Nandamuri Taraka Ratna : తారకరత్న నివాసానికి సినీతారలు.. శోకసంద్రంలో నందమూరి కుటుంబసభ్యులు
టీడీపీ యువ సారధి నారా లోకేష్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్రలో నందమూరి వారసుడు, సినీ నటుడు తారకరత్న కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే.

నందమూరి తారకరత్న మరణవార్త తెలుగురాష్ట్రాల ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. గత 23 రోజులుగా నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో వెంటిలేటర్ పై ఉన్న తారకరత్న శనివారం రాత్రి కన్నుమూశారు. తారక రత్న మృతదేహాన్ని బెంగులూరు నుంచి హైదరాబాద్ మోకిల లోని తన నివాసానికి తరలించనున్నారు. మరి కొద్దిసేపట్లో మోకిల లోని ది కంట్రీ సైడ్ విల్లా కు చేరుకొనున్న తారక రత్న మృతదేహం. ఏర్పాట్లు చేస్తున్న కుటుంబ సభ్యులు సోమవారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు తెలుగు ఫిలిం ఛాంబర్ లో ప్రజల సందర్శనార్థం ఉంచే అవకాశం ఉంది. సోమవారం సాయంత్రం ఐదు గంటలకి మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
నారా లోకేష్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్రలో నందమూరి వారసుడు, సినీ నటుడు తారకరత్న కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే. పాదయాత్రలో భాగంగా లోకేష్ తో కలిసి నడుస్తుండగా.. తీవ్రమైన గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను కుప్పంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం అక్కడి నుంచి బెంగళూరులోని నారాయణ హృదాయలకు తరలించి, 23 రోజులుగా మెరుగైన వైద్యం అందించారు. విదేశాల నుంచి కూడా వైద్యలును రప్పించి చికిత్స అందించారు. కానీ ఆయన ఆరోగ్యంలో ఎలాంటి మెరుగుదల కనిపించలేదు.
LIVE NEWS & UPDATES
-
తారకరత్న అంత్యక్రియల వివరాలు.. విజయసాయిరెడ్డి..
సోమవారం మహాప్రస్థానంలో తారకరత్న అంత్యక్రియలు నిర్వహిస్తామని చెప్పారు విజయసాయి రెడ్డి. రేపు ఉదయం 9 గంటలకు ఫిలిం ఛాంబర్ కు తారకరత్న భౌతికకాయాన్ని అభిమానుల సందర్శనార్ధం తీసుకువస్తారని, మధ్యాహ్నం 3 గంటలకు తారకరత్న అంత్యక్రియలు నిర్వహిస్తామన్నారు. బాలకృష్ణ నిర్ణయించిన సమయానికే అంత్యక్రియలు చేస్తామని విజయసాయిరెడ్డి ప్రకటించారు.
-
తారకరత్న మరణం బాధించింది… విజయసాయి రెడ్డి..
తారకరత్న మరణం ఎంతో బాధించింది. భర్త మరణంతో అలేఖ్య రెడ్డి మానసిక ఒత్తిడికి గురవుతుంది. బాలకృష్ణ నిర్ణయించిన సమయానికే అంత్యక్రియలు నిర్వహిస్తామని అన్నారు విజయసాయి రెడ్డి.
-
-
తారకరత్న భార్య అలేఖ్యకు అస్వస్థత..
తారకరత్న భార్య అలేఖ్య అస్వస్థతకు గురయ్యారు. ఆహారం తీసుకోకపోవడంతో.. ఆమె నీరసించారు. అలేఖ్యను ఆస్పత్రిలో చేర్చే యోచనలో ఉన్నారు కుటుంబ సభ్యులు.
-
తారకరత్న ఇంటికి వైఎస్ షర్మిల..
రంగారెడ్డి జిల్ల మోకిలలోని తారకరత్న ఇంటికి చేరుకుని.. ఆయన పార్థివదేహానికి నివాళులు అర్పించారు వైఎస్ షర్మిల.
-
తారకరత్న భౌతికకాయానికి కొడాలి నాని నివాళులు..
తారకరత్న భౌతికకాయానికి మాజీ మంత్రి.. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని నివాళులు అర్పించారు. అనంతరం అక్కడే ఉన్న వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డితో మాట్లాడారు.
