Bheemla Nayak: పవన్ కళ్యాణ్-రానాకు మించి రాజకీయ నాయకుల డైలాగులు..
ఏపీ పాలిటిక్స్‌లో మరో రచ్చ.! టీడీపీ- వైసీపీ మధ్య మళ్లీ మాటల యుద్ధం. ఈసారి టాఫిక్ భీమ్లానాయక్.! అటు థియేటర్లలో పవన్ కళ్యాణ్-రానా మధ్య డైలాగులు పేలుతున్నాయి.
Bheemla Nayak: ఏపీ పాలిటిక్స్‌లో మరో రచ్చ.! టీడీపీ- వైసీపీ మధ్య మళ్లీ మాటల యుద్ధం. ఈసారి టాపిక్ భీమ్లానాయక్.! అటు థియేటర్లలో పవన్ కళ్యాణ్-రానా మధ్య డైలాగులు పేలుతున్నాయి. ఇటు పొలిటికల్ సర్కిల్స్‌లో కూడా అదే రేంజ్‌లో కౌంటర్లు పడుతున్నాయి. పవన్ సినిమాపై ప్రభుత్వం కావాలనే కక్షసాధిస్తోందని ఆరోపిస్తున్నాయి టీడీపీ, జనసేన. అందుకే టికెట్ రేట్లను సవరిస్తూ.. ఇవ్వాల్సిన జీవోను ఆలస్యం చేస్తోందని ఆరోపిస్తున్నాయి. పవన్‌ను టార్గెట్ చేయాలన్న ఉద్దేశంతో.. ఇండస్ట్రీని నాశనం చేస్తున్నారన్నది వాళ్ల వర్షన్. పవన్‌ను సినిమాను తొక్కేయడమా.. అసలు ఆ అవసరం ప్రభుత్వానికి ఏంటి అన్నది మంత్రుల వర్షన్.
భీమ్లా నాయక్ సినిమా పై టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు..చివరికి వినోదం పంచే సినిమా రంగాన్ని కూడా జగన్ తీవ్రంగా వేధిస్తున్నాడని ఆరోపించారు. భీమ్లానాయక్ సినిమా విషయంలో జగన్ వ్యవహరిస్తున్న తీరు ఉగ్రవాదాన్ని తలపిస్తోందని విమర్శించారు. ఈవేధింపులను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. లోకేష్ కూడా ఇదే ఇష్యూపై ట్వీట్ చేశారు. ప్రభుత్వం కక్ష సాధిస్తోందన్న టీడీపీ ఆరోపణలకు స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చారు మంత్రులు. పవన్ సినిమాను తొక్కేయాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదన్నారు మంత్రి పేర్నినాని. ఆడియో లాంచ్‌ను పోస్ట్‌పోన్ చేసుకున్నవాళ్లు..సినిమాని ఎందుకు వాయిదా వేసుకోలేదని ప్రశ్నించారు. ప్రభుత్వం జీవో ఇచ్చే వరకు ఆగలేని వాళ్లు..ప్రస్తుతం ఉన్నరేట్ల ప్రకారమే టికెట్లు అమ్మలి కదా అని నిలదీశారు..
పవన్ సినిమాపై పులకించిపోతున్న లోకేష్.. జూనియర్ ఎన్టీఆర్ సినిమా వచ్చినప్పుడు ఎప్పుడైనా మాట్లాడారా.? అని సూటిగా ప్రశ్నించారు మంత్రిపేర్నినాని. అఖండ మూవీ రిలీజ్ టైమ్‌లో బాలకృష్ణ, సీఎం జగన్ అపాయింట్‌మెంట్ కావాలని అడిగారన్నారు మంత్రి పేర్నినాని. భీమ్లానాయక్ మూవీపై ప్రభుత్వం కక్షసాధిస్తోందన్న చంద్రబాబు ఆరోపణలకు మంత్రి బొత్స కౌంటర్ ఇచ్చారు. బాబుకి ప్రజల సంక్షేమం, అభివృద్ధి పట్టదా అని నిలదీశారు. భీమ్లానాయక్ ఇష్యూపై టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, మంత్రి ఆదిమూలపు సూరేష్ మధ్య జరిగిన సంవాదం ఓసారి చూద్దాం.. కృష్ణా జిల్లా గుడివాడలో మంత్రులకు భీమ్లా నాయక్ సెగ తగిలింది. భాస్కర్ థియేటర్ ఓపెనింగ్‌కు వచ్చిన మంత్రులను అడ్డుకున్నారు జనసేన కార్యకర్తలు. మంత్రులు కొడాలి నాని,పేర్ని నాని కాన్వాయ్‌కు అడ్డుపడ్డారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆందోళనకారులను అరెస్ట్ చేసి గుడివాడ టూ టౌన్ పీఎస్‌కు తరలించారు పోలీసులు. కల్యాణ్ భీమ్లా నాయక్ మూవీ బెనిఫిట్ షోతోపాటు..టిక్కెట్ రేట్లు పెంచుకోనివ్వలేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు పవన్ ఫ్యాన్స్.
మరిన్ని ఇక్కడ చదవండి: