Krishnam Raju Demise: రెబల్‌స్టార్‌ మృతి పట్ల చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి.. ఆయన మరణం తెలుగు నేలకు తీరని లోటు అంటూ..

|

Sep 11, 2022 | 10:55 AM

Chandrababu Naidu: రెబల్‌స్టార్‌ కృష్ణం రాజు (Krishnam Raju) మరణంతో ఆయన అభిమానులు శోక సంద్రంలో మునిగిపోయారు. వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు ఆయన మృతిపట్ల విచారం వ్యక్తం చేస్తున్నారు.

Krishnam Raju Demise: రెబల్‌స్టార్‌ మృతి పట్ల చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి.. ఆయన మరణం తెలుగు నేలకు తీరని లోటు అంటూ..
Chandrababu Naidu
Follow us on

Chandrababu Naidu: రెబల్‌స్టార్‌ కృష్ణం రాజు (Krishnam Raju) మరణంతో ఆయన అభిమానులు శోక సంద్రంలో మునిగిపోయారు. వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు ఆయన మృతిపట్ల విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రెబల్‌స్టార్‌ మరణవార్త విని తీవ్ర దిగ్ర్భాంతికి గురయ్యారు. ‘ప్రముఖ నటులు, మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజు గారి మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. నటునిగా విభిన్న పాత్రలలో మెప్పించిన ఆయన రాజకీయాలలో కూడా నిజాయతీతో ప్రజలకు సేవలు అందించారు. ఆయన మృతి తెలుగు నేలకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

 

సినీ, రాజకీయ రంగాల్లో చెరగని ముద్ర
ఇక సినీ, రాజకీయ రంగాల్లో కృష్ణంరాజు గారిది చెరగని ముద్ర అని నారా లోకేశ్ ట్వీట్ చేశారు. ‘విలక్షణ నటనతో ప్రేక్షకుల మదిలో రెబల్ స్టార్ గా ఎదిగారు. ప్రజా సేవే లక్ష్యంగా రాజకీయాల్లోకి ప్రవేశించి కేంద్ర మంత్రిగా ఎంతో కృషి చేశారు. ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నాను. వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నాను. కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’ అని అందులో రాసుకొచ్చారు లోకేశ్‌.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..