-
-
తారకరత్న భౌతికకాయాన్ని చూసి చిన్నపిల్లాడిలా ఏడ్చిన బాలయ్య..
తారకరత్న భౌతికకాయాన్న చూసి గుండె పగిలేలా ఏడ్చారు బాలకృష్ణ. తారకరత్న గుండెపోటుకు గురైనప్పటి నుంచి తన వెంటే ఆసుపత్రిలో ఉండి ప్రతి క్షణం దగ్గరుండి చూసుకున్నారు. తారకరత్న ఆరోగ్యం కోసం మృత్యుంజయ హోమాన్ని నిర్వహించారు.
-
తారకరత్న మృతిపై దగ్గుబాటి పురందేశ్వరి భావోద్వేగం..
తారకరత్న మృతి పై ఎన్టీఆర్ కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరి ఎమోషనల్ ట్వీట్ చేశారు. తనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ‘చక్కటి చిరునవ్వు.. అత్తా అనే పిలుపు.. నీ నుంచి ఇంకా వినకపోవచ్చు. కానీ.. నువ్వేప్పుడు మా హృదయంలో.. మదిలో.. స్మృతిలో చిరంజీవిగా ఉంటావు. లవ్ యూ తారక రత్న’ అంటూ ట్వీట్ చేశారు.
చక్కటి చిరునవ్వు! అత్తా అనే పిలుపు!
నీ నుండి ఇంకా వినక పోవచ్చు. కానీ నువ్వేప్పుడు మా హృదయంలో, మదిలో, స్మృతిలో చిరంజీవిగా ఉంటావు!!
లవ్ యు తారక రత్న!!! pic.twitter.com/PisojHcqvc
— Daggubati Purandeswari ?? (@PurandeswariBJP) February 19, 2023
-
తారకరత్న భౌతికకాయానికి నివాళులు..
తారకరత్న భౌతికకాయానికి నారా బ్రహ్మణి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబాన్ని పరామర్శించారు.
-
తారకరత్న ఇంటికి బాలయ్య.
తారకరత్న భౌతికకాయానికి నివాళులర్పించారు బాలకృష్ణ. ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. కాగా తారకరత్న ఆసుపత్రిలో చేరినప్పటినుంచి దగ్గరుండి చూసుకున్నారు బాలయ్య.
-
గుండె పగిలిపోయింది.. అల్లు అర్జున్.
తారకరత్న మరణవార్త విని చాలా బాధపడ్డాను.. ఆయన చాలా త్వరగా వెళ్లిపోయారు. ఆయన కుటుంబానికి.. స్నేహితులకు.. అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి. తారకరత్న ఆత్మకు శాంతి చేకూరాలి అంటూ ట్వీట్ చేశారు.
Heartbroken to learn of the passing away of #TarakaRatna garu. Gone to soon ?. My deepest condolences to his family, friends & fans. May he rest in peace.
— Allu Arjun (@alluarjun) February 18, 2023
-
తారకరత్న ఇంటికి చిరంజీవి..
తారకరత్న ఇంటికి చేరుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించారు.
-
చాలా త్వరగా వెళ్లిపోయావు సోదరా.. మహేష్ బాబు..
తారకరత్న మరణవార్త తనను షాక్ కు గురించేసిందని అన్నారు మహేష్ బాబు. చాలా త్వరగా వెళ్లిపోయావు సోదరా.. ఈ దుఃఖ సమయంలో మీ కుటుంబానికి మనోధైర్యం కలిగించాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను అంటూ ట్వీట్ చేశారు.
Shocked and deeply saddened by the untimely demise of #TarakaRatna. Gone way too soon brother… My thoughts and prayers are with the family and loved ones during this time of grief. ?
— Mahesh Babu (@urstrulyMahesh) February 18, 2023
-
దారుణమైన నిజం జీర్ణించుకోలేకపోతున్నాను.. రాజశేఖర్..
