Mirai Movie: మిరాయ్‌లో మరో స్టార్ హీరో! స్వయంగా వెల్లడించిన తేజ సజ్జా.. ఫ్యాన్స్‌కు పండగే

హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు తేజ సజ్జా. ఇప్పుడు మిరాయ్ అంటూ మరో పాన్ ఇండియా మూవీతో మన ముందుకు వస్తున్నాడు. ఇందులో మంచు మనోజ్ విలన్ గా నటిస్తున్నాడు. అయితే ఇదే సినిమాలో మరో స్టార్ హీరో కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది.

Mirai Movie: మిరాయ్‌లో మరో స్టార్ హీరో! స్వయంగా వెల్లడించిన తేజ సజ్జా.. ఫ్యాన్స్‌కు పండగే
Mirai Movie

Updated on: Sep 11, 2025 | 10:20 PM

హనుమాన్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత తేజ సజ్జా గ్యాప్ తీసుకుని మరీ నటించిన సినిమా మిరాయ్. రవితేజ ఈగల్ సినిమాతో ఆకట్టుకున్న కార్తీక్ ఘట్టమనేని ఈ ఫాంటసీ యాక్షన్ ఎంటర్ టైనర్ ను తెరకెక్కించారు. రుతిక ఇందులో హీరోయిన్ గా నటిస్తుండగా, మంచు మనోజ్ ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. అలాగే ఒకప్పటి టాలీవుడ్ అందాల తార శ్రియా శరణ్ ఈ సినిమాలో మరో కీలక పాత్ర పోషించింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్స్, గ్లింప్స్ ట్రైలర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దీంతో మిరాయ్ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే శుక్రవారం (సెప్టెంబర్ 12)న ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున మిరాయ్ సినిమా రిలీజవుతోంది. అయితే మరొకొన్ని గంటల్లో మిరాయ్ సినిమా రిలీజ్ కానుండగా హీరో తేజ సజ్జా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. ‘ ఇంకొన్ని గంటల్లో మిరాయి సినిమా మీ ముందుకు వస్తుంది. రెబల్ స్టార్ ప్రభాస్ గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఆయన ఈ సినిమాను మరింత స్పెషల్ చేశారు. మీరు మాత్రం రెబలియస్ సర్ప్రైజ్ ను మొదటి నుంచి మిస్ అవ్వొద్దు’ అని రాసుకొచ్చారు.

ప్రస్తుతం తేజ సజ్జా ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. మొత్తానికి మిరాయ్ సినిమాలో ప్రభాస్ రోల్ ఉండనుందని ఈ ట్వీట్ తో అర్థమైంది. అయితే డార్లింగ్ సినిమాలో స్పెషల్ రోల్ లో కనిపించనున్నాడా? లేదా వాయిస్ ఓవర్ ఇవ్వనున్నాడా? అన్నది తెలియాలంటే రేపటి దాకా ఆగాల్సిందే. మిరాయ్ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. ప్రస్తుతం ఇదే బ్యానర్ లో ప్రభాస్ ది రాజా సాబ్ సినిమా కూడా తెరకెక్కుతోంది. కాబట్టి మిరాయ్ లో ప్రభాస్ స్పెషల్ రోల్ ఉండనున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

తేజ సజ్జా ట్వీట్ ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.