Taraka Ratna: తారకరత్న ఫొటోలతో తనయుడు తనయ్‌ రామ్‌.. పెద్దయ్యాక నాన్నలా అవుతానంటూ..

తారకరత్న ఇప్పుడు మన మధ్య లేడన్న నిజాన్నిచాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక తారకరత్న భార్య, పిల్లలైతే నిత్యం ఆయన జ్ఞాపకాల్లోనే జీవిస్తున్నారు. భార్య అలేఖ్యా రెడ్డి, కూతురు నిష్క నిత్యం తారకరత్నను గుర్తు చేసుకుంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు షేర్‌ చేస్తున్న ..

Taraka Ratna: తారకరత్న ఫొటోలతో తనయుడు తనయ్‌ రామ్‌.. పెద్దయ్యాక నాన్నలా అవుతానంటూ..
Taraka Ratna Family

Updated on: Mar 29, 2023 | 4:28 PM

నటుడు నందమూరి తారకరత్న అకాల మరణం అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ రాణించాలనే తలంపుతో నారా లోకేశ్‌ పాదయాత్రకు వెళ్లిన అయాన హఠాత్తుగా గుండెపోటుకు గురయ్యాడు. సుమారు 23 రోజుల ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడి కన్నుమూశాడు. తారకరత్న చిన్న వయసులోనే కన్నుమూయడంతో నందమూరి కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. తారకరత్న ఇప్పుడు మన మధ్య లేడన్న నిజాన్నిచాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక తారకరత్న భార్య, పిల్లలైతే నిత్యం ఆయన జ్ఞాపకాల్లోనే జీవిస్తున్నారు. భార్య అలేఖ్యా రెడ్డి, కూతురు నిష్క నిత్యం తారకరత్నను గుర్తు చేసుకుంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు షేర్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా తారకరత్న సతీమణి అలేఖ్య మరో ఎమోషనల్‌ పోస్ట్‌ చేసింది. ఇప్పటివరకుఎక్కువగా తన పెద్ద కూతురు నిష్క ఫొటోలనే షేర్‌ చేసుకున్న ఆమె తాజాగా తనయుడు తాన్యారామ్‌ ఫొటోలను ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకుంది. ఇందులో ఆమె కుమారుడు తారకరత్న ఫొటోలు పట్టుకుని కనిపించడం మనం చూడవచ్చు. ఈ ఫొటోలకు ‘పెద్దయ్యాక నాన్నలా అవుతాను’ అనే క్యాప్షన్‌ ఇచ్చారు.

ప్రస్తుతం అలేఖ్య ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారియి. తనయ్ రామ్  ఫొటోలను పట్టుకుని ఉన్న ఈ ఫొటోలు అందరి హృదయాలను హత్తుకుంటున్నాయి. కాగా తారకరత్న కూతురు నిష్క ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదట తండ్రి తారక రత్నతో దిగిన ఫొటోను నిష్క పోస్ట్ చేసింది. దీనికి క్యాప్షన్ ఏమీ ఇవ్వలేదు కానీ రెండు లవ్ ఎమోజీలను జత చేసింది. ఆ తర్వాత తారక రత్న, అలేఖ్యా రెడ్డి ఫొటోను షేర్‌ చేసి.. ‘మై పేరెంట్స్! వీళ్లే నా బలం, నా ప్రేమ’ అని క్యాప్షన్‌ ఇచ్చింది. అలాగే తన తండ్రితో గేమ్‌ ఆడుతున్న వీడియోను షేర్‌ చేసింది.

ఇవి కూడా చదవండి

Alekhya Reddy Post