నందమూరి తారకరత్న మృతిపట్ల టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ స్పందిచారు. తారకరత్న ఇక లేడన్న దారుణమైన నిజాన్ని అంగీకరించడానికి గుండె బద్ధలవుతోందని అన్నారు. ఎంతో సౌమ్యుడు.. వినయశీలి, ప్రేమ పూర్వకంగా మెలిగి వ్యక్తి అని కొనియాడారు. ప్రియమైన సోదరుడా.. నువ్విక మాకు లేవు.. కానీ నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాం. ఈ పెను విషాదాన్ని ఎదుర్కొనేందుకు తారకరత్న కుటుంబసభ్యులకు మనో ధైర్యాన్ని ప్రసాదించాలని దేవుడిని ప్రార్ధిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు రాజశేఖర్.
So heart breaking to accept this brutal fact… #TarakRatna was such a soft,humble,loving person.. love you and will miss you forever dear brother … may God give all the strength to his family and friends to bear this huge loss..
— Dr.Rajasekhar (@ActorRajasekhar) February 19, 2023
-
తారకరత్న అంత్యక్రియల వివరాలు..
తారకరత్న భౌతిక కాయానికి రేపు అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఉదయం ఏడు నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు అభిమానుల సందర్శనార్థం భౌతికకాయాన్ని ఫిల్మ్ చాంబర్‌లో ఉంచుతారు. తారక్ అకాలమృతిపై ప్రధాని మోదీ, సీఎంలు కేసీఆర్, జగన్ సహా తెలుగురాష్ట్రాల రాజకీయ, సినీ ప్రముఖులు ప్రగాఢ సంతాపం ప్రకటించారు.
-
తారకరత్న లేకపోవడం బాధాకరం: రాజేంద్రప్రసాద్
తారకరత్న లేకపోవడం బాధాకరం అన్నారు రాజేంద్రప్రసాద్. చిన్న వయసులోనే గుండె పోటు తో చనిపోవడం షాక్ గురి చేసింది.. తారక్ కు ఎంతో భవిష్యత్ ఉంది.. అందరితో మంచి వాడనిపించుకున్నాడు.. అందరితో సన్నిహితంగా ఉండే వాడు.. మంచి మిత్రుడిని కోల్పోయాను అని ఎమోషనల్ అయ్యారు
-
భగవంతుడు కరుణించలేకపోయాడు : చంద్రబాబు
23 రోజులు మృత్యువుతో పోరాడి తారకరత్న చనిపోయారు. కోలుకొని ఆరోగ్యంగా తిరిగివస్తాడని అనుకున్నాం.. కానీ భగవంతుడు కరుణించలేకపోయాడు అంటూ భావోద్వేగానికి గురయ్యారు చంద్రబాబు
-
తారకరత్న ఇంటికి చేరుకున్న లోకేష్
తారకరత్న ఇంటికి చేరుకున్న లోకేష్. పాదయాత్రకు మధ్య బ్రేక్ ఇచ్చి వచ్చిన లోకేష్
-
ముచ్చటపడి ఇల్లు కట్టించుకున్న తారకరత్న
హైదరాబాద్ శివారు శంకరపల్లిలోని మోకిల దగ్గర ఇంటిని చాలా ముచ్చటపడి కట్టించుకున్నారు తారకరత్న. ఇంటీరియర్ డిజైన్ మొదలు ప్రతిదీ తనకు నచ్చినట్టు, తన అభిరుచికి తగ్గట్టు ప్లాన్ చేసుకున్నారు. భార్య ముగ్గురు పిల్లలతో జీవితం హాయిగా సాగిపోతున్న సమయంలో హార్ట్ ఎటాక్ రూపంలో మృత్యువు కబళించేసింది.
-
తారకరత్న నివాసానికి చేరుకున్న చంద్రబాబు నాయుడు
తారకరత్న నివాసానికి చేరుకున్న చంద్రబాబు నాయుడు.. కుటుంబ సబ్యులకు దైర్యం చెప్పిన చంద్రబాబు
-
ఎన్టీఆర్ భావోద్వేగం
తారకరత్న పార్ధివదేహాన్ని చూసి భావోద్వేగానికి లోనైన ఎన్టీఆర్.. బరువెక్కిన గుండెతో అన్నకు నివాళులు అర్పించారు ఎన్టీఆర్
-
ఎన్టీఆర్‌ను ఓదార్చిన విజయ్ సాయి రెడ్డి
విజయ్ సాయి రెడ్డి, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తారకరత్న నివాసానికి చేరుకున్నారు. ఎన్టీఆర్ ను విజయ్ సాయి రెడ్డి ఓదార్చారు. అనంతరం కొంత సమయం విజయ్ సాయి రెడ్డి, ఎన్టీఆర్ మాట్లాడుకుంటూ కనిపించారు.
