Actor : నాగార్జున బాటలో మరో సూపర్ స్టార్.. ఈసారి విలన్‌గా రెడీ అయిన ఆ హీరో..
నిలుచున్న చోటే నిలబడి ఎన్ని ఫీట్లు చేసినా ఎగ్జయిటింగ్‌గా అనిపించలేదనుకోండి.. జస్ట్ ఓ అడుగు పక్కకి జరగాలి. అది కూడా కచ్చితంగా పండి తీరుతుందనే నమ్మకం కుదిరినప్పుడు. మన హీరోలకు అలాంటి నమ్మకాన్ని కలిగిస్తున్నారు కొందరు కెప్టెన్లు. ఇంతకీ ఎవరు వారు? ఏమిటా కథ... చూసేద్దాం పదండి...

మా వరకైతే వార్2లో ఇద్దరూ హీరోలే… సినిమా చూశాక ఎవరు హీరోనో.. ఎవరు విలనో మీరే డిసైడ్ చేయండి అంటూ రిలీజ్‌కి ముందు ఓపెన్‌గా అనౌన్స్ చేశారు మేకర్స్. అయితే, సినిమాకి కొబ్బరికాయ కొట్టినప్పటి నుంచే తారక్ విలన్ రోల్ చేస్తున్నారనే ప్రచారం సాగింది. విలన్ రోల్ విషయంలో తారక్‌తో పాటు ట్రెండ్ అయ్యారు అక్కినేని నాగార్జున. సూపర్ స్టార్ రజనీకాంత్‌కి విలన్ నాగ్ అని ఫిక్సయ్యారు లోకేష్ కనగరాజ్. అందుకే నాగ్ ఎన్ని నెరేషన్లు అడిగినా ఓపిగ్గా చెప్పి… ఒప్పించుకున్నారు. దానికి తగ్గట్టే నాగ్ కేరక్టర్‌కి కూడా మంచి పేరు వచ్చింది. ఇప్పుడు అలాంటి ప్రయత్నమే చేయడానికి రెడీ అవుతున్నారట మరో సీనియర్ హీరో మోహన్‌లాల్.
ఇవి కూడా చదవండి : Serial Actres: 16 ఏళ్లకే ఆడిషన్.. ఆపై బీ గ్రేడ్ సినిమాలు.. ఈ సీరియల్ హీరోయిన్ కష్టాలు చూస్తే..
అయితే లాల్ ఒప్పుకున్నది మరో హీరో సినిమాలో విలన్ రోల్‌కి కాదు.. దోశ కింగ్ బయోపిక్‌లో నటించడానికి శరవణభవన్ యజమానిగా కనిపించనున్నారట మోహన్‌లాల్. ఆయన లైఫ్‌లో ఉన్న గ్రే షేడ్స్ పోట్రే చేయడానికి ఓకే చెప్పారని న్యూస్. ఆల్రెడీ కల్కిలో కమల్‌హాసన్ ఎలాగూ విలన్ రోల్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి : Actress: తస్సాదియ్యా.. క్రేజీ ఫోటోలతో గత్తరలేపుతున్న యాంకరమ్మ.. ఈ ముద్దుగుమ్మను గుర్తుపట్టరా.. ?
లోకేష్ ప్లానింగ్‌లో ఉన్న రజనీ – కమల్ సినిమాలోనూ.. కమల్‌కి గ్రేషేడ్ ఉంటుందనే టాక్ స్ప్రెడ్ అవుతోంది. మమ్ముట్టిని కూడా అతి త్వరలోనే విలన్ కేరక్టర్‌లో చూడబోతున్నామన్నది మలబార్ న్యూస్. ఇటీవల కోలుకున్న మమ్ముట్టి ఇప్పుడు నటిస్తున్న కలంకావల్‌లో నెగటివ్ రోల్ చేస్తున్నారన్నది వైరల్ న్యూస్.
ఇవి కూడా చదవండి : Tollywood : ఒకరు తోపు డైరెక్టర్.. ఇంకొకరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్.. ఈ ఇద్దరి టాలెంట్‌కు ప్రపంచమే జై కొట్టింది..




