బాలయ్య సినిమాలో తారకరత్న !

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ప్రస్తుతం ఓ మూవీ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే.

బాలయ్య సినిమాలో తారకరత్న !
Follow us

|

Updated on: Nov 03, 2020 | 2:35 PM

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ప్రస్తుతం ఓ మూవీ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. కరోనా వ్యాప్తి కారణంగా ఆగిపోయిన ఈ మూవీ షూటింగ్  ఇటీవల ప్రారంభమైంది. కాగా  ఈ మూవీ నుంచి ఓ ఆసక్తికర అప్‌డేట్ బయటకొచ్చింది. ఇందులో మరో నందమూరి హీరో తారకరత్న నటిస్తున్నారని సమాచారం. నెగిటివ్​ షేడ్స్​ ఉన్న ఓ రాజకీయ నాయకుడిగా ఆయన కనిపించనున్నారట.

తమన్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘ఫస్ట్ రోర్‌’కు అదిరిపోయే  రెస్పాన్స్  వచ్చింది. గతంలో సింహా, లెజెండ్ వంటి బ్లాక్‌బాస్టర్స్ అందించారు  బాలయ్య-బోయపాటి. మరి ఈ సారి మూవీతో హ్యాట్రిక్ కొడతారో, లేదో చూడాలి.

Also Read :

కేఎఫ్‌సీ స్టైల్ చికెన్ వండిన చిరు

డాన్​గా కనిపించనున్న పవన్!