-
తారకరత్న నివాసానికి జూనియర్ ఎన్టీఆర్
తారకరత్న పార్టీవ దేహానికి ఎంపీ విజయసాయి రెడ్డి నివాళులు అర్పించారు. తారకరత్న నివాసానికి జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ చేరుకున్నారు.
-
తారకరత్న మృతి పై ప్రధాని దిగ్బ్రాంతి
Pained by the untimely demise of Shri Nandamuri Taraka Ratna Garu. He made a mark for himself in the world of films and entertainment. My thoughts are with his family and admirers in this sad hour. Om Shanti: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 19, 2023
-
తండ్రిని చూసి వెక్కి వెక్కి ఏడుస్తున్న కూతురు
తారకరత్న భౌతికకాయాన్ని బెంగళూరు నుంచి అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు తరలించారు. తారకరత్న చూసి కన్నీరుమున్నీరవుతున్నారు కుటుంబసభ్యులు. తారకరత్న కుమార్తె తండ్రిని చూసి వెక్కి వెక్కి ఏడుస్తున్న దృశ్యం అందరినీ కలిచివేస్తోంది.
-
కన్నీరుమున్నీరు అవుతోన్న కుటుంబసభ్యులు
తీవ్ర శోకం.. విగతజీవిగా ఉన్న తారకరత్నను చూసి కన్నీరుమున్నీరు అవుతోన్న కుటుంబసభ్యులు.
-
తారకరత్న చివరిగా నటించిన వెబ్ సిరీస్
తారకరత్న చివరిగా నటించిన 9 హవర్స్ వెబ్ సిరీస్ .. డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
-
నందమూరి తారకరత్నకు మరోపేరు..
నందమూరి తారకరత్నకు మరోపేరు నందమూరి ఓబులేసు..
-
హైదరాబాద్ చేరుకున్న తారకరత్న పార్థివదేహం
తారకరత్న పార్థివదేహం హైదరాబాదు కు చేరుకుంది. మరికాసేపట్లో ఫిలిం ఛాంబర్ కు తరలించనున్నారు.
-
ఆ ఆశలు నెరవేరకుండానే తుదిశ్వాస విడవటం దురదృష్టకరం: పవన్ కళ్యాణ్
శ్రీ నందమూరి తారకరత్న ఆత్మకు శాంతి చేకూరాలి..నటుడు శ్రీ నందమూరి తారకరత్న కన్నుమూయడం బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను. గత మూడు వారాలుగా బెంగళూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీ తారకరత్న కోలుకొంటారని భావించాను. ఆయన నటుడిగా రాణిస్తూనే ప్రజా జీవితంలో ఉండాలనుకొన్నారు. ఆ ఆశలు నెరవేరకుండానే తుదిశ్వాస విడవటం దురదృష్టకరం. శ్రీ తారకరత్న భార్యాబిడ్డలకి, తండ్రి శ్రీ మోహనకృష్ణ గారికి, బాబాయి శ్రీ బాలకృష్ణ గారికి, ఇతర కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను – పవన్ కళ్యాణ్ అధ్యక్షులు
-
తారకరత్న మృతికి సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు దిగ్బ్రాంతి
తారకరత్న మృతికి దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు
-
మహాప్రస్థానంలో అంత్యక్రియలు
సోమవారం సాయంత్రం ఐదు గంటలకి మహాప్రస్థానంలో అంత్యక్రియలు
-
సోమవారం తెలుగు ఫిలిం ఛాంబర్‌కు భౌతికకాయం
సోమవారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు తెలుగు ఫిలిం ఛాంబర్ లో ప్రజల సందర్శనార్థం ఉంచే అవకాశం.
-
23 రోజులుగా మృత్యువుతో పోరాటం..
గత 23 రోజులుగా నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో వెంటిలేటర్ పై ఉన్న తారకరత్న శనివారం రాత్రి కన్నుమూశారు..
Published On - Feb 19,2023 6:19 AM




