల్సిందిగా ఆదేశించింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos